రెనో క్విడ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ విడుదల: పూర్తి వివరాల కోసం...

By N Kumar

ఫ్రెంచ్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ రెనో, ఇండియా విభాగం దేశీయంగా క్విడ్‌లో ఆర్ఎక్స్ఎల్ వేరియంట్‌ను విడుదల చేసింది. స్మార్ట్ కంట్రోల్ ఎఫిషియన్సీ ఇంజన్‌తో విడుదల చేసిన ఇది మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

 ధర వివరాలు

ధర వివరాలు

 • క్విడ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ మ్యాన్యువల్ ధర రూ. 3.54 లక్షలు
 • క్విడ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ ఆటోమేటిక్ ధర రూ. 3.84 లక్షలు
 • రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
  క్విడ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్

  రెనో ఇండియా ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుమిత్ సాహ్నే మాట్లాడుతూ, ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో తమ లైనప్‌ నుండి వచ్చి క్విడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ వేరియంట్‌గా నిలిచింది. ఈ విజయాన్ని కొనసాగించే దిశగా మరో వేరియంట్ పరిచయం చేయడం జరిగిందని తెలిపాడు." దీని విడుదలతో క్విడ్ మరిన్ని రికార్డులను నెలకొల్పే అవకాశం ఉన్నట్లు విశ్వాసం వ్యక్తం చేశాడు.

  క్విడ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్

  రెనో లైనప్‌లో 1.0-లీటర్ స్మార్ట్ కంట్రోల్ ఎఫీషియన్సీ ఇంజన్‌తో లభించే ఆర్ఎక్స్‌టి మరియు ఆర్ఎక్స్‌టి(ఒ) వేరియంట్లకు మంచి డిమాండ్ ఉంది. దీనికి పై స్థానంలో మరో వేరియంట్‌ను పరిచయం చేసినా కూడా ఇదే విధమైన స్పందన ఖచ్చితంగా వస్తుందనే ఉద్దేశ్యంతో ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ విడుదలైంది.

  క్విడ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్

  రెనో ఇప్పుడు 1.0-లీటర్ వేరియంట్ల మీద ఎక్కవ దృష్టి సారిచింది. ప్రత్యేకించి టైర్ 2 మరియు 3 మార్కెట్లను టార్గెట్ చేస్తూ భారత దేశయంలో శక్తివంతంగా ఎదిగేందుకు జరుపుతున్న ప్రయత్నాల్లో భాగం దీనిని విడుదల చేసింది.

  క్విడ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్

  ఈ శక్తివంతమైన ఎస్‌సిఇ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. 1.0-లీటర్ మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ 23.01 కిమీ/లీ మరియు ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ 24.04 కిమీ/లీగా ఉంది.

  క్విడ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్

  వినియోగదారులకు ధరకు తగ్గ విలువలతో, రెనో ఇండియాకు భారీ విక్రయాలు సాధించిపెడుతున్న క్విడ్ ఇప్పుడు 1,30,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేధించింది.

  క్విడ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్

  నూతన రెనో క్విడ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ ఎక్ట్సీరియర్‌లోని డోర్ల మీద స్పీడ్ స్పోర్టివ్ గ్రాఫిక్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మీద డ్యూయల్ టోన్ పెయింట్ జాబ్ కలదు. ఈ వేరియంట్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో ఎంచుకోవచ్చు.

  క్విడ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్

  మారుతికి తలనొప్పి తెప్పిస్తున్న రెనో క్విడ్

  2017 హ్యుందాయ్ ఐ30 వ్యాగన్ ఆవిష్కరణ

  ఒకే రోజు మూడు బైకులను విడుదల చేసిన కెటిఎమ్

Most Read Articles

English summary
Renault Kwid RXL Launched In India; Priced At Rs 3.54 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X