ఇండియాలో ఉన్న ఏకైక పోర్షే 911 ఆర్ కారు ఇదే

Written By:

పోర్షే బెంగళూరు సెంటర్ అరుదనైన లిమిటెడ్ 911 ఆర్ కారును దిగుమతి చేసుకుంది. బెంగళూరులోని పోర్షే కార్ల ప్రేమికుడు దీని కొనుగోలు చేసాడు. కారు విషయానికి వస్తే పోర్షే ప్రపంచ వ్యాప్తంగా కేవలం 911 యూనిట్ల పోర్షే 911 ఆర్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. మరియు ఈ అరుదైన కారు ఇండియాలో ఇది ఒక్కటే ఉంది.

పోర్షే 911 ఆర్ లో రేస్ ట్రాక్ తోబుట్టువులయినా మిగతా కార్ల నుండి సేకరించిన సాంకేతికతలను ఇందులో పరిచయం చేయడం జరిగింది. సాంకేతికంగా ఈ లిమిటెడ్ ఎడిషన్ కారులో 4-లీటర్ల సామర్థ్యం ఉన్న ఆరు సిలిండర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కలదు.

పోర్షే 911 ఆర్ లిమిటెడ్ ఎడిషన్ లోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 500బిహెచ్‌పి పవర్ మరియు 460ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మలుపుల్లో సురక్షితమైన ప్రయాణానికి పోర్షే 911 ఆర్ అత్యంత అనువైనది. ఇందులో ప్రత్యేకంగా వెనుక వైపు చక్రాలకు స్టీరింగ్ అనుసంధానాన్ని స్టాండర్డ్‌గా అందివ్వడం వలన స్టీరింగ్‌లో అత్యుత్తమ ఫలితాలను కనబరుస్తుంది. ఖచ్చితత్వమైన మలుపుల్లో మరియు నిర్వహణ అదే విధంగా హ్యాండ్లింగ్‌లో ఈ ఫీచర్ ఎంతో కీలకమైనది.

బాడీ డిజైన్ పరంగా 911 ఆర్ ను చాలా వరకు లైట్ వెయిట్ పదర్థాలతో రూపొందించడం జరిగింది. ఇందులో వెనుక వైపున బూట్ లిడ్ మీద స్పోర్టివ్ స్పాయిలర్ మరియు బాడీ క్రింద డిఫ్యూసర్ అందివ్వడం జరిగింది.

ముందు వైపు బ్యానెట్ అదే విధంగా డోర్లను కార్బన్‌తో తయారు చేశారు మరియు రూఫ్ టాప్‌ను మెగ్నీషియమ్ లోహంతో, వెనుక వైపు మరియు ప్రక్కటద్దాలను తేలికపాటి ప్లాస్టిక్‌తో కారు మొత్తం బరువు 1,370 కిలోలు ఉండే విధంగా నిర్మించారు.

ఈ లిమిటెడ్ ఎడిషన్ పోర్షే 911 ఆర్ ఇంటీరియర్ విషయానికి వస్తే, కార్బన్ బకెట్ సీటు, 360-ఎమ్ఎమ్ ఆర్ స్పెసిఫిక్ జిటి స్టీరింగ్ వీల్ మరియు ఆర్ స్పెసిఫిక్ గేర్‌షిఫ్ట్ లీవర్ కలదు. ముందు వైపు ప్యాసింజర్ కు కనబడే విధంగా లిమిటెడ్ ఎడిషన్ ను సూచిస్తూ 911 ఆర్ బ్యాడ్జి అందివ్వడం జరిగింది.

ఈ లిమిటెడిషన్ ఇండియాకు వచ్చిన తరుణంలో పోర్షే ఇండియా డైరెక్టర్ పవన్ శెట్టి మాట్లాడుతూ, సరికొత్త 911 ఆర్ లిమిటెడ్ ఎడిషన్ పోర్షే బ్రాండ్ విలువను మరింత పెంచింది. పోర్షే క్లాసిక్ 911 కుటుంబం నుండి వచ్చిన ఇది పనితీరు పరంగా రేస్ కార్ తరహా పనితనం కనబరుస్తుందని తెలిపాడు.

లిమిటెడ్ ఎడిషన్ పోర్షే 911 ఆర్ ఇండియాకు వస్తుందన్న ఆలోచన కూడా మాకు లేదు, అలాంటి ఇండియాలో ఈ లిమిటెడ్ ఎడిషన్ ఏకైక కారుకు ఓనర్‌గా మా రెగ్యులర్ కస్టమర్ నిలవడం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపాడు.

పోర్షే కార్లకు మీరు ఫ్యాన్ కాదా... అయితే లాంబోర్గిని సూపర్ కార్ల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.

English summary
This Porsche 911 R Is The Only One In India
Story first published: Saturday, February 25, 2017, 10:55 [IST]
Please Wait while comments are loading...

Latest Photos