నిండు గర్భవతి మీదకు దూసుకెళ్లిన కారు: అక్కడిక్కడే మృతి

Written By:

నోయిడా సిటీ సెక్టార్ 18లో ఓ జంట షాపింగ్ కోసం వెళ్లింది. ఈ జంట మీదకు ఉన్నట్లుండి ఓ కారు వేగంగా దూసుకొచ్చి వారిని తొక్కించుకుంటూ వెళ్లి స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో 28 ఏళ్ల వయసున్న గర్భవతి అక్కడిక్కడే మృతి చెందగా, భర్త కొనఊపిరితో చికిత్స పొందుతున్నాడు.

నిండు గర్భవతి మీదకు దూసుకెళ్లిన కారు

క్షణాల వ్యవధిలో జరిగిన ఈ సంఘటన ఓ చిన్న కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఎన్నో ఆశలతో సంతోషంగా వారి కుటుంబంలోకి అనుకోకుండా వచ్చిన అకాల మృత్యువు కడుపులో ఉన్న 8 నెలల శివుతో సహా, భార్యను ఆ కుటుంబానికి దూరం చేసింది.

Recommended Video - Watch Now!
[Telugu] Mahindra KUV100 NXT Launched In India - DriveSpark
నిండు గర్భవతి మీదకు దూసుకెళ్లిన కారు

వివరాల్లోకి వెళితే, నోయిడా సిటీలోని సెక్టారు 18 లో నిశించే జంట మార్కెట్ నుండి ఇంటికి వెళుతున్న సందర్భంలో హోండా సిటి కారు రివర్స్‌లో వచ్చి భార్యభర్తలిద్దరినీ తొక్కేసింది.

నిండు గర్భవతి మీదకు దూసుకెళ్లిన కారు

ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఇద్దరినీ హుటాహుటిన సెక్టార్ 28లో ఉన్న కైలాష్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అప్పటికే గర్బవతి మరణించిందని, భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిండు గర్భవతి మీదకు దూసుకెళ్లిన కారు

నోయిడాలో నివాసముంటున్న ఈ జంట బారియల్లీ నివాసులను తెలిసింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన 8 నెలల గర్భవతి మరికొన్ని కొన్ని రోజుల్లో ప్రసవించనుందని తెలిసింది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.

నిండు గర్భవతి మీదకు దూసుకెళ్లిన కారు

ప్రమాద వివరాలు గురించి మాట్లాడుతూ, పార్కింగ్ లాబీలో పనిచేస్తున్న 14 సంవత్సరాల వయసున్న బాలుడు పార్కింగ్ లాట్ నుండి కారును బయటకు తీసే సందర్భంలో కారు వేగాన్ని కంట్రోల్ చేయలేక ఈ ప్రమాదం చేసినట్లు పోలీసుల వెల్లడించారు.

నిండు గర్భవతి మీదకు దూసుకెళ్లిన కారు

ప్రమాద స్థలిలో ప్రత్యక్ష సాక్షుల కథన మేరకు, పార్కిగ్ లాట్ నుండి 14 ఏళ్ల బాలుడు కారును వేగంగా డ్రైవ్ చేయడంతో అప్పటికే రెండు కార్లను ఢీకొట్టాడు. అయినా కారు వేగం తగ్గలేదు. రోడ్డు మీద ఉన్న జంటను తొక్కుకుంటూ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయినట్లు తెలిపారు.

నిండు గర్భవతి మీదకు దూసుకెళ్లిన కారు

నోయిడా పోలీసు సర్కిల్ ఆఫీసర్ శ్వేతంబర్ మాట్లాడుతూ, ఈ ప్రమాదానికి కారణమైన బాలుడిని అదుపులోకి తీసుకుని, ఈ ఘటన మీద దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నాడు.

English summary
Read In Telugu: Pregnant Woman Run Over By Reversing Car Near Delhi, Minor Driver Arrested

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark