మృత్యుకూపమైన యమునా ఎక్స్‌ప్రెస్ వే: అనంత వాయువుల్లో కలిసిపోతున్న ప్రాణాలు

Written By:

దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌ప్రెస్ వేలలో యమునా ఎక్స్‌ప్రెస్ వే ఘోర ప్రమాదాలకు నిలయమైపోయింది. ఒకటి సంఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. తాజాగా ఈ హైవే మీద జరిగిన ప్రమాదంలో ఇన్నోవా వాహనం రూపం మొత్తం మారిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న వారు అక్కడిక్కడే చనిపోయారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టయోటా ఇన్నోవా యాక్సిడెంట్

ఇప్పటి వరకు జరిగిన టయోటా ఇన్నోవా ప్రమాదాలలో ఇది అత్యంత ఘోరమైన, భయంకరమైన యాక్సిడెంట్ అని చెప్పవచ్చు. పూర్తిగా నుజ్జునుజ్జయిన ఈ వాహనంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.

అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఇలాంటి ప్రమాదాలను ఎలా నివారించవచ్చో చూద్దాం రండి...

Recommended Video
[Telugu] Mahindra KUV100 NXT Launched In India - DriveSpark
టయోటా ఇన్నోవా యాక్సిడెంట్

యమునా ఎక్స్‌ప్రెస్ వే మీద ఖాందౌలీ టోల్ ప్లాజాకు సమీపంలో ఉదయం 10:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో టయోటా ఇన్నోవా వాహనం వేగంగా లారీ వెనుక ఢీకొనడంతో ఇన్నోవా లారీ లోపలికి చొచ్చుకెళ్లింది.

టయోటా ఇన్నోవా యాక్సిడెంట్

ప్రమాదం జరిగినపుడు ఇన్నోవా వాహనంలో ఉత్సవ్ దంగ్ మరియు డ్రైవర్ మొహ్మద్ షరీఫ్ ఉన్నారు. పోలీసుల కథనం మేరకు, ఉత్సవ్ తన తల్లిని ఢిల్లీ విమానాశ్రయంలో దిగబెట్టి ఇద్దరూ ఆగ్రాకు వెళుతుంటే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

టయోటా ఇన్నోవా యాక్సిడెంట్

స్థానికుల కథనం మేరకు, ఆగి ఉన్న లారీని వీరి ఇన్నోవా వాహనం వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో రోడ్డు నిర్మానుష్యంగానే ఉంది. అయితే, ప్రమాదం ఎలా జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రోడ్డు మీద ఎలాంటి టైరు మార్కులు లేవు.

టయోటా ఇన్నోవా యాక్సిడెంట్

ఉత్సవ్ తన తల్లిని విమానాశ్రయంలో దింపేందుకు తెల్లవారుజామునే ప్రయాణాన్ని ప్రారంభించాడు. డ్రైవర్ ఉదయం నుండి కనుకు లేకుండా నడపడంతో నిద్రలోకి జారుకుని అదుపు తప్పి ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టి ఉండవచ్చు. లేదంటే టైరు ప్రేళుడు అయినా జరిగి ఉండవచ్చు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు.

టయోటా ఇన్నోవా యాక్సిడెంట్

పోలీసుల సమాచారం ప్రకారం, గత ఆరు నెలల కాలంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే మీద సుమారుగా 78 మంది ప్రజలు చనిపోయారు. 165కిలోమీటర్లు పొడవున్న ఈ ఎక్స్‌ప్రెస్ వే మీద జనవరి 1 నుండి జూన్ 30, 2017 మధ్య కాలంలో 432 ప్రమాదాలు జరిగాయి.

టయోటా ఇన్నోవా యాక్సిడెంట్

యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమయ్యి సుమారుగా ఐదున్నర సంవత్సరాలు గడిపోయాయి. ఈ మధ్య కాలంలో 626 మంది చనిపోగా... 4,505 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2016 ఏడాదిలో అత్యధిక ప్రమాదాలు జరిగాయి.

టయోటా ఇన్నోవా యాక్సిడెంట్

జాతీయ రహదారులు మీద రోడ్డు ప్రమాదాలు

ఇండియాలోని జాతీయ రహదారులు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైనవి. దేశ జాతీయ రహదారుల మీద ప్రమాద రేటు చాలా ఎక్కువగా మరియు చిన్న చిన్న సంఘటనలు ప్రతి నిత్యం సహజం. రహదారుల మీద ప్రమాదాలు నివారించడానికి మీ కోసం కొన్నిచిట్కాలు...

టయోటా ఇన్నోవా యాక్సిడెంట్

హైవే మరియు ఎక్స్‌ప్రెస్‌వేల మీద రోడ్డు ప్రక్కన పార్క్ చేసిన వాహనాల మీద ఓ కన్నేసి ఉంచండి. మలుపుల్లో ఇలాంటి వాహనాలు ఎదురైనపుడు చాకచక్యంగా తప్పించుకోండి.

నిర్ణీత వేగాన్ని మెయింటైన్ చేయండి. యాక్సిలరేటర్ తొక్కేకొద్దీ కార్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా దూసుకెళతాయి. అయితే, రోడ్డు మీద ఉన్న స్పీడ్ లిమిటెడ్ సూచించే బోర్డులకు అనుగుణంగా అంతే వేగంతో డ్రైవ్ చేయండి. మలుపులు మరియు రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా అంతకన్నా ఎక్కువ వేగంతో వెళ్లడం ప్రమాదం అని ముందుగానే గుర్తించి స్పీడ్ లిమిట్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.

టయోటా ఇన్నోవా యాక్సిడెంట్

నిద్రమత్తులో మరియు అలసటగా అనిపిస్తే అస్సలు డ్రైవ్ చేయకండి. ఇలా అనిపిస్తే కొద్దిసేపు బ్రేక్ తీసుకుని మొహం కడుక్కొని డ్రైవ్ చేయండి. అయితే, మొండిగా నిద్రమత్తుతోనే ప్రయాణించి ప్రాణం మీదకు తెచ్చుకోకండి.

టయోటా ఇన్నోవా యాక్సిడెంట్

ప్రతి ప్రయాణానికి ముందు టైర్లు బాగా పరీశిలించండి. టైర్లలో గాలి తక్కువగా ఉండటం, టైర్లు ఎక్కువగా అరిగిపోవడం మరియు పంక్చర్ అయ్యే సూచనలు కనిపిస్తే వాటికి తగిన మరమ్మత్తులు చేయించండి.

English summary
Read In Telugu: Speeding Toyota Innova crashes into truck
Story first published: Saturday, November 4, 2017, 18:10 [IST]
Please Wait while comments are loading...

Latest Photos