సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ మరియు స్పోర్ట్ వేరియంట్ల విడుదల ఈ ఏడాదేలోనే

Written By:

సుజుకి స్విఫ్ట్ లోని వివిధ వేరియంట్లు విడుదలకు సిద్దం అవుతున్నాయి. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం, స్విఫ్ట్ లోని హైబ్రిడ్ మరియు స్పోర్ట్ వేరియంట్లు జపాన్ మార్కెట్లోకి ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానున్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ మరియు స్పోర్ట్ వేరియంట్లు

స్విఫ్ట్ హైబ్రిడ్ అంటే ప్రస్తుతం ఉన్న మైల్డ్ హైబ్రిడ్ (SHVS) సిస్టమ్ కాదు. స్విఫ్ట్ హైబ్రిడ్‌లో ప్యూర్ హైబ్రిడ్ టెక్నాలజీని అందివ్వనుంది. అందుకోసం సాంకేతికంగా ఇందులో సుజుకి సోలియో హైబ్రిడ్ పవర్ ట్రైన్ వినియోగించే అవకాశం ఉంది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ మరియు స్పోర్ట్ వేరియంట్లు

స్విఫ్ట్ హైబ్రిడ్ వేరియంట్లోని 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ మరియు మోటార్ జనరేటర్ యూనిట్ సంయుక్తంగా 90బిహెచ్‌పి పవర్ మరియు 118ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ మరియు స్పోర్ట్ వేరియంట్లు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ ఆటోగేర్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు. స్విఫ్ట్ హైబ్రిడ్ లో స్పీడ్‌లో కేవలం ఎలక్ట్రిక్ పవర్ ద్వారా పరిమిత దూరం వరకు ప్రయాణిస్తుంది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ మరియు స్పోర్ట్ వేరియంట్లు

జపాన్ విపణిలో విడుదల కానున్న స్విఫ్ట్ లోని మరో వేరియంట్ స్పోర్ట్‌లో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 220ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. హార్ట్‌టెక్ ఫ్లాట్‌ఫామ్(HEARTECT) మీద నిర్మించబడంతో దీని బరువు కేవలం 870కిలోలుగా ఉంది.

ఇండియా విడుదల

ఇండియా విడుదల

సుజుకి జపాన్‌లో ఈ యేడు విడుదల చేయనున్న థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ 2018 నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది. కానీ ఇతర మోడళ్ల విడుదలపై ఎలాంటి సమాచారం లేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను సాధారణ వేరియంట్లో పాటు హైబ్రిడ్ మరియు స్పోర్ట్ వేరియంట్లో కూడా విడుదల చేస్తే ఎకో ఫ్రెండ్లీ మరియు పవర్ ఫుల్ అవతారంలో స్విఫ్ట్ ఎంచుకోవచ్చు.

English summary
Read In Telugu Suzuki Swift Hybrid And Sport Variants To Be Launched This Year – Report
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark