టివోలి ఎస్‌యూవీతో రోడ్డెక్కిన శాంగ్‍‌యాంగ్

Written By:

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ శాంగ్‌యాంగ్ తమ టివోలి కాంపాక్ట్ ఎస్‌యూవీని పరీక్షిస్తూ మీడియా కంటబడింది. ఎవరికంటా పడకుండా ఉండేందుకు నలుపు తెలుపు రంగు చారలున్న పేపరుతో కప్పేసి టివోలి ఎస్‌యూవీకి రహదారి పరీక్షలు నిర్వహించారు.

శాంగ్‌యాంగ్ టివోలి

రోడ్ టెస్ట్ సమయంలో ఈ శాంగ్‌యాంగ్ టివోల్ ఫోటోలను మా డ్రైవ్‌స్పార్క్ పాఠకుడు మాతో పంచుకున్నాడు. కోయంబత్తురూలో టివోలితో పాటు హ్యుందాయ్ మోటార్స్ కూడా తమ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను పరీక్షించింది.

Recommended Video - Watch Now!
Best Cars Of 2017 In India - DriveSpark
శాంగ్‌యాంగ్ టివోలి

ప్రస్తుతం శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యూవీని రెండు వేరియంట్లలో పరీక్షిస్తోంది. టివోలి రెండు రూపాల్లో వచ్చే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒకటి పరిమిత కొలతల్లో కాంపాక్ట్ ఎస్‌యూవీగా మరొకటి, వెద్ద పరిమాణంలో మూడవ వరుస సీటింగ్, విశాలమైన క్యాబిన్ మరియు బూట్ స్పేస్‌తో రానుంది.

శాంగ్‌యాంగ్ టివోలి

శాంగ్‌యాంగ్ టివోలి ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటిపూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు బంపర్‌లో ఇమిడిపోయిన ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ క్రింది భాగం, వీల్ ఆర్చెస్ ప్లాస్టిక్ క్లాడింగ్‌తో ఫినిషింగ్ చేయబడ్డాయి.

శాంగ్‌యాంగ్ టివోలి

శాంగ్‌యాంగ్ టివోలి బ్లాక్డ్ అవుట్ పిల్లర్లలో లభించనుంది. అల్లాయ్ వీల్స్‌తో రానున్న టివోలి క్రెటాతో పాటు పరీక్షలకు రోడ్డెక్కింది. ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా సెగ్మెంట్ లీడర్‌గా రాణిస్తోంది.

శాంగ్‌యాంగ్ టివోలి

టివోలి రియర్ డిజైన్‌లో చిన్న పరిమాణంలో ఉన్న విండ్ షీల్డ్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్, బంపర్ మీద బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, ఇరువైపులా ఎరుపు రంగులో ఉన్న రిఫ్లెక్టర్లు ఉన్నాయి.

శాంగ్‌యాంగ్ టివోలి

పెద్ద పరిమాణంలో ఉన్న టివోలి‌తో పోల్చుకుంటే ప్రస్తుతం పరీక్షించబడిన మోడల్ స్మాల్ వెర్షన్ అని చెప్పవచ్చు. స్మాల్ వెర్షన్ టివోలి చిన్న పరిమాణంలో ఉన్న బాడీతో పాటు, స స్టీల్ వీల్స్, హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ వంటివి సాధారణ ఫీచర్లు ఉన్నాయి. పరీక్షించిన టివోలి మరే ఇతర ఫీచర్లు గుర్తించడానికి వీల్లేకుండా శాంగ్‌యాంగ్ జాగ్రత్తపడింది.

శాంగ్‌యాంగ్ టివోలి

అయితే, శాంగ్‌యాంగ్ టివోలి లభ్యమయ్యే రెండు వేరియంట్లలో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లను అందించే అవకాశం ఉంది. టీవోలి ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఎన్నో సేఫ్టీ ఫీచర్లను అందివ్వనుంది.

శాంగ్‌యాంగ్ టివోలి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

శాంగ్‌యాంగ్ ఇండియన్ మార్కెట్ కోసం రెండు కొత్త మోడళ్లను సిద్దం చేస్తోంది. వీటిని 2018 మధ్య బాగంలో లాంచ్ చేయనుంది. దక్షిణ కొరియాకు చెందిన శాంగ్‌యాంగ్ దేశీయంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తోంది. కాబట్టి దేశవ్యాప్తంగా సేల్స్ మరియు సర్వీసింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.

శాంగ్‌యాంగ్ టివోలి

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేస్తే, టాట నెక్సాన్, మారుతి సుజుకి వితారా బ్రిజా, మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అదే విధంగా పెద్ద వెర్షన్ టివోలి హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్ మరియు నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీల నోరు మూయించనుంది.

Image credits: Jithesh Jagadeeshan

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Exclusive: SsangYong Tivoli Spotted Testing Alongside Hyundai Creta In Coimbatore
Story first published: Monday, December 25, 2017, 17:16 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark