వంటింటి వ్యర్థాలతో నడిచే భారతదేశపు తొలి బస్సు
భారతదేశపు అతి పెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ దేశీయ తొలి బయో-సిఎన్‌జి(బయో-మీథేన్) బస్సును రూపొందించింది.
భారతదేశపు అతి పెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ దేశీయ తొలి బయో-సిఎన్‌జి(బయో-మీథేన్) బస్సును రూపొందించింది. ఉర్జవ్ ఉత్సవ్ అనే పేరుతో జరిగిన బయో ఎనర్జీ ప్రదర్శన వేదిక మీద ఆవిష్కరించింది.

కేంద్ర పెట్రోలియ్ మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. లైట్ కమర్షియల్ వెహికల్స్(LCV), ఇంటర్మీడియమ్ కమర్షియల్ వెహికల్స్ (ICV) మరియు మీడియమ్ కమర్షియల్ వెహికల్ (MCV) బస్సుల్లో వినియోగించేందుకు బయో-మీథేన్ ఇంధన ఇంజన్‌లను టాటా మోటార్స్ స్వయంగా డిజైన్ చేసి మరియు అభివృద్ది చేసింది.

టాటా మోటార్స్ మొత్తం మూడు ఇంజన్‌లను ప్రదర్శించింది. ఇందులో టాప్ ఎండ్ మోడల్ ఎల్‌పిఒ 1613 బస్సును ఆవిష్కరించింది. ఎల్‌పిఒ 1613 బస్సులో బిఎస్-IV ఐఒబిడి-II ఉద్గార నియమాలను పాటించే 5.7 ఎస్‌జిఐ ఎన్‌ఎ ఇంజన్ కలదు. పూనేలోఇప్పటికే ఈ బస్సు సేవలందిస్తోంది.

సహజ వాయువులతో నడిచే వాహనాలను తయారు చేయడంలో టాటా మోటార్స్ ముందుంది. వెహికల్ పనితీరు మరియు సేఫ్టీ పరంగా సిఎన్‌జి ఇంజన్‌లలో అనేక కొత్త సాంకేతికతలను అభివృద్ది చేసింది టాటా మోటార్స్.

టాటా మోటార్స్, కమర్షియల్ వెహికల్ బిజినెస్ హెడ్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ," గ్రీన్ కంట్రీ కోసం ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే మరో వెహికల్‌ను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. బయో-సిఎన్‌జితో నడిచే వెహికల్స్ వినియోగంతో స్మార్ట్ నగరాల్లో కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నాడు."

టాటా మోటార్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి రాజేంద్ర పటేకర్ మాట్లాడుతూ," బయో మీథేన్ బస్సుల ప్రదర్శన పర్యావరణానుకూలమైన వాహనాల అభివృద్దికి మార్గం మరింత సుగమం అవుతోంది, అంతే కాకుండా బయో-మీథేన్ ను వంటింటి వ్యర్థాలతో ఉత్పత్తి చేయవచ్చని చెప్పుకొచ్చారు."

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సహజ వాయువులతో నడిచే వాహనాలు ఉత్పత్తి చేసే ఉద్గారాలలో కాలుష్య కారకాలు తక్కువగానే ఉంటాయి. పరిశుభ్రమైన వాతావరణం కోసం ఇలాంటి వాహనాల వాడకం ఎంతో అవసరం. బయో-ఇంధన వాడకంతో పెట్రోల్ మరియు డీజల్ వినియోగం తగ్గిపోతుంది. అదే విధంగా ఫ్యూయల్స్ కోసం దేశపు ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి.


Click it and Unblock the Notifications








