ఇ-సర్వైవర్ పేరుతో సరికొత్త కాన్సెప్ట్ ఆవిష్కరించిన సుజుకి

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం సుజుకి మరో కొత్త మోడల్ ఇ-సర్వైవర్ కారును ఆవిష్కరించింది.

By Anil

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం సుజుకి మరో కొత్త మోడల్ కారును ఆవిష్కరించింది. ఇ-సర్వైవర్ పేరుతో చిన్న మరియు కండలు తిరిగిన కన్వర్టిబుల్ ఎస్‌‌యూవీని అక్టోబర్ 2017లో జరగనున్న టోక్యో మోటార్ షో వేదిక మీద ప్రదర్శించనుంది.

సుజుకి ఇ-సర్వైవర్

సరికొత్త డిజైన్ భాషలో, జిమ్నీ ఎస్‌యూవీ, విటారా మరియు 1990 మధ్య కాలం నాటి ఎక్స్‌సి 90 మోడళ్ల ప్రేరణతో సుజుకి తమ ఇ-సర్వైవర్ వాహనాన్ని అభివృద్ది చేసింది. రానున్న టోక్యో మోటార్ షో వేదిక మీద దీనితో పాటు మరికొన్ని ఇతర మోడళ్లను కూడా ఆవిష్కరించడానికి సుజుకి సిద్దమవుతోంది.

సుజుకి ఇ-సర్వైవర్

ఇ-సర్వైవర్ కాన్సెప్ట్‌ను త్వరలో రానున్న జిమ్నీ ఎస్‌యూవీ ఆధారంతో, ల్యాడర్ ఫ్రేమ్ ట్రక్కు స్టైల్లో నిర్మించింది. దీనిని పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్‌గా మార్చేందుకు ఫ్రేమ్‌లోని అంతర్గతంగా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ మరియు నాలుగు చక్రాలకు మోటార్లను అమర్చడం జరిగింది.

సుజుకి ఇ-సర్వైవర్

ఇ-సర్వైవర్ కాన్సెప్టులో అధిక గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద పరిమాణంలో ఉన్న వీల్ ఆర్చెస్ మరియు నాబీ టైర్లు ఉన్నాయి. తేలికపాటి బరువుతో నిర్మించిన ఇది పూర్తి స్థాయి ఆఫ్ రోడింగ్ మరియు ఆన్ రోడ్ వెహికల్‌ అని చెప్పవచ్చు.

Recommended Video

Maruti Suzuki Alto Prices Drop Post GST In Telugu - DriveSpark తెలుగు
సుజుకి ఇ-సర్వైవర్

ఇ-సర్వైవర్ కాన్సెప్ట్ ఓపెన్ టాప్ మరియు హార్డ్ టాప్ ఆప్షన్స్‌లో ఉంది. డిజైన్ పరంగా రెండు వాహనాలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలున్న ఇందులో స్టీరింగ్ వీల్ మరియు డ్రైవర్ కంట్రోల్స్ మినహాయిస్తే మరే ఇతర ఆడంబరమైన ఫీచర్లు లేవు.

సుజుకి ఇ-సర్వైవర్

సుజుకి దీని గురించిన ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడించలేదు. అయితే, దీని నిర్మాణం, ఇంటీరియర్, స్టీరింగ్ వీల్ మరియు ఇతర కంట్రోల్స్ పరిశీలిస్తే ఈ సుజుకి ఎస్‌యూవీలో ఇప్పుడే అటానమస్ టెక్నాలజీ వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి.

సుజుకి ఇ-సర్వైవర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డీసెంట్ మోడళ్లను రూపొందించే సుజుకి ఇప్పుడు ఇ-సర్వైవర్ కాన్సెప్ట్ ఆవిష్కరణతో జర్మన్ దిగ్గజాలకు షాకిచ్చిందని చెప్పవచ్చు. ఫ్యూచర్ డిజైన్ అంశాలతో, ఫోర్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్ మరియు ఆఫ్ రోడింగ్ లక్షణాలతో ఈ మినీ ఎలక్ట్రిక్ వెహికల్ చూడచక్కగా ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Suzuki Reveals e-Survivor Concept Ahead Of Tokyo Debut
Story first published: Wednesday, September 27, 2017, 12:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X