విక్రయాలకు సిద్దంగా బెస్ట్ బిఎస్-IV కార్లు

Written By:

సుప్రీం కోర్టు దేశీయంగా అన్ని బిఎస్-III వాహనాల విక్రయాలను రద్దు చేసింది. అయితే కార్ల తయారీ సంస్థలు తెలివిగా ముందుగానే తమ కార్లను బిఎస్-IV అప్‌గ్రేడ్స్‌తో మార్కెట్లోకి విక్రయాలకు సిద్దం చేశాయి. వాతావరణంలోకి వాహనాల ద్వారా విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్(బొగ్గు పులుసు వాయు) పరిమానాన్ని తగ్గించడానికి దోహదపడే బిఎస్-IV గల ఇంజన్‌లున్న వెహికల్స్ భాద్యత గల పౌరుడిగా కొనుగోలు చేయాలి.

మీరు కార్ల ప్రియులయితే, ప్రస్తుతం విపణిలో బిఎస్-IV అప్‍‌గ్రేడ్స్‌తో అందుబాటులో ఉన్న అత్యుత్తమ కార్ల గురించి ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

రెనో క్విడ్

రెనో క్విడ్

చాలా మంది క్విడ్ కారును ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌గా చూసే కాలం పోయింది. ఎస్‌యూవీ తరహా స్టైలిష్ బాడీ మరియు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థకు భారీ విజయాన్ని సాధించిపెట్టింది.

బెస్ట్ బిఎస్-IV కార్లు

రెనో క్విడ్ సాంకేతికంగా 800సీసీ మరియు 1.0-లీటర్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. చిన్న ఇంజన్ గల క్విడ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 1.0-లీటర్ వేరియంట్ క్విడ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో అందుబాటులో ఉంది.

రెనో క్విడ్ ధరను తెలుసుకోండి...

టాటా టియాగో

టాటా టియాగో

ప్రతి సామాన్యుడు కూడా కొనగల కారు టియాగో. ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో విడుదలైన ఇందులో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లో సాధ్యం కాని విధంగా హార్మాన్ మ్యూజిక్ సిస్టమ్, టర్న్-బై-టర్న్ న్యావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బెస్ట్ బిఎస్-IV కార్లు

సాంకేతికంగా టియాగోలో 1.2-లీటర్ సామర్థ్యం గల డీజల్ మరియు 1.05-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌లు కలవు. వీటిని ఆటోమేటిక్ మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో ఎంచుకోవచ్చు.

మీ నగరంలో టాటా టియాగో ఆన్ రోడ్ మరియు ఎక్స్-షోరూమ్ ధరలు తెలుసుకోండి...

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి యొక్క బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్ క్యాబిన్ స్పేస్ మరియు ఎక్కువ మైలేజ్‌కు పేరుగాంచిన మోడల్. డిజైన్ పరంగా ఒకటే పంథాను కొనసాగిస్తున్నప్పటికీ తమ విసృతమైన విక్రయ కేంద్రాల మరియు సర్వీసింగ్ సెంటర్ల ద్వారా మంచి సక్సెస్‌ను అందుకుంది.

బెస్ట్ బిఎస్-IV కార్లు

బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్‍‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ అదేవిధంగా 1.3-లీటర్ డీజల్ యూనిట్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో ఎంచుకోవచ్చు.

మీ నగరంలో మారుతి స్విఫ్ట్ డిజైర్ ధరలు చెక్ చేయండి....

హోండా సిటి

హోండా సిటి

ప్రీమియ్ సెడాన్ సెగ్మెంట్లో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ బిఎస్-IV మోడల్ కారు హోండా సిటి. అనేక అప్‌గ్రేడ్స్‌తో హోండా తమ సిటి కారును ఈ ఏడాదిలో విడుదల చేసింది. మిగతా ప్రీమియమ్ సెడాన్‌లకు భిన్నంగా సన్ రూఫ్ మరియు డిజిటల్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

బెస్ట్ బిఎస్-IV కార్లు

సాంకేతికంగా సిటి సెడాన్ కారులో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లు కలవు. అందులో 1.5-లీటర్ ఐవిటిఇసి పెట్రోల్ మరియు 1.5-లీటర్ ఐడిటిఇసి డీజల్ ఇంజన్ వేరియంట్లు కలవు. పెట్రోల్ సెడాన్‌లో సివిటి మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ అదే విధంగా డీజల్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కలవు.

మీ నగరంలో హోండా సిటి కార్ల ధరలను తెలుసుకోండి....

మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి తమ ప్రీమియమ్ షోరూమ్ నెక్సా ద్వారా సియాజ్ సెడాన్ కారును అందుబాటులో ఉంచింది. అంటే సియాజ్‌లో స్టాండర్డ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగులు ఉంటాయన్నమాట(నెక్సా ద్వారా లభించే అన్ని కార్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా ఉంటాయి). సియాజ్ లోని డీజల్ వేరియంట్‌ను హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా ఎంచుకోవచ్చు.

బెస్ట్ బిఎస్-IV కార్లు

సాంకేతికంగా మారుతి సియాజ్‌లో 1.4-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లు కలవు. సియాజ్ పెట్రోల్‌ను 4-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ అదే విధంగా డీజల్ వేరియంట్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

మీ నగరంలో మారుతి సియాజ్ ధరలను తెలుసుకోండి...

మారుతి సుజుకి వితారా బ్రిజా

మారుతి సుజుకి వితారా బ్రిజా

మారుతి తమ వితారా బ్రిజాను అందుబాటులోకి తెచ్చినప్పటి నుండి రెండు లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మారుతి తమ వితారా బ్రిజాను అద్బుతంగా నిర్మించింది. దీనికి తోడు క్రూయిజ్ కంట్రోల్, పగటిపూట వెలిగే లైట్లు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో మంచి సక్సెస్ సాధించింది.

బెస్ట్ బిఎస్-IV కార్లు

సాంకేతికంగా వితారా బ్రిజా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.3-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది.

మీ నగరంలో మారుతి వితారా బ్రిజా ధరలను తెలుసుకోండి...

ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్

దేశీయ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి మొదటిసారిగా విడుదలైన మోడల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్. అత్యుత్త రైడింగ్ మరియు హ్యాండ్లింగ్ విషయంలో మంచి మార్కులు సాధించింది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, తాకే తెర ఇన్ఫోటైన్‌ సిస్టమ్ మరియు ఫోర్డ్ సింక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బెస్ట్ బిఎస్-IV కార్లు

సాంకేతికంగా ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీలో 1.0-లీటర్ ఎకో బూస్ట్ ఇంజన్, 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లు కలవు.

మీ నగరంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధరలను తెలుసుకోండి...

రెనో డస్టర్

రెనో డస్టర్

ఇండియన్ మార్కెట్లో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గల ఏకైక సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో డస్టర్. అత్యత్తమ రైడింగ్ లక్షణాలతో బెస్ట్ ఆల్ వీల్ డ్రైవ్ ఎస్‌యూవీగా మంచి విజయాన్నే సాధించింది. తన స్టైలిష్ ఎక్ట్సీరియర్ లక్షణాలతో భారీ కస్టమర్లకు చేరువయ్యింది.

బెస్ట్ బిఎస్-IV కార్లు

రెనో డస్టర్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులోని 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ వేరియంట్ రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేస్తుంది అవి, 84బిహెచ్‌పి మరియు 108బిహెచ్‌పి. మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ కూడా కలదు.

రెనో డస్టర్ ధరలను తెలుసుకోండి...

హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా

ధర పరంగా మిగతా కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోల్చుకుంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది, అయినప్పటికీ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా నిలిచింది. అత్యుత్తమ నాణ్యత గల ఉత్పత్తుల లైనప్‌లో క్రెటా ఒకటి. బిఎస్-IV అప్‌గ్రేడ్స్ గల క్రెటా ను కూడా మీరు ఎలాంటి భయం లేకుండా ఎంచుకోవచ్చు.

బెస్ట్ బిఎస్-IV కార్లు

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్‌లను అందించింది.

మీకు నచ్చిన నగరంలో హ్యుందాయ్ కార్ల ధరలు తెలుసుకోండి....

 
English summary
Here Are The Most Popular BS-IV Cars You Can Buy Right Now
Story first published: Monday, April 3, 2017, 11:29 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark