డీలర్ 85 వ వార్షికోత్సవానికి ప్రత్యేక కారును రూపొందించిన రోల్స్ రాయిస్!

Written By:

విలాసంవంతమైన కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ డాన్ కారును విభిన్నంగా మేఫెయిర్ ఎడిషన్‌లో ఆవిష్కరించింది. అయితే దీనిని విక్రయాల కోసం కాదట, హెచ్ఆర్ ఓవెన్ రోల్స్ రాయిస్ డీలర్‌షిప్ 85 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ ప్రదర్శించడానికి అభివృద్ది చేసినట్లు రోల్స్ రాయిస్ తెలిపింది.

రోల్స్ రాయిస్ డాన్ మేఫెయిర్ ఎడిషన్‌

పది కాదు, ఇరవై కాదు ఏకంగా 85 సంవత్సరాల పాటు రోల్స్ రాయిస్ కార్లను విక్రయిస్తూ అత్యుత్తమ రోల్స్ రాయిస్ విక్రయ కేంద్రంగా హెచ్ఆర్ ఓవెన్ ప్రసిద్దిగాంచింది. ఇక్కడ ప్రదర్శనకు సిద్దం చేసిన కారులో అనేక లగ్జరీ ఫీచర్లను తొలిసారిగా పరిచయం చేసింది.

రోల్స్ రాయిస్ డాన్ మేఫెయిర్ ఎడిషన్‌

ఇంటీరియర్‌లోని కాపర్ లోహంతో డ్యాష్ బోర్డ్‌ను కలిగిన మొదటి కారు ఇదే. అంతే కాకుండా ఇంటీరియర్‌లోని త్రెడ్ ప్లేట్ల మీద స్పెషల్ కమిషన్ - మేఫెయిర్ ఎడిషన్ వన్ ఆఫ్ వన్ అనే ఆంగ్ల పదాలను ప్రింట్ చేయడం జరిగింది.

రోల్స్ రాయిస్ డాన్ మేఫెయిర్ ఎడిషన్‌

రోల్స్ రాయిస్ ఈ డాన్ మేఫెయిర్ ఎడిషన్ ఎక్ట్సీరియర్ మీద బెర్విక్ బ్రాంజ్ పెయింట్ అందించింది. కాపర్ డ్యాష్ బోర్డ్, స్పీకర్లు మరియు ఆర్కిటిక్ వైట్ కలర్‌లో ఉన్న సీట్లు ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి.

రోల్స్ రాయిస్ డాన్ మేఫెయిర్ ఎడిషన్‌

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ లండన్ ఈ డాన్ మేఫెయిర్ కూపే కారును అభివృద్ది చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న రోల్స్ రాయిస్ మోడల్ కార్లకు ధీటుగా, అద్బుతంగా ఉంది ఈ స్పెషల్ ఎడిషన్ డాన్.

రోల్స్ రాయిస్ డాన్ మేఫెయిర్ ఎడిషన్‌

హెచ్ఆర్ ఓవెన్ డీలర్‌షిప్ వార్షికోత్సవ వేడుకలకు ప్రత్యేకంగా రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ లండన్‌ ఈ అల్ట్రా రేర్ కారును తయారు చేయడం పట్ల రోల్స్ రాయిస్ బ్రాండ్ డైరెక్టర్ క్లాస్ ఆండర్సెన్ హర్షం వ్యక్తం చేశాడు.

రోల్స్ రాయిస్ డాన్ మేఫెయిర్ ఎడిషన్‌

రోల్స్ రాయిస్ ఉత్పత్తి చేసిన ఈ ఏకైక రోల్స్ రాయిస్ డాన్ మేఫెయిర్ ఎడిషన్ కారును లక్కీ కస్టమర్‌కు విక్రయించనున్నట్లు తెలిపాడు. అయితే దీని ధర వివరాలను వెల్లడించలేదు.

English summary
Read In Telugu Rolls-Royce Reveals Unique Dawn Mayfair Edition Model
Story first published: Wednesday, May 24, 2017, 18:26 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark