భారీ సేల్స్ బాట పట్టిన టాటా మోటార్స్: జపాన్ దిగ్గజాలకు ముచ్చెమటలు

Written By:

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ సేల్స్ పరంగా జపాన్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్‌ను వెనక్కి నెట్టింది. సెప్టెంబర్ 2017 నెల విక్రయాలతో భారతదేశపు నాలుగవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా టాటా మోటార్స్ నిలిచింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టాటా ప్యాసింజర్ కార్ల సేల్స్

గడిచిన సెప్టెంబర్ 2017లో టాటా మోటార్స్ 19,334 కార్లను విక్రయించగా, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇదే కాలంలో 18,257 కార్లను విక్రయించింది. అతి పెద్ద ప్యాసింజర్ కార్ల విక్రయాలు జరిపే కంపెనీల జాబితాలో నాలుగవ స్థానం కోసం టాటా మరియు హోండా పోటీ ఎప్పుటి నుండే ఉండేది.

Recommended Video
[Telugu] Tata Nexon Review: Specs
టాటా ప్యాసింజర్ కార్ల సేల్స్

2017-18 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు మాసాల్లోని ఏప్రిల్, జూలై మరియు ఆగష్టులో హోండా టాటా కన్నా ఎక్కువ విక్రయాలు జరపగా, మే, జూన్ మరియు సెప్టెంబర్ నెలల్లో టాటా హోండా కన్నా ఎక్కువ సేల్స్ జరిపింది.

టాటా ప్యాసింజర్ కార్ల సేల్స్

మొత్తానికి ఇరు సంస్థల సేల్స్ చూసుకుంటే టాటా మోటార్స్ మంచి జోరుమీదే ఉంది. భవిష్యత్తులో ఇదే కొనసాగితే టాటా నాలుగవ స్థానాన్ని పూర్తిగా కైవసం చేసుకుని హోండాను వెనక్కినెట్టేసే అవకాశం ఉంది.

టాటా ప్యాసింజర్ కార్ల సేల్స్

టాటా లైనప్‌లో ఉన్న హెక్సా ప్రీమియమ్ క్రాసోవర్, నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగో మరియు టిగోర్ కాంపాక్ట్ సెడాన్ కార్లు మంచి ఫలితాలు సాధించి పెడుతున్నాయి.

Trending On DriveSpark Telugu:

ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో తెలుసా...?

పెద్ద పెద్ద SUVల తరహాలో 7-సీటింగ్ కెపాసిటితో వస్తున్న మారుతి వ్యాగన్ఆర్... అది కూడా బడ్జెట్ ధరలోనే

30కిమీల మైలేజ్‌తో సరికొత్త ఆల్టోను సిద్దం చేస్తున్న మారుతి సుజుకి

టాటా ప్యాసింజర్ కార్ల సేల్స్

టాటా తమ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలను గత నెల నుండే ప్రారంభించింది. నెక్సాన్ సేల్స్ ఊపందుకుంటే భారతదేశపు బెస్ట్ ప్యాసింజర్ కార్ల కంపెనీల లిస్టులో 3 స్థానంలో ఉన్న మహీంద్రాను దాటిపోవడం ఖాయం.

టాటా ప్యాసింజర్ కార్ల సేల్స్

అయితే, హోండా కార్స్ ఇండియా సేల్స్ విషయానికి వస్తే, హోండా లైనప్‌ డబ్ల్యూఆర్-వి మరియు సిటి సెడాన్ కార్లు మాత్రమే విక్రయాలు తెచ్చిపెడుతున్నాయి.

టాటా ప్యాసింజర్ కార్ల సేల్స్

హ్యుందాయ్ ఇండియా తాజాగా సరికొత్త వెర్నా మిడ్ సైజ్ సెడాన్‌ను విడుదల చేసింది. దీని సేల్స్ కూడా విపరీతంగా పెరుగతున్నాయి. వెర్నా మీద వచ్చే డిమాండ్ ఇప్పుడు సిటి సెడాన్ కారు మీద పడే అవకాశం ఉంది ఇదే జరిగితే హోండా కార్స్ ఇండియా విక్రయాలు మరింత పడిపోయే చాన్స్ ఉంది.

టాటా ప్యాసింజర్ కార్ల సేల్స్

టాటా మోటార్స్ భవిష్యత్తులో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి మారుతి బాలెనో, హోండా జాజ్ మరియు హ్యుందాయ్ ఎలైట్ కార్లకు పోటీగా ఏఎమ్‌పి ఫ్లాట్‌ఫామ్ మీద కొత్త మోడల్‌ను లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది.

టాటా ప్యాసింజర్ కార్ల సేల్స్

ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌తో ఇప్పటికే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న టియాగో ఆటోమేటిక్ వేరియంట్లో లభిస్తోంది. దీనితో పాటు టియాగో మరియు నెక్సాన్ కార్లను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో విడుదలైతే టాటాకు మరింత కలిసిరానుంది.

క్షణకాలంలో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారతదేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు

దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు

English summary
Read In Telugu: Tata Motors beats Honda in India
Please Wait while comments are loading...

Latest Photos