స్కోడా కొడియాక్ స్కౌట్ 7-సీటర్ ఎస్‌యూవీ రివీల్డ్

Written By:

స్కోడా ఆటో తమ 7-సీటింగ్ సామర్థ్యం ఉన్న కొడియాక్ స్కౌట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అయితే ఇంకా దీనిని విడుదల చేయలేదు. జెనీవాలో జరగనున్న 2017 జెనీవా మోటార్ షో వాహన ప్రదర్శన వేదిక మీద స్కోడా ఈ ఎస్‌యూవీని ప్రదర్శించనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
స్కోడా కొడియాక్ స్కౌట్

స్కోడా కొడియాక్ స్కౌట్ 7-సీటర్ ఎస్‌యూవీ రెండు పెట్రోల్ మరియు రెండు రకాల పవర్ ఉత్పత్తి చేసే ఒక డీజల్ ఇంజన్ కలదు. మూడు ఇంజన్లు ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ స్కోడా వారి ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

స్కోడా కొడియాక్ స్కౌట్

స్కోడా కొడియాక్ స్కౌట్ లోని 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ 148బిహెచ్‌పి పవర్, 2.0-లీటర్ ఇంజన్ 177.5బిహెచ్‌పి పవర్ మరియు ఇందులోని 2.0-లీటర్ డీజల్ ఇంజన్ 148 మరియు 187.4బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

స్కోడా కొడియాక్ స్కౌట్

ఆన్ రోడ్ తో పాటు ఆఫ్ రోడింగ్ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఇందులో 194ఎమ్ఎమ్ గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్ అందివ్వడం జరిగింది. మరియు నాలుగు చక్రాలకు డ్రైవ్ పవర్ సరఫరా అయ్యేందుకు స్కోడా వారి పర్మినెంట్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి.

స్కోడా కొడియాక్ స్కౌట్

ఆఫ్ రోడింగ్‌లో భద్రత పరంగా, ప్రత్యేకించి డ్రైవర్ సౌలభ్యం కోసం డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లయిన ఆఫ్ రోడ్ అసిస్ట్ సిస్టమ్, షాక్ అబ్జర్వర్స్ మరియు థ్రోటిల్ రెప్సాన్స్‌ను అడ్జెస్ట్ చేసుకోవడం, మలుపుల్లో అత్యధిక వేగం వద్ద త్వరగా రెస్పాండ్ అయ్యే వీలున్న యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్ సిస్టమ్‌ వంటి ఫీచర్లు కలవు.

స్కోడా కొడియాక్ స్కౌట్

డిజైన్ పరంగా సరికొత్త కొడియాక్ స్కౌట్ లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ్రంట్ గ్రిల్ ఫ్రేమ్ మీద సిల్వర్ ప్లేట్ కలదు, రూఫ్ రెయిల్స్, మరియు ప్రక్కటద్దాల అంచుల మీద సిల్వర్ వినియోగాన్ని గుర్తించవచ్చు. అంతే కాకుండా ఇందులో 19-అంగుళాల చక్రాలు కలవు.

స్కోడా కొడియాక్ స్కౌట్

స్కోడా తమ అప్ కమింగ్ కొడియాక్ స్కౌట్ ఎస్‌యూవీలో ట్రైలర్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ ట్రాఫిక్ అలర్ట్, ముందు వైపున ప్రాంక్సిమిటి అసిస్ట్ సెన్సింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు ఆటోమేటిక్ పార్కింగ్ వటి భద్రత ఫీచర్లను అందించంది.

స్కోడా కొడియాక్ స్కౌట్

పాఠకుల కోసం మరిన్ని స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ ఫోటోలు

 
Read more on: #స్కోడా #skoda
English summary
Skoda Kodiaq Scout Revealed — Big Bear Gets More Off Road Tech
Story first published: Saturday, January 28, 2017, 12:33 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark