ప్రొడక్షన్ దశకు చేరుకున్న టిగువాన్‌ను టెస్ట్ చేసిన వోక్స్‌వ్యాగన్

Written By:

జర్మనీకి చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ వ్యాగన్ ఇండియన్ ఎస్‌యూవీ బరిలోకి దిగడానికి సర్వం సిద్దం చేసుకుంది. ఇండియన్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి వోక్స్‌వ్యాగన్ తరపున రానున్న టిగువాన్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో పరీక్షలను పూర్తి చేసుకుని ప్రొడక్షన్ దశకు చేరుకుంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌

మహారాష్ట్రలోని స్కోడా ప్రొడక్షన్ ప్లాంటుకు సమీపంలో వోక్స్‌వ్యాగన్ తమ శక్తివంతమైన టిగువాన్‌కు రహదారి పరీక్షలు నిర్వహిస్తుండగా మీడియా కెమెరా కంటికి చిక్కింది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌

ప్రొడక్షన్ రెడీ మోడల్‌ టిగువాన్ గురించి మరిన్ని ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ మరియు సాంకేతిక వివరాలు కోసం క్రింది స్లైడర్లను గమనిద్దాం రండి...

వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌

వోక్స్‌వ్యాగన్ గ్రూపునకు చెందిన ఎమ్‌క్యూబి ప్లాట్ ఫామ్ ఆధారంగా టిగువాన్ ఎస్‌యూవీని అభివృద్ది చేసింది. మునుపటి టిగువాన్ మోడల్‌తో పోల్చితే ఇండియన్ మార్కెట్ కోసం అభివృద్ది చేసిన మోడల్‌ బరువును 50కిలోల వరకు తగ్గించినట్లు తెలిసింది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌

ఫ్రంట్ డిజైన్‌లో వెడల్పాటి ఫ్రంట్ గ్రిల్ కలదు. ఫ్రంట్ గ్రిల్‌లోని క్రోమ్ స్లాట్లు ఇరువైపులా ఉన్న హెడ్ ల్యాంప్స్ వరకు విస్తరించి ఉన్నాయి. హెడ్ ల్యాంప్ అసెంబుల్‌లో పగటి పూట వెలిగే లైట్ల జోడంపు కలదు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌

టిగువాన్ ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఒక వేరియంట్లోని ఫ్రంట్ డిజైన్‌లో క్రోమ్ సొబగులు ఉండగా మరో వేరియంట్లో లేకపోవడాన్ని గమనించడం జరిగింది. వీటికి కంఫర్ట్ లైన్ మరియు హైలైన్ అనే పేర్లు కూడా ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌

టిగువాన్ ఐదు మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యంతో వస్తోంది. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లాట్‌బాటమ్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఇంటీరియర్‌లో పియానో బ్లాక్ తొడుగులు ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌

దేశీయంగా రానున్న వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టిడిఐ డీజల్ అందిస్తున్నట్లు సమాచారం. ఇది గరిష్టంగా 147బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌

ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్‌కు 7-స్పీడ్ డైరక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్ అందివ్వడం జరిగింది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ టక్సన్ మరియు హోండా సిఆర్-వి లకు గట్టి పోటీనివ్వనుంది.

 

English summary
Read In Telugu Production-Spec Volkswagen Tiguan Spotted Ahead Of Launch
Story first published: Friday, May 12, 2017, 13:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark