ఒక ధృడ లక్ష్యం కోసమే మెర్సిడెస్ జి63 ఏఎమ్‌జి కొన్నాను: సద్గురు జగ్గీ వాసుదేవ్

Written By:

జగ్గీ వాసుదేవ్ గారు సద్గురు ఆధ్యాత్మిక వేత్తగా మనందరికీ తెలుసు. సద్గురు గారు ఈ మధ్యనే అత్యంత ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. అయితే ఇంత ఖరీదైన వాహనం ఎందుకు ఎంచుకున్నాడు అని చాలా మంది అనుకోవచ్చు. సద్గురు ఈ వెహికల్‌ కొనుగోలు చేయడం వెనుక ఓ ధృడ లక్ష్యం ఉన్నట్లు తెలిసింది.

సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వామీజి మెర్సిడెస్ ఏఎమ్‌జి

కోయంబత్తూరుకు చెందిన సద్గురు గారు నదుల పరిరక్షణ కార్యక్రమం కోసం ఇషా అనే ఫౌండేషన్ స్థాపించారు. సద్గురు గారు ఈ ఫౌండేషన్‌లో భాగంగా నదులు అంతరించిపోవడాన్ని గురించి ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు.

సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వామీజి మెర్సిడెస్ ఏఎమ్‌జి

భవిష్యత్తు తరాలకు నదులను ఉంచాలి, అంతరించిపోతున్న నదుల సంరక్షణ చేపట్టేందుకు, మరియు నదుల పరిరక్షణ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జగ్గీ వాసుదేవ్ గారు కన్యాకుమారి నుండి హరిద్వార్ వరకు స్వయంగా మెర్సిడెస్ జి63 ఏఎమ్‌జి వాహనాన్ని నడపనున్నారు.

Recommended Video - Watch Now!
2018 Bentley Continental GT Revealed | In Telugu - DriveSpark తెలుగు
సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వామీజి మెర్సిడెస్ ఏఎమ్‌జి

ఆధ్యాత్మిక వేత్త మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి ఎస్‌యూవీలో అంతదూరం ప్రయాణించడం ప్రధానంగా గుర్తించదగిన విషయం. ఎలియన్ గ్రీన్ పెయింట్ స్కీమ్‌లో లభించే దీని ధర రూ. 2.09 కోట్లుగా ఉంది.

సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వామీజి మెర్సిడెస్ ఏఎమ్‌జి

ధనవంతులు, బాగా గుర్తింపు పొందిన వ్యక్తులు మరియు సెలబ్రిటీల ఫ్యావరేట్ వెహికల్ ఇది. ప్రస్తుతం అంబానీ మరియు సినీనటుడు రణబీర్ కపూర్ వద్ద వద్ద మెర్సిడెస్ జి63 ఏఎమ్‌జి ఎస్‌యూవీ ఉంది.

సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వామీజి మెర్సిడెస్ ఏఎమ్‌జి

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి ఎస్‌యూవీలో 5.5-లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్ టుర్బో వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది ఉత్పత్తి చేసే 563బిహెచ్‌‌పి పవర్ మరియు 760ఎన్ఎమ్ టార్క్ 7-స్పీడ్ ట్విన్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు అందుతుంది.

సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వామీజి మెర్సిడెస్ ఏఎమ్‌జి

మెర్సిజెస్ జి63 ఏఎమ్‌జి ఎస్‌యూవీ కేవలం 5.4 సెకండ్ల వ్యవధిలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎలక్ట్రానికల్‌గా ఫిక్స్ చేయబడిన 240కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.

సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వామీజి మెర్సిడెస్ ఏఎమ్‌జి

అత్యంత ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్న మరియు ఎలాంటి రోడ్లనైనా ఎదుర్కొనే కెపాసిటీ గల ఎస్‌యూవీగా మెర్సిడెస్ జి63 ఏఎమ్‌జి గుర్తింపు పొందింది. గరిష్టంగా 205ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటంతో దాదాపు అన్ని రకాల భారతీయ రోడ్లను ఎదుర్కోగలదు.

సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వామీజి మెర్సిడెస్ ఏఎమ్‌జి

సేఫ్టీ పరంగా మెర్సిడెస్ జి63 ఏఎమ్‌జి ఎస్‌యూవీలో ఎనిమిది ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary
Read In Telugu: Sadhguru Jaggi Vasudev chooses Mercedes Benz G63 AMG for his ‘Save Rivers’ mission
Story first published: Tuesday, September 5, 2017, 18:14 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark