ఉబర్ మరియు ఓలా కన్నా తక్కువ ధరలకే క్యాబ్ సర్వీసులు: సేవా క్యాబ్స్

Written By:

అత్యంత సరసమైన ధరలకే క్యాబ్ సర్వీసులను అందించేందుకు ఢిల్లీకి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ "సేవా క్యాబ్" ను ప్రారంభించాడు. ఇప్పటికే ఈ క్యాబ్ సర్వీసులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా క్యాబ్ సర్వీసుల మార్కెట్‌ను శాసిస్తున్న ఓలా మరియు ఉబర్‌లకు గట్టి పోటీగా నిలుస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సేవా క్యాబ్ సర్వీస్

మే 19, 2017 న సేవా క్యాబ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కిలోమీటర్‌కు రూ. 5 లను మాత్రమే ఛార్జ్‌ చేయడం గమనార్షం. దేశీయంగా ఓలా మరియు ఉబర్ ఒక్క కిలోమీటర్‍‌కు చెల్లించే ధర కన్నా సేవా క్యాబ్ ధర తక్కువగా ఉంది.

సేవా క్యాబ్ సర్వీస్

ఓలా మరియు ఉబర్‌లకు పనిచేసిన అనంతరం తమకు రావాల్సిన ఆదాయానికి గండి పడటం మరియు న్యాయంగా రావాల్సిన బోనస్‌ల కోసం డ్రైవర్లంతా నిరసన వ్యక్తం చేశారు. తమ స్వంత పరిజ్ఞానానంతోనే సేవా క్యాబ్ సర్వీసులను ఆ సంస్థలకు పోటీగా నెలకొల్పారు.

సేవా క్యాబ్ సర్వీస్

సేవా క్యాబ్ సర్వీసులు ఈ మధ్యనే ప్రారంభమయ్యాయి. మరియు ఢిల్లీలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. సేవా క్యాబ్ మొబైల్ అప్లికేషన్‌ను ఇప్పటికే అనేక మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

సేవా క్యాబ్ సర్వీస్

కస్టమర్లు ఈ సేవా క్యాబ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇ-మెయిల్ మరియు మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి అవి, ఎకో మరియు ఆల్ఫా.

సేవా క్యాబ్ సర్వీస్

సేవా క్యాబ్ చార్జీల విషయానికి వస్తే, రెండు వేరియంట్లలో బేస్ ఫేర్ 40 రుపాయలు మరియు వెయిటింగ్ టైమ్‌ కోసం నిమిషానికి రూ. 1.50 లు, ఎకోలో కిమీకు రూ. 5 మరియు ఆల్ఫాలో కిమీకు రూ. 6 లుగా ఫేర్‌ ఉంది.

సేవా క్యాబ్ సర్వీస్

సేవా క్యాబ్‌ను రోడ్డు మీద ఎక్కడైనా ఆపి రైడ్ ప్రారంభించవచ్చు. ఓలా మరియు ఉబర్ తరహా ఖచ్చితంగా యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సిన అసవరం లేదు. క్యాబ్ డ్రైవర్‍‌కు కస్టమర్ నెంబర్ చెపితే రైడ్ చివర్లో ఫేర్ మొత్తాన్ని చూపిస్తుంది.

English summary
Read In Telugu Sewa Cab Begins Operation
Story first published: Wednesday, May 31, 2017, 15:28 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark