స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరిన్ని వివరాలు

Written By:

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. సరికొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ సెడాన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 24,62,000 లు ఎక్స్-షోరూమ్‌ (ఇండియా)గా ఉంది.

స్కోడా ఆటో ఇండియా లైనప్‌లో ఇప్పటి వరకు ఉన్న మోడళ్లలో అత్యంత శక్తివంతమైన మరియు వేగవంతమైన కారుగా సిజెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా అభివృద్ది చేసిన ఆక్టావియా ఆర్ఎస్ నిలిచింది.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ మీద నాలుగేళ్ల పాటు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీ, నాలుగేళ్లు లేదా అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల పాటు ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్, నాలుగు క్రమానుగత మెయింటనెన్స్ సర్వీస్(15,000 కిలోమీటర్లు లేదా ఒక సంవత్సరం ఏది ముందైతే దానికనుగుణంగా).

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ మరియు మైలేజ్ వివరాలు

సరికొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారులో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 5,500 నుండి 6,200ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం మధ్య 227బిహెచ్‌పి పవర్ మరియు 1,500 - 4,500ఆర్‌పిఎమ్ మధ్య 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ పవర్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కేవలం 6.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది. ఏఆర్ఏఐ ప్రకారం ఆక్టావియా ఆర్ఎస్ మైలేజ్ లీటర్‌కు 14.45 కిలోమీటర్లుగా ఉంది. మరియు దీని గ్రౌండ్ క్లియరెన్స్ 103ఎమ్ఎమ్‌గా ఉంది.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల

2017 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ డిజైన్

రెగ్యులర్ వెర్షన్ ఆక్టావియాతో పోల్చుకుంటే తేడాను గమనించేందుకు సరికొత్త ఆక్టావియా ఆర్ఎస్ లో డిజైన్ పరంగా కొన్ని ప్రదానమైన, గుర్తించదగిన మార్పులు చోటు చేసుకున్నాయి.

ముందు వైపున అధునాతన బ్లాక్ కలర్‌లో ఉన్న విఆర్ఎస్ బ్యాడ్జింగ్ గల బటర్ ఫ్లై ఫ్రంట్ గ్రిల్, రీ డిజైన్ చేయబడిన బంపర్ ద్వారా అగ్రిసివ్ డిజైన్‌లో ఉంది మరియు ఇంజన్ అధిక గాలిని గ్రహించే విధంగా ఉన్న పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్, దీనికి ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల

ఆక్టావియా ఆర్ఎస్ లోని 17-అంగుళాల పరిమాణం ఉన్న హాక్ ఆంథ్రసైట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, వీటికి 225/45 ఆర్17 కొలతల్లో ఉన్న టైర్లు కలవు. ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లు గల పెద్ద పరిమాణంలో ఉన్న బ్రేకులు ఉన్నాయి.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ వెనుక వైపున రిడిజైన్ చేయబడిన బంపర్, బ్లాక్ ఢిప్యూసర్, స్టెయిన్ లెస్ స్టీల్ టెయిల్ పైపులు, ఫిక్స్‌డ్ స్పాయిలర్, మరియు డిక్కీ మీద ఆర్ఎస్ బ్యాడ్జింగ్ పేరు కలదు. సరికొత్త ఆక్టావియా ఆర్ఎస్ నాలుగు విభిన్న రంగుల్లో లభించును. అవి, క్యాండీ వైట్, రేస్ బ్లూ, కోరిడా రెడ్ మరియు స్టీల్ గ్రే.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల

ఆక్టావియా ఆర్ఎస్ లోపలి వైపు స్పోర్టివ్ థీమ్‌లో ఉన్న బ్లాక్ మరియు రెడ్ కలర్ ఇంటీరియర్‌ కలదు, 12 రకాలుగా ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం ఉన్న సీట్లు, అల్కంటారా రెడ్ దారంతో సీట్ హెడ్ రెస్ట్ మరియు అప్‌హోల్‌స్ట్రే మీద ఆర్ఎస్ లోగో ఎంబ్రాయిడరింగ్‌ చేయబడి ఉంది.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల

ఫోన్ కనెక్టివిటి, ఆడియో కంట్రోల్స్ మరియు లెథర్ తొడుగు గల ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో మ్యాన్యువల్ ద్వారా గేర్లను నియంత్రించేందుకు పెడల్ షిఫ్టర్లు, ఉన్నాయి. వీటితో పాటు, డోర్ గోడలు, గేర్ నాబ్ మీద ఆర్ఎస్ పేరున్న గుర్తులు, స్టీల్ ఫుట్ పెడల్ కవర్స్ మరియు ఆంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల

ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటి అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 9.2-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ముందు మరియు వెనుక ప్రయాణికులకు ఏ/సి అందే విధంగా అడ్జస్టబుల్ ఏ/సి వెంట్స్ మరియు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్‌సేఫ్టీ ఫీచర్లు

భద్రత పరంగా స్కోడా ఆక్టావియా ఆర్ఎస్‌లో విభిన్న ఎయిర్ బ్యాగులు(ముందు రెండు, ముందు మరియు వెనుక వైపున కర్టన్ మరియు సైడ్ ఎయిర్ బ్యాగులు), యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ ప్యాడ్ అరుగుదలను సూచించే ఇండికేటర్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, మల్టీ కొల్లిషన్ బ్రేకింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ మరియు పార్కింగ్ సెన్సార్లు వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో వేగవంతమైన స్కోడా కారుగా ఆక్టావియా ఆర్ఎస్ బ్యాడ్జ్ పేరుతో పరిచయం అయ్యింది. రెగ్యులర్ సెడాన్ కార్లతో పోల్చితే ఆక్టావియా ఆర్ఎస్ పూర్తిగా పర్ఫామెన్స్ ఆధారిత కారు.

అధిక వేగంతో దూసుకెళ్లే, క్షణాల్లో స్పందించే ఇంజన్, అధునాతన ఇంటీరియర్ మరియు భద్రత ఫీచర్లతో నిండిన పర్ఫామెన్స్ సెడాన్ కోరుకునే వారు ఆక్టావియా ఆర్ఎస్ ను ఎంచుకోవచ్చు.

English summary
Read In Telugu; Skoda Octavia RS Launched In India For Rs 24.62 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark