నో పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటేనే వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్: సుప్రీం కోర్టు

Written By:

వాహన భీమా పునరుద్దణ(ఇన్సూరెన్స్ రెన్యువల్) విషయంలో సుప్రీం కోర్టు మరో కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. ఇక మీదట వాహన భీమ పునరుద్దణ చేయించే వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్(PUC) సర్టిఫికేట్ తప్పనిసరి అని సుప్రీం కోర్టు తెలిపింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్‌కు నో పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరి

ఈ నియమాన్ని ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని ప్రాంత పరిధిలో ఉండే నివాసులకు వర్తిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. కేంద్ర రాజధాని ప్రాంత పరిధిలో కాలుష్యం అధికమవుతున్న విషయమై వచ్చిన వాదన అనంతరం జస్టిస్ ఎమ్‌బి లోకుర్ మరియు దీపక్ గుప్త లతో కూడిన ధర్మాసనం ఈ నియమాన్ని వెల్లడించింది.

Recommended Video
2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్‌కు నో పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరి

అయితే, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ రెన్యూవల్ ఒక ఏడాదిలో ఎక్కువసార్లు చేయించుకోవాలి, అయితే ఇన్సూరెన్స్ ఏడాదికి ఒక్కసారి మాత్రమే రెన్యూవల్ చేసుకునే అకాశం ఉంజి. కాబట్టి కాలుష్యాన్ని నియంత్రించడానికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ మరియు ఇన్సూరెన్స్ లింక్ చేయడాన్ని తప్పుబట్టింది.

వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్‌కు నో పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరి

పర్యావరణ కాలుష్య నివారణ మరియు నింయత్రణ అథారిటీ తరపు న్యాయవాది అపరజిత సింగ్ వాదనకు సమాధానం ఇస్తూ, వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం చివరగా తీసుకున్న ఒక్కPUC సర్టిఫికేట్ మాత్రమే కాకుండా, చివరి నాలుగు లేదా రెండు PUC సర్టిఫికేట్‌లను సమర్పించాలని పేర్కొన్నాడు.

వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్‌కు నో పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరి

అంతే కాకుండా, పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలను క్రమ పద్దతిలో పర్యవేక్షిస్తూ ఉండాలని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. పొల్యూషన్ చెకప్ కేంద్రాలో వాహనాల పొల్యూషన్ పరిశీలించాడనికి కావాల్సిన సాంకేతికతను వినియోగించడం పట్ల అథారిటీలు బాధ్యత తీసుకోవాలి. ఇలా అయితేనే, పొల్యూషన్ నియమాలను పాటించని వాహనాలను వినియోగించే వారి పట్ల చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.

వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్‌కు నో పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కేంద్ర రాజధాని పరిధిలో గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి కాలుష్యాన్ని నియంత్రించడానికి పాత వాహనాలకు భీమా పునరుద్దరణ చేయించే సమయంలో వాహనానికి చివరిగా తీసుకున్న నాలుగు PUC సర్టిఫికేట్లను తప్పనిసరిగా సమర్పించాలనే నియమాన్ని తీసుకురావడం హర్షించదగిన విషయం.

English summary
Read In Telugu: No Pollution Certificate, No Insurance Renewal: Supreme Court
Story first published: Monday, August 14, 2017, 18:33 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark