స్కోడా కొడియాక్ ఇండియా విడుదల వివరాలు వెల్లడి

Written By:

సిజెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియా విభాగం తమ సరికొత్త కొడియాక్ ఎస్‌యూవీని దేశీయ విపణిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు సిద్దం చేసుకుంది. తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకార, ఆగష్టు 10, 2017 న ఇండియన్ మార్కెట్లోకి ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

స్కోడా కొడియాక్

ఆక్టావియా మరియు సూపర్బ్ మోడళ్ల ఆధారంతో, వోక్స్‌వ్యాగన్ వారి ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ మీద కొడియాక్ ఎస్‌యూవీని నిర్మించడం జరిగింది. స్కోడా ఇండియా లైనప్‌లో మూడు వరుసల సీటింగ్ సామర్థ్యం ఉన్న స్కోడా వారి తొలి ఉత్పత్తి కొడియాక్ ఎస్‌యూవీ.

Recommended Video - Watch Now!
2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
స్కోడా కొడియాక్

సాంకేతికంగా స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బోఛార్జ్‌డ్ డీజల్ మరియు 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ వేరియంట్లో రానుంది. ఇందులోని డీజల్ వేరియంట్ 147బిహెచ్‌పి పవర్ మరియు 340ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా పెట్రోల్ వేరియంట్ 177బిహెచ్‌పి పపర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

స్కోడా కొడియాక్

స్కోడా కొడియాక్ ఎస్‌యూవీలోని రెండు ఇంజన్ వేరియంట్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ డైరక్ట్ షిఫ్ట్ గేర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో ఎంచుకోవచ్చు. బహుశా టాప్ ఎండ్ వేరియంట్ కొడియాక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించే అవకాశం ఉంది.

స్కోడా కొడియాక్

సాధారణ భద్రత ఫీచర్లతో పాటు డోర్ ఎడ్జ్ ప్రొటెక్షన్, ఎలక్ట్రిక్ చైల్డ్ సేఫ్టీ లాక్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్లీప్ హెడ్ రెస్ట్ మరియు ఇతర యాక్ససరీలు రానున్నాయి.

స్కోడా కొడియాక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొడియాక్ స్కోడా వారి పూర్తి స్థాయి ఎస్‌యూవీ. దీని ధరల శ్రేణి రూ. 25 లక్షల నుండి 30 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం విపణిలో ఉన్న ఫోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ వంటి ఎస్‌యూవీలకు పోటీగా నిలవనుంది.

English summary
Read In Telugu: Skoda Kodiaq India Unveil Date Revealed
Story first published: Monday, August 7, 2017, 9:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark