దేశీయంగా విడుదల కానున్న కొడియాక్ ఎస్‌యూవీ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన స్కోడా

Written By:

స్కోడా ఆటో ఇండియన్ మార్కెట్లోకి తమ సరికొత్త ఎస్‌యూవీని విడుదలకు సిద్దం అవుతోంది. ఇప్పటికే తీవ్ర పోటీ గల ఎంట్రీ లెవల్ ఎస్‍‌యూవీ సెగ్మెంట్లోకి స్కోడా లైనప్‌లోకి కొడియాక్ ఎస్‌యూవీ చేర్చుకోనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
స్కోడా కొడియాక్ స్పెసిఫికేషన్స్

ఎన్నో ఆశలు, అవకాశాలతో ఇండియన్ మార్కెట్లోకి తన ప్రస్థానాన్ని కొనసాగించడానికి కొడియాక్ ఎస్‌యూవీని మొట్టమొదటిసారిగా 2016 సెప్టెంబర్‌లో జరిగిన జర్మన్ ఇంటర్నేషనల్ మోటార్ షో వేదిక మీద స్కోడా ఆవిష్కరించింది. ప్రదర్శనానంతరం నెల రోజులకే అంతర్జాతీయ విపణిలోకి కొడియాక్ విడుదలయ్యింది.

స్కోడా కొడియాక్ స్పెసిఫికేషన్స్

సిజెక్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ స్కోడా అభివృద్ది చేసిన తొలి 7-సీటర్ ఎస్‌యూవీ కొడియాక్. వోక్స్‌వ్యాగన్ వారి ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా కొడియాక్‌ను రూపొందించడం జరిగింది. ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ లైనప్‌లో టిగువాన్ ఎస్‌యూవీ కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడిన మోడల్.

స్కోడా కొడియాక్ స్పెసిఫికేషన్స్

స్కోడా కొడియాక్ ఎస్‌యూవీని తమ అత్యాధునిక క్రిస్టలైన్ డిజైన్ భాష ఆధారంగా నిర్మించింది. బాడీ మొత్తం మీద ఆకర్షణీయమైన పదునైన క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. స్కోడా సిగ్నేచర్ బటర్ ఫ్లై ఫ్రంట్ గ్రిల్, ఎల్ఇడి హెడ్ లైట్లు, మరియు టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

స్కోడా కొడియాక్ స్పెసిఫికేషన్స్

ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్లలో లభించే కొడియాక్ అనేక ఇంజన్ ఆప్షన్‌లలో వివిధ రకాల పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో, విభిన్న ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే స్కోడా ఇండియా లైనప్‌లో 1.4-లీటర్ మరియు 2.0-లీటర్ రేంజ్‌ ఇంజన్‌లు ఉన్నాయి.

స్కోడా కొడియాక్ స్పెసిఫికేషన్స్

తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ప్రస్తుతం ఇండియా లైనప్‌లో ఉన్న 1.8-లీటర్ సామర్థ్యం ఉన్న టిఎస్ఐ టుర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టిడిఐ టుర్బో-డీజల్ ఇంజన్ వేరియంట్లలో రానుంది.

స్కోడా కొడియాక్ స్పెసిఫికేషన్స్

ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తా రానుంది. అదే విధంగా టాప్ ఎండ్ వేరియంట్ కొడియాక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించనుంది.

స్కోడా కొడియాక్ స్పెసిఫికేషన్స్

భద్రత పరంగా స్కోడా కొడియాక్ యూరో ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో ఐదుకు ఐదు స్టార్ల రేటింగ్ పొందింది. ఏడు ఎయిర్ బ్యాగులు, లోడ్ లిమిటర్స్ ఉన్న సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్, ఐఎస్ఒఫిక్స్ రియర్ చైల్డ్ సీట్ మౌట్స్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లున్న కొడియాక్ యాంబిషన్ ట్రిమ్‌కు క్రాష్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.

స్కోడా కొడియాక్ స్పెసిఫికేషన్స్

కొడియాక్ ఎస్‌యూవీ అనేక అటానమస్ ఫీచర్లు ఉన్నాయి. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్పీడ్ అసిస్టెన్స్, ఆప్షనల్ లేన్ అసిస్ట్ సిస్టమ్, వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం యూరోపియన్ స్పెక్ కొడియాక్ లో ఉన్న ఫీచర్లు ఇండియన్ స్పెక్ మోడల్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది.

స్కోడా కొడియాక్ స్పెసిఫికేషన్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో 7-సీటింగ్ సామర్థ్యం, శక్తివంతమైన ఇంజన్, ధృడమైన బాడీ, అధిక ఫీచర్లు గల ఎస్‌యూవీలకు డిమాండ్ అధికంగానే ఉంది. స్కోడా తమ కొడియాక్ ఎస్‌యూవీని సెప్టెంబర్ చివరి నాటికి విడుదల చేయనుంది.

English summary
Read In Telugu: Skoda Kodiaq Specifications And Details Revealed For Indian Market
Story first published: Friday, August 11, 2017, 12:30 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark