టాటా నానో విక్రయాలకు శాశ్వతంగా ముగింపు పలికిన టాటా మోటార్స్

Written By:

భారతదేశపు చీపెస్ట్ కారుగా ముద్ర వేసుకున్న నానో గురించి ఇప్పుడొక బ్యాడ్ న్యూస్ వచ్చింది. టాటా డీలర్లు నానో కారు మీద బుకింగ్స్ శాశ్వతంగా నిలిపివేశారు. ఇందుకు ప్రధాన కారణం ఆశించిన డిమాండ్ లభించకపోవడమని తెలిసింది. టాటా మోటార్స్ సగటున రోజుకు ఎన్నో నానో కార్లను ఉత్పత్తి చేస్తుందో తెలుసా....? కేవలం రెండు కార్లను మాత్రమే సనంద్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది.

నానో బుకింగ్స్ ఆపేసిన టాటా డీలర్లు

విపణిలో నానో కారుకు ఆదరణ పూర్తిగా కరువైంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు టాటా డీలర్లు కొన్ని నెలల క్రిందటే నానో కారు మీద బుకింగ్స్ స్వీకరించడాన్ని ఆపేసినట్లు తెలిసింది.

నానో బుకింగ్స్ ఆపేసిన టాటా డీలర్లు

తాజాగా అందిన సమాచారం మేరకు, ఆగష్టు 2017లో 630 విక్రయ కేంద్రాలకు 180 యూనిట్ల నానో కార్లను డెలివరీ ఇచ్చింది. గత ఏడాది అదే నెలలో 711 నానో కార్లను విక్రయించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సెప్టెంబర్ 2017 లో కేవలం 124 యూనిట్లను మరియు అక్టోబరులో మరీ దారుణంగా 57 నానో కార్లను మాత్రమే విక్రయించింది.

నానో బుకింగ్స్ ఆపేసిన టాటా డీలర్లు

టాటా మోటార్స్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, "ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో రాణించేందుకు ఇప్పటికే నూతన ప్రణాళికలను సిద్దం చేసినట్లు చెప్పుకొచ్చాడు. కేవలం కస్టమర్లు ఆదరించే మోడళ్లను, వాటికి అనుభందమైన మోడళ్లను మాత్రమే దృష్టిసారిస్తున్నట్లు తెలిపాడు."

నానో బుకింగ్స్ ఆపేసిన టాటా డీలర్లు

భారీ అంచనాల మధ్య సామాన్యుడి కారుగా అందుబాటులోకొచ్చిన టాటా నానో కారులో 624సీసీ కెపాసిటి గల ప్యార్లల్ ట్విన్ పెట్రోల్ ఇంజన్ కలదు. సివిటి లేదా 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ 38బిహెచ్‌పి పవర్ మరియు 51ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

నానో బుకింగ్స్ ఆపేసిన టాటా డీలర్లు

టాటా నానో ధరల శ్రేణి రూ. 2 లక్షల నుండి రూ. 3.12 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ఇండియాగా ఉన్నాయి. కొంత మంది టాటా డీలర్ల నుండి సేకరించిన సమాచారం మేరకు, హిమాచల్ ప్రదేశ్‌లో ఓ డీలర్ తన వద్దకు వచ్చన కస్టమర్లకు ఇతర డీలర్ల నుండి నానో కార్లను తెప్పి విక్రయించి, కొత్తగా వస్తున్న ఆర్డర్లను తిరస్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

నానో బుకింగ్స్ ఆపేసిన టాటా డీలర్లు

జిఎస్‌టి అనంతరం కూడా ఒక్కో కారు మీద రూ. 10,000 నుండి 50,000 ల వరకు డిస్కౌంట్లను ప్రకటించినప్పటికీ ఇంకా నాలుగైదు కార్లు అలాగే ఉన్నట్లు తెలిపాడు. నానో కార్ల ప్రొడక్షన్ నిలిపివేయడానికి టాటా ఏ మాత్రం సంసిద్దంగా లేదు. అయితే, డిమాండ్ నేపథ్యంలో అవసరానికి తగ్గట్లుగా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

నానో బుకింగ్స్ ఆపేసిన టాటా డీలర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా ఇండియా లైనప్‌లో విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండేవి. అన్ని రకాల కస్టమర్లకు తగ్గట్లుగా ప్రతి కస్టమర్‌ను చేరుకునేందుకు పలు రకాల కార్లను అందుబాటులో ఉంచింది. అయితే, ఆశించిన ఆదరణ లభించని మోడళ్లను తప్పనిసరిగా విపణి నుండి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు అనుగుణమైన నిర్ణయాలను మాత్రమే టాటా తీసుకునే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Tata Dealers Stop Placing Orders For The Nano — Here's Why

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark