ఆక్టావియా ఆర్ఎస్ ఘోర ప్రమాదం: లక్షల ఖరీదైన కారు, లెక్కలేనన్ని సేఫ్టీ ఫీచర్లు!!

Written By:

చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన దిగ్గజ ఖరీదైన ప్రీమియమ్ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియన్ మార్కెట్లోకి సెప్టెంబర్ 1, 2017 న సరికొత్త ఆక్టావియా ఆర్ఎస్ పర్ఫామెన్స్ సెడాన్ కారును లాంచ్ చేసింది.

ఖరీదైన కార్ల తయారీకి ప్రసిద్ది చెందిన స్కోడా పేరుకు తగ్గట్లుగానే సుమారుగా 24 లక్షల ధరతో ఆక్టావియా ఆర్ఎస్‌ను విడుదల చేసింది. అయితే, సరిగ్గా నెలన్నరోజులు కూడా గడవకమందే తొలి ఘోర ప్రమాదం జరిగింది. ధర ఎంత అయితే, ఏ లాభం ఈ ప్రమాదం ఓ కుటుంబానికి తీరని వేదన మిగిల్చింది.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ యాక్సిడెంట్

ఘటనకు సంభందించిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, స్కోడా ఇటీవల లాంచ్ చేసిన ఆక్టావియా ఆర్ఎస్ పవర్ ఫుల్ సెడాన్ కేరళ రాజధాని నగరం తిరువనంతపురంలో జరిగినట్లు తెలిసింది. అత్యంత ఘోరంగా జరిగిన ఈ ప్రమాదంలో స్థానిక వ్యాపార వేత్త కుమారుడు ఆదర్శ్(20) అక్కడిక్కడే మృతి చెందాడు.

Recommended Video - Watch Now!
[Telugu] 2017 Skoda Octavia RS Launched In India - DriveSpark
స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ యాక్సిడెంట్

తిరువనంతపురంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో రాజ్ భవన్ రోడ్డు అత్యధిక వేగంతో వెళ్లిన స్కోడా ఆక్టావియా కారు ఎదురుగా యు-టర్న తీసుకుంటున్న ఆటో రిక్షాను తప్పించబోయి ప్రక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ యాక్సిడెంట్

ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయిపోంది. కారు శరీర భాగాలన్నీ కూడా కారు నుండి వేరుపడ్డాయి. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ యాక్సిడెంట్

కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గరు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగినపుడు కారును నడుపుతున్న ఏళ్ల వయసున్న ఆదర్శ్ అక్కడిక్కడే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తలకు గాయమైన ఆటో డ్రైవర్ చికిత్స పొందుతున్నాడు.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ యాక్సిడెంట్

స్కోడా విక్రయించే సెడాన్ కార్లలో ఆక్టావియా ఆర్ఎస్ అత్యంత ఖరీదైన కారు. ఇందులో ఎన్నో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు అందించింది. ఎన్ని ఉన్నా కూడా ప్రమాదం జరిగిన తీరు, మితిమీరిన వేగం ఓ కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది.

8 నెలల గర్భవతిని కారుతో తొక్కిెంచేశాడు

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ యాక్సిడెంట్

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ సురక్షితమైన కారు కాదా...? అసలు 24 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయడం సరైనదేనా...? ధరకు తగ్గ విలువలు ఇందులో ఉన్నాయా...? వంటి వివరాలు ఇవాళ్టి కథనంలో....

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ యాక్సిడెంట్

స్కోడా తమ మోస్ట్ పవర్ ఫుల్ వెర్షన్ ఆక్టావియా ఆర్ఎస్ సెడాన్ కారులో 2.0-లీటర్ కెపాసిటి గల టుర్బో ఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 5,500-6,200ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం మధ్య 227బిహెచ్‌పి పవర్ మరియు 1,500-4,500ఆర్‌పిఎమ్ మధ్య 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ యాక్సిడెంట్

6-స్పీడ్ డైరక్ట్ షిప్ట్ గేర్‌బాక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ మొత్తాన్ని ఫ్రంట్ వీల్స్‌కు సరఫరా చేస్తుంది. సరికొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 6.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్టం వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ యాక్సిడెంట్

ఆక్టావియా ఆర్ఎస్ లో 9 ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ వంటి అన్ని ఫీచర్లను తప్పనిసరిగా అందించింది.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ యాక్సిడెంట్

ఎలాంటి ప్రమాదం జరిగినా ఎదుర్కొనే విధంగా ఆక్టావియా ఆర్ఎస్ సెడాన్ కారును స్కోడా నిర్మించింది. నాణ్యమైన శరీర నిర్మాణంతో స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ సొంతం. అంతర్జాతీయంగా నిర్వహించే క్రాష్ పరీక్షల్లో ఆక్టావియా ఆర్ఎస్ సురక్షితమైన కారు మంచి రేటింగ్ దక్కించుకుంది. ఇండియాలో ధరకు తగ్గ విలువలు గల పవర్ ఫుల్ సెడాన్ అని చెప్పవచ్చు.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ యాక్సిడెంట్

తప్పెవరిది?

మితిమీరిన వేగం మరియు అనుభవలేమి ఇందుకు ప్రధాన కారణాలని చెప్పవచ్చు. డబ్బుంది కదా అని లక్షలు విలువ చేసే శక్తివంతమైన కార్లను పిల్లలకు అందించే పెద్దలది కూడా తప్పే.

ఈ తప్పులకు డబ్బున్నోడయినా... లేనోడైనా... ఎవరైనా ఒకటే. అటు వ్యాపారవేత్త కొడుకుని కోల్పోతే. రిక్షా నడుపుకునే వ్యక్తి హాస్పిటల్‌‌కే పరిమితమయ్యాడు.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ యాక్సిడెంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2017 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ తొలి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నుండి అందరూ నేర్చుకోవాల్సింది... గరిష్ట వేగంతో ప్రయాణించడం కాదు.. రోడ్డు స్పీడ్ లిమిట్ ఎంత ఉంటే అంతే వెళ్లాలి. లేదంటే ఎలాంటి లైఫ్ అయినా... ఇలా అర్థాంతరంగా ముగుస్తుంది.

రోడ్డు ప్రమాదాలకు సంభందించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఇప్పటి వరకు ప్రచురించిన కథనాలలో మితిమీరిన వేగంతో ప్రయాణించడం మరియు అనుభవం లేని వారు చేసినవే అధికం.

English summary
Read In Telugu: India's First Skoda Octavia RS Crash — Brutal Accident Kills One, Leaves 3 Injured

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark