ఐదేళ్లలోపు 12 ఎలక్ట్రిక్ కార్లు 40 అటానమస్ కార్లు: రెనో-నిస్సాన్-మిత్సుబిషి భాగస్వామ్యం

Written By:

2022 నాటికి 12 కొత్త ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది లక్ష్యంతో ఉన్నట్లు రెనో-నిస్సాన్-మిత్సుబిషి భాగస్వామ్యం ప్రకటించింది. ప్రాంకో-జపనీస్ త్రయంబక ఒప్పందం ద్వారా మూడు సంస్థలు సమన్వయంతో వార్షిక వృద్దిని 2022 నాటికి 10 బిలియన్ యూరోలకు పెంచేందుకు "2022 ఒప్పందాన్ని" ప్రతిష్టాత్మక లక్ష్యంగా పెట్టుకున్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
రెనో-నిస్సాన్-మిత్సబిషి భాగస్వామ్యం

ఈ ప్రణాళికలో భాగంగా, 2022 నాటికి రెనో-నిస్సాన్-భాగస్వామ్యం 12 కొత్త ఎలక్ట్రిక్ కార్లను మరియు వివిధ శ్రేణిలో 40 వరకు నూతన అటానమస్ కార్లను తయారు చేయాలనే లక్ష్యంతో ఉన్నాయి. మూడు సంస్థలు తమ వద్ద ఉన్న నాలుగు విభిన్న ఫ్లాట్‌ఫామ్‌ల ఆధారంగా 2022లోపు 90 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

రెనో-నిస్సాన్-మిత్సబిషి భాగస్వామ్యం

మూడు సంస్థల భాగస్వామ్య ఒప్పందపు చైర్మెన్ మరియు సిఇఒ కార్ల్ గోస్న్ మాట్లాడుతూ, "నిస్సాన్-రెనో-మిత్సుబిషి సంస్థల త్రయంబక ఒప్పందం మేరకు 2022 నాటికి మూడు సంస్థ వార్షిక ఆదాయాన్ని 10 బిలియన్ యూరోలకు పెంచే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు."

రెనో-నిస్సాన్-మిత్సబిషి భాగస్వామ్యం

కార్ల్ మాట్లాడుతూ, నిజానికి ఇదొక కఠినమైన ఒప్పందం. అయితే, మూడు విభిన్న సంస్థల వద్ద ఉన్న ఫ్లాట్‌ఫామ్స్, సాంకేతిక పరిజ్ఞానం, పవర్‌ట్రైన్స్ మరియు నెక్ట్స్ జనరేషన్ ఎలక్ట్రిక్, అటానమస్ మరియు కనెక్టెడ్ టెక్నాలజీ ఆధారంతో కలిసి ముందుకెళ్లనున్నట్లు వెల్లడించాడు.

రెనో-నిస్సాన్-మిత్సబిషి భాగస్వామ్యం

అదనంగా, ఈ ఒప్పందంలో 2020 నాటికి కొత్త ఎలక్ట్రిక్ మోటార్లు మరియు బ్యాటరీలను రూపొందించనున్నారు. తరువాత, మూడు భాగస్వామ్యపు సంస్థలు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నాయి. దీంతో 2022 నాటికి 30 శాతం తక్కువ ధరతో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయవచ్చు.

రెనో-నిస్సాన్-మిత్సబిషి భాగస్వామ్యం

ప్రస్తుతం ఉన్న సింగల్ ఛార్జింగ్‌తో 90కిలోమీటర్ల ప్రయాణించే రేంజ్ నుండి 2022 నాటికి 15 నిమిషాల ఛార్జింగ్‌తో 230కిలోమీటర్ల ప్రయాణ పరిధిని పెంచాలని భావిస్తోంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ గరిష్ట ప్రయాణ పరిధిని 600కిలోమీటర్లకు పెంచే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం ఉంది.

రెనో-నిస్సాన్-మిత్సబిషి భాగస్వామ్యం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెనో-నిస్సాన్-మిత్సుభిషి ఒప్పందంతో ఎలక్ట్రిక్ కార్ల చరిత్రలోనే అతి పెద్ద ఒప్పందంగా నిలవనుంది. మూడు సంస్థలు 2017 లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయనున్నాయి. ఈ మూడు సంస్థలు కలిసి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 52 లక్షల 70 వేల యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాయి.

English summary
Read In Telugu: Renault-Nissan-Mitsubishi Aim To Launch 12 Electric Vehicles By 2022
Story first published: Saturday, September 16, 2017, 18:05 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark