స్కోడా నుండి రానున్న సంచలనాత్మక కారు ఇదే: తొలి టీజర్

Written By:

సిజెక్‌ దేశానికి చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ స్కోడా తమ నూతన "కరోక్" కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం స్కోడా లైనప్‌లో ఉన్న కొడియాక్ ఎస్‌యూవీకి క్రింది స్థానంలో ఈ కరోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకురానుంది.

స్కోడా కరోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

స్కోడా సంస్థ తమ మొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ కరోక్(Karoq)ను మే 18, 2017 న అంతర్జాతీయ ఆవిష్కరణ చేయనుంది. దీనికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంది స్కోడా ఆటో.

స్కోడా కరోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

కరోక్ ఫ్రంట్ డిజైన్‌లో త్రిమితీయ ఆకృతి కలదు (త్రీ డైమెన్షనల్ డిజైన్). ఫ్రంట్ డిజైన్ మొత్తానికి ఓ మంచి ఆకృతిని తీసుకొచ్చేది రేడియేటర్ గ్రిల్, ఇందులో డబుల్ స్లాట్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ అందివ్వడం జరిగింది.

స్కోడా కరోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

కరోక్ లోని ఫ్రంట్ హెడ్ లైట్లను బోహేమియమ్ గ్లాస్ ఆర్ట్ ప్రేరణతో రూపొందించారు. కనురెప్పల మీదున్న వెంట్రుకల తరహాల్లో హెడ్ లైట్ క్రింది భాగంలో ఎనిమిది క్రిస్టలైన్ కట్ గీతలు ఉన్నాయి. బానెట్ మీద స్కోడా లోగో యథావిధిగా కూర్చోబెట్టారు.

స్కోడా కరోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

రియర్ డిజైన్‌లో ప్రధానంగా నిలిచే టెయిల్ లైట్లను ఎల్ఇడి టెక్నాలజీతో ఆంగ్లపు సి-ఆకారంలో డిజైన్ చేసి అందించారు. టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌లో బ్రేక్ లైట్, రియర్ లైట్, మరియు ఫాగ్ లైట్ జోడింపు కలదు.

స్కోడా కరోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

కరోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో నూతనంగా డిజైన్ చేయబడిన డ్యాష్ బోర్డ్ కలదు. ఇందులో అప్పర్ మరియు లోయర్ సెక్షన్లను కూడా రూపొందించారు. డ్యాష్ బోర్డ్ మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దీనికి ఇరువైపులా పెద్ద పరిమాణంలో ఉన్న నిలువుటాకారపు ఏ/సి గొట్టాలున్నాయి.

స్కోడా కరోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

కరోక్ ఇంటీరియర్‌లో నాలుగు డోర్లకు లోపలి పై వైపున స్ట్రిమ్ లైటింగ్ స్ట్రిప్స్ ఉన్నాయి. పది విభిన్నమైన కలర్ లైటింగ్స్ ద్వారా ఇంటీరియర్‌ లైటింగ్‌ను డ్రైవర్ సెలక్ట్ చేసుకోవచ్చు.

స్కోడా కరోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

స్కోడా రివీల్ చేసిన ఫోటోల ప్రకారం ఇందులో 7-స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్(ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్) మరియు ఆప్షనల్‌గా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా కలదు.

స్కోడా కరోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

స్కోడా సంస్థ ప్రస్తుతానికి తొలి ఆవిష్కరణ చేసినప్పటికీ... దీనిని ప్రపంచ వ్యాప్తంగా 2017 ఏడాది మలిసగంలో విడుదల చేయనుంది. అదే సమయంలో స్కోడా ఇండియా విభాగంలో కరోక్ ను దేశీయంగా విడుదల చేయనుంది.

స్కోడా కరోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ప్రస్తుతం తాత్కాలికంగా మార్కెట్ నుండి తొలగించిన స్కోడా యెటి కారును శాస్వతంగా తొలగించి దాని స్థానంలో విపణిలోకి ఈ కరోక్‌ను ప్రవేశపెట్టనున్నారు.

స్కోడా కరోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

స్కొడా ప్రస్తుతం భారత మార్కెట్లో 4 మోడల్(ళ్ల)ను ఆఫర్ చేస్తోంది. స్కొడా కార్ల ధరలు, మోడళ్లు మరియు వేరియంట్ల గురించి తెలియజేయటంలో డ్రైవ్‌స్పార్క్ మీకు సహకరిస్తుంది. స్కొడా అందిస్తున్న ఉత్పత్తుల యొక్క ఎక్స్-షోరూమ్, ఆన్-రోడ్ ధరలు, కలర్ ఆప్షన్స్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరియు భారత్‌లో స్కొడా యొక్క అన్ని కార్ల ఫొటోలను వీక్షించండి.

Read more on: #స్కోడా #skoda
English summary
Read In Telugu Skoda Karoq Teased Ahead Of Global Debut

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark