లగ్జరీ మరియు ఎస్‌యూవీ వాహనాలపై సెస్ పెంపు: జిఎస్‌టి మండలి

Written By:

వస్తు మరియు సేవా పన్ను మండలి (GST) ఎస్‌యూవీ మరియు లగ్జరీ కార్ల మీద ట్యాక్స్ పెంపుపై ఆమోదం తెలిపింది. జిఎస్‍‌టి మండలి ఆమోదం తెలిపినప్పటిరీ చట్టబద్దంగా బిల్లు పాస్ అవ్వాల్సి ఉంటుంది. బిల్లు పాస్ అయితే ఏ క్షణంలోనైనా లగ్జరీ మరియు ఎస్‌యూవీల ధరలు పెరిగే అవకాశం ఉంది.

లగ్జరీ మరియు ఎస్‌యూవీ వాహనాల జిఎస్‌టి పెంపు

జిఎస్‌టి మండలి లగ్జరీ మరియు ఎస్‌యూవీ వాహనాల మీద సెస్ పెంచడానికి నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 15 శాతం సెస్ 25 శాతానికి పెరగనుంది. అంటే, నిర్ధిష్ట ట్యాక్స్ 28 శాతంతో సెస్ 25 శాతం కలుపుకొని మొత్తం 53 శాతానికి పెరగనుంది.

Recommended Video
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
లగ్జరీ మరియు ఎస్‌యూవీ వాహనాల జిఎస్‌టి పెంపు

కాబట్టి, లగ్జరీ కారు లేదా పెద్ద ఎస్‌యూవీ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లయితే వెంటనే బుక్ చేసుకోవడం ఎంతో ఉత్తమం. లేదంటే పెంపునకు గురైన ట్యాక్స్ పూర్తి స్థాయిలో అమలైతే, వీటి ధరలు విపరీతంగా పెరగునున్నాయి.

లగ్జరీ మరియు ఎస్‌యూవీ వాహనాల జిఎస్‌టి పెంపు

ఆటోమొబైల్ రంగంలోని ఖరీదైన వాహనాల ట్యాక్స్‌ను పునఃపరిశీలన జరిపిన అనంతరం వీటి మీద సెస్ పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారుల నుండి సమాచారం అందింది. అయితే ఇది అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

లగ్జరీ మరియు ఎస్‌యూవీ వాహనాల జిఎస్‌టి పెంపు

తొలిసారిగా జిఎస్‌టి ప్రవేశపెట్టినపుడు నాలుగు మీటర్ల కన్నా ఎక్కువ పొడవు మరియు 1,500సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న వాహనాల మీద 51.80 శాతం ట్యాక్స్ ఉండేది. అయితే జిఎస్‌టికి ముందు ఇదే వాహనాల మీద 55.30 శాతం ట్యాక్స్ అమలయ్యేది.

లగ్జరీ మరియు ఎస్‌యూవీ వాహనాల జిఎస్‌టి పెంపు

జిఎస్‌టి అమలు అనంతరం ట్యాక్స్ తగ్గుముఖం పట్టడంతో దేశీంగా ఉన్న కార్ల తయారీ సంస్థలు తమ అన్ని లగ్జరీ కార్ల మీద మరియు పెద్ద ఎస్‌యూవీల జిఎస్‌టి ప్రతిఫలాలను అమల్లోకి తీసుకొచ్చాయి.

లగ్జరీ మరియు ఎస్‌యూవీ వాహనాల జిఎస్‌టి పెంపు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయంగా హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ విపరీతంగా పెరగడంతో తయారీ సంస్థలు మరియు కొనుగోలు దారులు హైబ్రిడ్ కార్ల మీద అమలు చేస్తున్న జిఎస్‌టి పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు లగ్జరీ మరియు పెద్ద ఎస్‌యూవీల మీద ట్యాక్స్ పెంచే ఆలోచనలో ఉంది. అయితే ఇప్పుడైనా హైబ్రిడ్ వాహనాల మీద ట్యాక్స్ తగ్గిస్తే బాగుటుంది.

English summary
Read In Telugu: GST Council: SUV & Luxury Car Cess Likely To Be Increased
Story first published: Monday, August 7, 2017, 17:20 [IST]
Please Wait while comments are loading...

Latest Photos