ఒక్క రుపాయి చెల్లించి ఇంటికి టాటా కారును తీసుకెళ్లండి!

Written By:

ఈ ఏడాది కొత్త కారును కొనాలని చూస్తున్నారా....? అయితే, టాటా మోటార్స్ అద్భుతమైన ఆఫర్లతో ముందుకొచ్చింది. కస్టమర్ల కోసం ఎన్నడూలేని విధంగా విభిన్నమైన సంవత్సరాంతపు ఆఫర్లను పరిచయం చేసింది.

ఒక్క రుపాయితో టాటా కారు

'మెగా ఆఫర్ మ్యాక్స్ సెలబ్రేషన్ క్యాంపెయిన్'లో భాగంగా కస్టమర్లు కేవలం రూ. 1 చెల్లించి ఇంటికి టాటా కారును తీసుకెళ్లవచ్చు. ఒక్క రుపాయ డౌన్ పేమెంట్‌తో లభించే ఈ ఆఫర్ ద్వారా ఏదేని టాటా కారును కొనుగోలు చేసిన వారు వివిధ వేరియంట్ల ఆధారంగా లక్ష రుపాయల వరకు ఆదా చేసుకోవచ్చు.

Recommended Video - Watch Now!
[Telugu] Tata Nexon Review: Specs
ఒక్క రుపాయితో టాటా కారు

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ కార్లను ఎంచుకునే కస్టమర్ల కోసం 100 శాతం ఫైనాన్స్ సౌకర్యం కల్పించే విధంగా పలు బ్యాంకులతో చేతులు కలిపింది. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీముల ద్వారా టాటా కార్లను సొంతం చేసుకోవచ్చు.

ఒక్క రుపాయితో టాటా కారు

అదనంగా కస్టమర్లు తమ వద్ద ఉన్న పాత కార్లతో ఎక్స్‌చ్ఛేంజ్ ద్వారా టాటా కార్లను ఎంచుకునే వారికి అదనపు లాభాలను అందిస్తోంది. ఈ డిసెంబర్ ఆఫర్ల ద్వారా వివిధ మోడళ్ల మీద రూ. 26,000 ల నుండి గరిష్టంగా రూ. 1,00,000 ల వరకు డిస్కౌంట్లను టాటా అందిస్తోంది.

ఒక్క రుపాయితో టాటా కారు

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 3.27 లక్షలు, దీని మీద రూ. 32,000 ల వరకు డిస్కౌంట్ కలదు. మరియు టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ ప్రారంభ ధర రూ. 4.65 లక్షలు, దీని మీద గరిష్టంగా 32 వేల రుపాయలను అదే విధంగా 5.31 లక్షల ప్రారంభ ధరతో లభించే జెస్ట్ సెడాన్ మీద 68 వేల రుపాయల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

ఒక్క రుపాయితో టాటా కారు

టాటా హెక్సా మరియు సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీల మీద వరుసగా రూ. 78,000 లు మరియు రూ. 1,00,000 ల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. హెక్సా మరియు సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీల ప్రారంభ ధరలు వరుసగా రూ. 11.9 లక్షలు మరియు రూ. 10.53 లక్షలుగా ఉన్నాయి.

ఒక్క రుపాయితో టాటా కారు

టాటా సంవత్సరాంతపు ఆఫర్ల సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాత్స మాట్లాడుతూ, "కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని, వారికి ఉపయోగకరమైన స్కీములు మరియు ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్ల తెలిపాడు.

ఒక్క రుపాయితో టాటా కారు

గతంలో పండుగ సీజన్ సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్ల ద్వారా టాటా అత్యుత్తమ ఫలితాలను సాధించింది. ఇప్పుడు సంవత్సరాంతం సందర్భంగా డిసెంబర్ మొత్తం అందుబాటులో ఉంచేలా మేగా ఆఫర్ మ్యాక్స్ సెలబ్రేషన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ ఆఫర్లన్నీ కూడా డిసెంబర్ 31, 2017 వరకు మాత్రమే లభించనున్నాయి.

ఒక్క రుపాయితో టాటా కారు

ఇప్పుడు టాటా ఇండియా లైనప్‌లో విసృత శ్రేణి ప్యాసింజర్ కార్లు ఉన్నాయి. టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ స్టైల్ బ్యాక్ కాంపాక్ట్ సెడాన్, నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు టాటా హెక్సా ఎస్‌యూవీ మంచి ఫలితాలు కనబరుస్తున్నాయి. ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీలో అభివృద్ది చేసిన వీటి ద్వారానే టాటా మార్కెట్లో ఆశించిన వాటా సొంతం చేసుకుంటోంది.

ఒక్క రుపాయితో టాటా కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నిజానికి టాటా ప్యాసింజర్ కార్లను కొనుగోలు చేయడానికి ఇదొక మంచి సమయం అని చెప్పవచ్చు. కాబట్టి, టాటా నుండి కొత్త కారును కొనే ప్లాన్‌లో ఉంటే మరో మారు ఆలోచించకుండా ఈ సంవత్సరాంతపు ఆఫర్లలోనే నచ్చిన టాటా కారును ఎంచుకోవడం బెటర్.

English summary
Read In Telugu: Tata car with re 1 down payment part of mega offer max celebration campaign

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark