రూ. 1.6 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించిన రెనో: ఆఫర్లే ఆఫర్లు...!

Written By:

పండుగ సీజన్‌లో కారు కొనాలని సిద్దమైన కస్టమర్లను ఆకర్షించేందుకు రెనో భారీ డిస్కౌంట్లతో ఆఫర్లను ప్రకటించింది. ఫ్రెంచ్ ప్యాసిజంర్ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియాలో లభించే విసృత శ్రేణి మోడళ్ల మీద గొప్ప తగ్గింపు ఆఫర్లను తీసుకొచ్చింది.

రెనో ఏయే కార్ల మీద ఎలాంటి ఆఫర్లను అందిస్తోంది క్రింది కథనంలో చూద్దాం రండి.....

To Follow DriveSpark On Facebook, Click The Like Button
రెనో పండుగ ఆఫర్లు

రెనో పల్స్

రెనో శ్రేణిలోని ఎంట్రీ లెవల్ కారు పల్స్ లోని అన్ని వేరియంట్ల మీద రూ. 40,000 ల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. డిస్కౌంట్ వద్దనుకునే కస్టమర్లు 4.49 శాతం ఆకర్షణీయమైనవడ్డీ రేటును ఎంచుకోవచ్చు.

రెనో పండుగ ఆఫర్లు

యాక్సిస్, రెనో ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల నుండి 100 శాతం ఆన్ రోడ్ ఫైనాన్స్ కల్పిస్తోంది. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. ఈ పండుగ సీజన్‌లో రెనో పల్స్ ఎంచుకునే కార్పోరేట్ కస్టమర్లకు మరో రూ. 6,000 ల అదనపు డిస్కౌంట్ లభిస్తోంది.

రెనో పండుగ ఆఫర్లు

రెనో స్కాలా

నిస్సాన్ సన్నీ శైలిలో భారీ ఫీచర్లతో నిండిన రెనో స్కాలా సెడాన్ మీద గరిష్టంగా 90,000 రుపాయల డిస్కౌంట్ ప్రకటించింది. పల్స్ కారుకు వర్తించే అవే ఫైనాన్స్ స్కీమ్స్ దీనికి వర్తిస్తాయి. రెనో స్కాలా మీద కార్పోరేట్ కస్టమర్లు మరియు పిఎస్‍‌యు ఉద్యోగులకు ఆరు వేల రుపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తోంది.

Recommended Video
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
రెనో పండుగ ఆఫర్లు

రెనో లాజీ

ఇండియన్ ఎమ్‌పీవీ సెగ్మెంట్లో ఉన్న ఎర్టిగా మరియు ఇన్నోవా క్రిస్టాలతో పోటీపడుతున్న లాజీ మీద లక్ష రుపాయల డిస్కౌంట్ లభిస్తోంది. 2016లో తయారైన లాజీ మోడళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తున్నట్లు రెనో పేర్కొంది. లాజీ లోని ఎస్‌టిడి మరియు ఆర్ఎక్స్ఇ వేరియంట్ల మీద అదనంగా రూ. 30,000 ల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

రెనో పండుగ ఆఫర్లు

రెనో లాజీ స్టెప్‌అవే లాజీ వాహనాల మీద ఒక్క రుపాయితో ఇన్సూరెన్స్, కార్పోరేట్ స్కీమ్ క్రింది బుక్ చేసుకునే వారికి రూ. 7,000 లు మరియు రెనో వారి ఎంచుకోదగిన కొన్ని షోరూమ్‍‌లలో రూ. 10,000 ల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. కేరళ కస్టమర్లకు క్యాష్ డిస్కౌంట్ వర్తించదు, అయితే రూ. 20,000 ల ఓనమ్ ఆఫర్ వర్తిస్తుంది.

రెనో పండుగ ఆఫర్లు

రెనో క్విడ్

రెనో ఇండియాలో అత్యధికంగా విక్రయిస్తున్న మోడల్ క్విడ్. క్విడ్‌లోని దాదాపు అన్ని మోడళ్ల మీద పండుగ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. రెనో క్విడ్ 0.8-లీటర్ మోడల్‌లో ఉచిత సెలబ్రేషన్ కిట్ అందిస్తోంది. ఇందులో పవర్ విండోలు, సీట్ కవర్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లతో పాటు ఫ్రంట్ గ్రిల్, టెయిల్ గేట్, డోర్ హ్యాండిల్స్ మరియు గేర్ షిఫ్ట్ బెజల్ వంటివి క్రోమ్ మెటల్‌తో వచ్చాయి.

రెనో పండుగ ఆఫర్లు

సెలబ్రేషన్ కిట్ గల రెనో క్విడ్‌ను కేంద్ర రాజధాని పరిధిలోని కస్టమర్లకు రూ. 12,799 ల డౌన్‌పేమెంట్‌తో అందిస్తోంది. మరియు దక్షిణ, మధ్య, పశ్చిమ, ఉత్తర భారతదేశంలోనే కస్టమర్లకు 13,499 లు మరియు తూర్పు భారతీయులకు 14,499 ల డౌన్‌పేమెంట్‌తో అందుబాటులో ఉంచింది.

రెనో పండుగ ఆఫర్లు

కస్టమర్లకు సెలబ్రేషన్ కిట్ ఆఫర్ల లేనట్లు రెనో తెలిపింది. అయితే, దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి రెనో క్విడ్ కొనుగోలు మీద 2 గ్రాముల గోల్డ్ కాయిన్ మరియు 8.99 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

రెనో పండుగ ఆఫర్లు

రెనో డస్టర్

రెనో ఇండియా ఈ మధ్యనే డస్టర్ ఎస్‌యూవీని శాండ్‌స్టార్మ్ ఎడిషన్‌లో విడుదల చేసింది. 2016లో తయారైన డస్టర్ లోని అన్ని వేరియంట్ల మీద రెనో గరిష్టంగా 1.6 లక్షల రుపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

రెనో పండుగ ఆఫర్లు

డస్టర్ ఎంచుకునే వారికి రూ. 1 తో ఇన్సూరెన్స్ మరియు కారు లోన్ ద్వారా డస్టర్ కొనుగోలు చేసేవారికి ఆకర్షణీమైన 7.99 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. రెనో వారి ఎంచుకోదగిన కొన్ని విక్రయ కేంద్రాలలో డస్టర్ కొనుగోలు చేసే వారికి రూ. 10,000 ల అదనపు తగ్గింపు లభిస్తుంది.

రెనో పండుగ ఆఫర్లు

కార్పోరేట్ స్కీమ్ క్రింద డస్టర్ ఎస్‌యూవీని సెలక్ట్ చేసుకునే వారికి రూ. 7,000 లు డిస్కౌంట్ లభిస్తోంది. డస్టర్ మీద ఉన్న 1.6 లక్షల రుపాయల డిస్కౌండ్ ఆఫర్ కేరళలో కొనుగోలు చేసే కస్టమర్లకు వర్తించదు, అయితే వీరికి గరిష్టంగా రూ. 20,000 లు తగ్గింపు లభిస్తోంది మరియు డస్టర్ ఆర్ఎక్స్ఎస్ సివిటి వేరియంట్ మీద కూడా ఈ ఆఫర్ వర్తించదు.

గమనిక: అన్ని ఆఫర్లు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే వర్తించును.

English summary
Read In Telugu: renault duster kwid lodgy pulse scala get 1 lakh mega discounts
Story first published: Thursday, September 21, 2017, 10:51 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark