భారత్‌లోకి తొలి ఎస్‌యూవీని విడుదల చేసిన స్కోడా: ధర మరియు ఇతర వివరాలు

Written By:

చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ స్కోడా నేడు(04/10/17) ఇండియన్ మార్కెట్లోకి కొడియాక్ ప్రీమియమ్ ఎస్‌యూవీని విడుదల చేసింది. స్కోడా కొడియాక్ ప్రారంభ ధర రూ. 34,49,501 లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

స్కోడా కొడియాక్ వేరియంట్లు, ఇంజన్, ధరలు, ఫీచర్లు, బుకింగ్స్ మరియు డెలివరీలతో పాటు ఇండియన్ మార్కెట్లోకి ఏయే ఎస్‌యూవీలకు ఇది పోటీనిస్తుందో నేటి స్కోడా కొడియాక్ లాంచ్ స్టోరీలో చూద్దాం రండి....

స్కోడా కొడియాక్

స్కోడా కొడియాక్ ప్రీమియమ్ ఎస్‌యూవీ కేవలం స్టైల్ 4x4 ఆటోమేటిక్(Style 4X4 AT) వేరియంట్లో మాత్రమే లభిస్తోంది.

కొడియాక్ ఎస్‌యూవీల డెలివరీలను నవంబర్ తొలి వారంలో ప్రారంభించనుంది. మరియు రూ. 59,999 ల అదనపు చెల్లింపుతో నాలుగేళ్ల వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ మరియు మెయింటెనెన్స్ పొందవచ్చు.

స్కోడా కొడియాక్

స్కోడా కొడియాక్ సాంకేతిక వివరాలు

సాంకేతికంగా స్కోడా కొడియాక్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. 7-స్పీడ్ డిఎస్‌‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 3,500-4,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 148బిహెచ్‌పి పవర్ మరియు 1,750-3,000ఆర్‌పిఎమ్ మధ్య గరిష్టంగా 340ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Recommended Video - Watch Now!
Volkswagen Tiguan Review In Telugu - DriveSpark తెలుగు
స్కోడా కొడియాక్

ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ 7-స్పీడ్ గేర్‌బాక్స్ గుండా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది. కొడియాక్ గరిష్టంగా లీటర్‌కు 16.25కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

కొలతల పరంగా కొడియాక్ పొడవు 4,697ఎమ్ఎమ్, వెడల్పు 1,882ఎమ్ఎమ్, ఎత్తు 1,665ఎమ్ఎమ్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 188ఎమ్ఎమ్‌గా ఉంది. మూడు వరుసల సీటింగ్ కెపాసిటితో పాటు 270-లీటర్ల బూట్ స్పేస్ మరియు చివరి వరుస సీటును మడిపివేయడం ద్వారా 2,005-లీటర్లకు పెంచుకోవచ్చు.

స్కోడా కొడియాక్

స్కోడా కొడియాక్ డిజైన్

స్కోడా తమ కొడియాక్ ఎస్‌యూవీని యూరోపియన్ డిజైన్ లక్షణాలతో నిర్మించింది. పదునైన మరియు ధృడమైన క్యారెక్టర్ లైన్స్‌తో పాటు స్కోడా వారి బటర్ ప్లై ఫ్రంట్ గ్రిల్ ద్వారా కొడియాక్ మంచి ప్రీమియమ్ డిజైన్ లుక్ సొంతం చేసుకుంది. ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు వీటికి క్రిందుగా ఎల్ఇడి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఇవి కార్నరింగ్ లైట్లుగా కూడా పనిచేస్తాయి.

స్కోడా కొడియాక్

18-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ చక్రాలకు 213/55 ఆర్18 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వద్ద ప్రారంభమయ్యి, డోర్ల మీదుగా రియర్ డిజైన్‌లో అంగ్లపు సి-ఆకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ వరకు పొడగించబడిన ఆకర్షణీయమైన క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. రియర్ డోర్ స్వల్పంగా లోపలికి వంచబడిన ఆకారంలో ఉండటంతో టెయిల్ లైట్లు త్రీడీ శైలిలో కనిపిస్తాయి.

స్కోడా కొడియాక్

స్కోడా కొడియాక్ ఫీచర్లు

కొడియాక్ మొత్తం లెథర్ ఇంటీరియర్ కలదు, ముందు సీట్లను 12 రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే అవకాశం మరియు అన్ని అడ్జెస్ట్‌‍మెంట్లను గుర్తుంచుకునే మెమొరీ ఫంక్షన్ కూడా కలదు. మధ్యలో ఉన్న సీటులో ఇరువైపు ప్యాసింజర్ల కోసం హెడ్ రెస్ట్‌లు ఉన్నాయి.

స్కోడా కొడియాక్

స్కోడా కొడియాక్ ఎస్‍‌యూవీలో 8-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 12-స్పీకర్ల 750వోల్ట్ క్యాంటన్ ఆడియో సిస్టమ్‌ అనుసంధానంతో ఉంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మరియు ఫోన్ మిర్రర్ వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేయడంతో పాటు ఏయుఎక్స్, బ్లూటూత్ మరియు విభిన్న ఎస్‌డి కార్డ్ సపోర్ట్ కలదు.

స్కోడా కొడియాక్

చూడటానికి భారీగా కనిపించే ఇందులో పెద్ద పరిమాణంలో ఉన్న ప్యానరోమిక్ సన్ రూఫ్, మల్టిపుల్ స్టోరేజ్ స్పేస్, రెండు గ్లోవ్ బాక్సులు, ముందు డోర్లలో గొడుగులు, డోర్ ప్రొటెక్టర్లు మరియు లగేజ్ స్పేస్‌ వద్ద లైటుగా పనిచేసే మ్యాగ్నెటిక్ టార్చ్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

స్కోడా కొడియాక్

స్కోడా కొడియాక్ ఎస్‌యూవీలోని భద్రత ఫీచర్లు

స్కోడా తమ కొడియాక్‌లో భారీ సేఫ్టీ ఫీచర్లను అందించింది. అవి, 9-ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్ మరియు మల్టి కొల్లిషన్ బ్రేకింగ్ సిస్టమ్(ప్రమాదానికి గురయ్యే సందర్భంలో ఆటోమేటిక్‌గా బ్రేకులు అప్లే అవుతాయి) వంటివి ఉన్నాయి.

స్కోడా కొడియాక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

7-సీటర్ ఎస్‌యూవీ ప్రపంచంలోకి స్కోడా మొట్టమొదటి సారిగా కొడియాక్ ఎస్‌యూవీ ద్వారా ప్రవేశించింది. ధరకు తగ్గ విలువలతో విడుదలైన స్కోడా కొడియాక్ సేఫ్టీ ఫీచర్ల విషయంలో అద్భుతం చేసిందని చెప్పాలి.

ఇక ఇండియన్ మార్కెట్లోని ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్న టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ వెహికల్స్‌కు చెక్ రిపబ్లిక్ సంస్థ స్కోడా తీసుకొచ్చిన కొడియాక్ గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Skoda Kodiaq Launched In India At Rs 34,49,501. Get more details of skoda kodiaq launch, launch, price, mileage, specifications, images

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark