గుజరాత్‌లో ప్రొడక్షన్ ప్లాంటును సొంతం చేసుకున్న SAIC: 2019 నుండి కార్ల ఉత్పత్తి

Written By:

ఎమ్‌జి మోటార్స్ ఇండియా భాగస్వామ్యంతో షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ (SAIC) దేశీయంగా అధికారిక కార్యకలాపాలు ప్రారంభించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు, గుజరాత్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి గుజరాత్ ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ (SAIC)

గుజరాత్‌లోని జనరల్ మోటార్స్‌కు చెందిన హలోల్ ప్రొడక్షన్ ప్లాంటును SAIC సంస్థ సొంతం చేసుకుంది. SAIC కార్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులను మంజూరు చేయడానికి గుజరాత్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ (SAIC)

తాజాగా జరిగిన ఎమ్‌ఒయు ప్రకారం, గుజరాత్ ప్లాంటు ద్వారా సుమారుగా 1,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇందుకోసం 2,000 కోట్ల రుపాయల వరకు పెట్టుబడులు పెట్టగా, చైనా కార్ల తయారీ సంస్థకు కావాల్సిన సప్లైయర్ల ద్వారా 1,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ (SAIC)

2019లో కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేనాటికి ఎస్ఎఐసి సంస్థ ఏడాదికి 50,000 నుండి 70,000 యూనిట్ల కార్లను ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎస్ఎఐసి కార్ల వివరాలు మరియు వాటి సేల్స్ అన్ని కూడా ఎమ్‌జి బ్రాండ్ ఆధ్వర్యంలోనే ఉండనున్నాయి.

షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ (SAIC)

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

చైనాకు చెందిన SAIC సంస్థ ఇండియాలో కార్ల తయారీ ఏర్పాటుకు భారత ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపింది. అయితే ఎట్టకేలకు తయారీని ప్రారంభించేందుకు గుజరాత్‌లోని జనరల్ మోటార్స్‌కు చెందిన హలోల్ ప్లాంటును సొంతం చేసుకుంది. SAIC కార్లను ఎమ్‌జి బ్రాండ్ విక్రయించనుంది.

English summary
Read In Telugu SAIC To Acquire General Motors’ Halol Plant
Story first published: Friday, July 7, 2017, 10:34 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark