స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ మీద ప్రారంభమైన బుకింగ్స్

Written By:

స్కోడా ఇండియా అధికారికంగా తమ ఆక్టావియా ఆర్ఎస్ సెడాన్ మీద బుకింగ్స్ ప్రారంభించింది. పర్ఫామెనన్స్ ఓరియంటెడ్ మోడల్ ఆక్టావియా ఆర్ఎస్ సెడాన్ కారును రూ. 50,000 ల ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌కు అందిన తాజా సమాచారం మేరకు, స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ సెడాన్ ఆగష్టు 30, 2017 న విపణిలోకి విడుదల కానుంది. అక్టోబర్ తొలి వారం నుండి కస్టమర్లకు డెలివరీ ఇవ్వనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ బుకింగ్స్

స్కోడా ఈ మధ్యనే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఆక్టావియాను విడుదల చేసింది. అయితే త్వరలో విడుదలకు సిద్దమైన ఆక్టావియా ఆర్ఎస్ పర్ఫామెన్స్ మోడల్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. స్పోర్టివ్ లక్షణాలతో రానున్న ఇందులో పవర్‌ఫుల్ ఇంజన్, కాస్మొటిక్ అప్‌డేట్స్, స్పోర్టివ్ బంపర్ మరియు సైడ్ స్కర్ట్స్, పెద్ద చక్రాలు మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు ఉన్నాయి.

Recommended Video - Watch Now!
2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ బుకింగ్స్

శక్తివంతమైన ఆక్టావియా ఆర్ఎస్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభించనుంది. ఇందులోని 2.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ 227బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు, దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ బుకింగ్స్

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ లోని 2.0-లీటర్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 181బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గుండా పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు అందుతుంది. అదే విధంగా స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ డీజల్‌లో ఆప్షనల్ ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ కూడా ఉంది.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ బుకింగ్స్

స్కోడా తమ సెడాన్ కారులో అత్యంత శక్తివంతమైన ఇంజన్‌లను అందించిందని, అవి విడుదల చేసే పవర్ మరియు టార్క్ ఆధారంగా చెప్పవచ్చు. ఇందుకోసం రెండు ఇంజన్‌లలో కూడా ఎలక్ట్రానికల్లి లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ వ్యవస్థను తప్పనిసరిగా అమర్చింది. అంతే కాకుండా కొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పర్ఫామెన్స్ సెడాన్ కార్లను ఎంచుకునే ఔత్సాహికుల్లో స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ సెడాన్ ఇప్పటికే తీవ్ర ఉత్సుకతను రేకెత్తించింది. బుకింగ్స్ ప్రారంభించినప్పటి నుండి ఆక్టావియా ఆర్ఎస్ గురించి డీలర్లను ఎక్కువ మంది సంప్రదిస్తున్నట్లు తెసింది.

English summary
Read In Telugu: Skoda Octavia RS Launch Date Revealed And Bookings Open
Story first published: Friday, August 18, 2017, 18:31 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark