పదివేల ఎలక్ట్రిక్ కార్లకు ప్రభుత్వ ఆర్డర్ చేజిక్కించుకున్న టాటా మోటార్స్

Written By:

దేశీయ ప్యాసింజర్ కార్ల దిగ్గజం మొక్కవోని దీక్షతో చేసిన ప్రయత్నం ఫలిచింది. రహస్యంగా ఎంతో కాలం నుండి ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేసిన టాటా ఎలక్ట్రిక్ కార్ల విభాగం భారీ అర్డర్‌ను సొంతం చేసుకుంది.

భారత ప్రభుత్వానికి 10,000 ఎలక్ట్రిక్ కార్లను సప్లే చేసే విధంగా రూ. 1,120 కోట్ల రుపాయల విలువ చేసే ఆర్డర్‌ను టాటా చేజిక్కించుకుంది. ఈ వేలం పాటలో పోటీగా వచ్చిన మరో దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాను వెనక్కి నెట్టింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టాటా ఎలక్ట్రిక్ కార్లు

టాటా మోటార్స్ ఒక ఎలక్ట్రిక్ కారును రూ. 11.2 లక్షల ధరతో ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(EESL) భారత ప్రభుత్వ రంగ సంస్థకు సప్లే చేయనుంది. 2030 నాటికి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయాలకు అనుమతించాలనే భారత ప్రభుత్వ లక్ష్యానికి ఇదొక పునాది రాయిగా భావించవచ్చు.

టాటా ఎలక్ట్రిక్ కార్లు

టాటా మోటార్స్ జిఎస్‌టి లేకుండా ఒక్కో కారును రూ. 10.16 లక్షలకు బిడ్ వేసింది. దీనికి పోటీగా ఉన్న ఇతర సంస్థలు వేసిన బిడ్ విలువ కంటే ఇది తక్కువగా ఉండటంతో EESL టాటా మోటార్స్ వారికి ఆర్డర్ ఇచ్చింది. జిఎస్‌టితో కలుపుకొని 11.2 లక్షల ధరతో ఒక్కో యూనిట్‌ను EESL కు టాటా సరఫరా చేయనుంది.

Recommended Video
Tata Tiago XTA AMT Variant Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టాటా ఎలక్ట్రిక్ కార్లు

అంటే, ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ కార్ల ధరలతో పోల్చుకుంటే 25శాతం తక్కువ ధరతో అందించడానికి టాటా ముందుకొచ్చింది. అంతే కాకుండా మార్కెట్లో 3 సంవత్సరాల పాటు ఉన్న వారంటీ కాకుండా ఐదేళ్ల వారంటీని అందిస్తోంది.

టాటా ఎలక్ట్రిక్ కార్లు

టాటా మోటార్స్ ఈ అర్డర్‌కు అనుగుణంగా రెండు దశలలో మొత్తం ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేయనుంది. తొలి దశ క్రింద నవంబరు 2017 లో 500 కార్లు మరియు రెండవ దశ క్రింద 9,500 కార్లను డెలివరీ ఇవ్వనుంది.

టాటా ఎలక్ట్రిక్ కార్లు

ఒప్పందం ప్రకారం, టాటా మోటార్స్ తాజాగా విపణిలోకి విడుదల చేసిన టిగోర్ కాంపాక్ట్ సెడాన్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందివ్వనుంది. విద్యుత్ ఆదా మరియు పర్యావర పరిరక్షణ కోసం పనిచేస్తున్న EESL సంస్థ వద్ద ఉన్న పెట్రోల్ మరియు డీజల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను భర్తీ చేయనుంది.

టాటా ఎలక్ట్రిక్ కార్లు

ఈ ఎలక్ట్రిక్ కార్లను రూ. 45,000 నుండి రూ. 50,000 లతో నెల వారీ అద్దెకు ఇచ్చే వ్యాపార వ్యూహంతో EESL సంస్థ ఎలక్ట్రిక్ కార్ల కోసం టెండర్‌కు ఆహ్వానించింది. ప్రభుత్వ రంగం సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను వినియోగించే దిశగా భారత ప్రభుత్వం పనిచేస్తుండటంతో, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం విరివిగా పెరగే అవకాశాలు ఉన్నాయి.

టాటా ఎలక్ట్రిక్ కార్లు

టాటా మోటార్స్ ఇది వరకే తమ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఇంగ్లాండులో ఆవిష్కరించింది. టియాగో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కాన్సెప్ట్ కారును టాటా మోటార్స్ యూరోపియన్ టెక్నికల్ సెంటర్(TMETC) బృందం అభివృద్ది చేసింది.

టాటా ఎలక్ట్రిక్ కార్లు

టియాగో హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారులో 85కిలోవాట్ సామర్థ్యం ఉన్న లిక్విడ్ కూల్డ్ డ్రైవ్ మోటార్ కలదు. ఇది గరిష్టంగా 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా ఎలక్ట్రిక్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు... ఇప్పటి టాటా మోటార్స్ టిగోర్ ఎలక్ట్రిక్ కారును పరీక్షించింది లేదు, అయినా కూడా కోట్ల విలువైన ఎలక్ట్రిక్ కార్ల డీల్ దక్కించుకుంది.

టాటా వారి దేశీయ మరియు అంతర్జాతీయ అభివృద్ది బృందాలు టిగోర్ కాంపాక్ట్ సెడాన్‌ను దాదాపు సిద్దం చేశాయి. ఎన్నో ఏళ్ల కాలం నుండి ఎలక్ట్రిక్ కార్ల విపణిలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రాను ఢీకొని మరీ టాటా ఈ ఆర్డర్ సొంతం చేసుకుంది.

English summary
Read In Telugu: Tata Motors To Supply 10,000 Electric Vehicles To EESL
Story first published: Tuesday, October 3, 2017, 12:38 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark