సరికొత్త కలర్ ఆప్షన్‌లో లిమిటెడ్ ఎడిషన్ సుజుకి యాక్సెస్ 125

Written By:

సుజుకి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ తమ యాక్సెస్ 125 లిమిటడ్ ఎడిషన్ స్కూటర్‌ను సరికొత్త పెయింట్ స్కీమ్‌లో విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. మోటోరాయిడ్స్ విడుదల చేసిన ఈ స్కూటర్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.

సుజుకి యాక్సెస్ 125 లిమిటెడ్ ఎడిషన్

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ రెండు నూతన పెయింట్ స్కీమ్‌లలో లభించనుంది - అవి, మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే మరియు మెటాలిక్ మ్యాట్ బ్లాక్. అయితే ప్రస్తుతం ఉన్న యాక్సెస్ 125 స్కూటర్‌లో లభించే అన్ని ఫీచర్లు ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌లో ఉన్నాయి.

సుజుకి యాక్సెస్ 125 లిమిటెడ్ ఎడిషన్

యాక్సెస్ 125 లోని స్టాండర్డ్ మోడల్‌తో పోల్చినట్లయితే, యాక్సెస్ 125 లిమిటెడ్ ఎడిషన్‌లో క్రోమ్ హెడ్ ల్యాంప్ కవర్, క్రోమ్ ఫినిషింగ్ గల మిర్రర్స్, స్పెషల్ ఎడిషన్ లోగో, బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు గ్రాబ్ రెయిల్స్ వంటివి ఉన్నాయి. స్పెషల్ ఎడిషన్ ఇన్నర్ బాడీ బ్లాక్ కలర్‌లో కలదు.

సుజుకి యాక్సెస్ 125 లిమిటెడ్ ఎడిషన్

సాంకేతికంగా సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్‌లో124సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 8.5బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. స్కూటర్ ఎక్ట్సీరియర్ మీద అందించిన అదనపు ఫీచర్లు మరియు నూతన పెయింట్ స్కీమ్ మినహాయిస్తే, సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

English summary
Read In Telugu: Suzuki Access 125 Special Edition With New Paint Scheme Leaked

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark