సరికొత్త సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఇంటీరియర్ రివీల్

Written By:

స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను సెప్టెంబర్ 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించడానికి సిద్దమవుతోంది. అయితే దీనికంటే ముందే, స్విఫ్ట్ స్పోర్ట్ ఫోటోలను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఎక్ట్సీరియర్ ఫోటోలను విడుదల చేసిన సుజుకి ఇప్పుడు ఇంటీరియర్‌ను రివీల్ చేసింది.

స్టాండర్డ్ వెర్షన్‌తో పోల్చుకుంటే ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఇంటీరియర్

సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్ ఫ్రంట్ పోర్షన్‌లో పదునైన డిజైన్ లక్షణాలు గల రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ మరియు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్ రియర్ డిజైన్‌లో డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు మరియు మధ్యలో అందించిన స్టార్ ల్యాంప్ కలదు.

Recommended Video
2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఇంటీరియర్

ఇంటీరియర్‌లో ప్రధానంగా గుర్తించే మార్పు, రెడ్ అండ్ బ్లాక్ కలర్‌లో ఉన్న డ్యాష్ బోర్డ్. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్‌లు కూడా రెడ్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. అదే విధంగా స్పోర్టివ్ బ్రాండింగ్‌తో రెడ్ సీట్లను అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఇంటీరియర్

స్టాండర్ట్ స్విప్ట్‌లో ఉన్నటువంటి అదే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇందులో ఉంది. అయితే దీని మీద గ్లాస్ బ్లాక్ ఫినిష్ కలదు. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో బూస్ట్ గేజ్ ఉంటుంది. దీని అర్థం టుర్బోఛార్జ్‌డ్ ఇంజన్ కారుకు కావాల్సిన పవర్ ఉత్పత్తి చేస్తుందని.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఇంటీరియర్

స్విఫ్ట్ స్పోర్ట్ 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బోఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఇంటీరియర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్ ఓవరాల్‌గా అగ్రెసివ్‌గా ఉంది. స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్ ఈ ఏడాది చివరి నాటికి జపాన్‌లో విడుదల కానుంది. మరియు 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద దీనిని ప్రదర్శించనుంది.

English summary
Read In Telugu: New Suzuki Swift Sport Interior Revealed
Story first published: Saturday, August 5, 2017, 17:56 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark