కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ కు టిగార్ తో నామకరణం చేసిన టాటా మోటార్స్

Written By:

టాటా మోటార్స్ అధికారికంగా తమ అప్ కంమింగ్ కాంపాక్ట్ సెడాన్ కారుకు "టిగార్" అనే పేరును ఖరారు చేసింది. టాటా మోటార్స్ సుమారుగా ఏడాది కాలం పాటు కైట్ 5 పేరుతో కాన్సెప్ట్ దశలో ఉన్నప్పుడు అనేక పరీక్షలు నిర్వహించింది. అయితే ఉత్పత్తి దశకు చేరుకున్న ఈ కాంపాక్ట్ సెడాన్‌కు చివరికి టిగార్ అనే పేరును ఖాయం చేసినట్లు ఓ ప్రకనటలో తెలిపింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టాటా టిగార్ కాంపాక్ట్ సెడాన్

టాటా మోటార్స్ దేశీయంగా ఉన్న ప్యాసింజర్ కార్ల విభాగం మీద ధీర్ఘ దృష్టిని సారించింది. ఏ మాత్రం ఆలస్యం లేకుండా మార్కెట్లో ఉన్న వాతావరణాన్ని అంచనా వేస్తూ, సరైన కాలపరిమితితో ఒక్కో సెగ్మెంట్లో ఒక్కో మోడల్‌ను విడుదల చేస్తూ వస్తోంది.

టాటా టిగార్ కాంపాక్ట్ సెడాన్

గత ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద అనేక కాన్సెప్ట్ మోడళ్లను ప్రదర్శించింది. అందులో హెక్సా ఎమ్‌పీవీ మరియు టియాగో హ్యాచ్‌బ్యాక్ ఆధారిత కాంపాక్ట్ సెడాన్ కైట్ 5.

టాటా టిగార్ కాంపాక్ట్ సెడాన్

ఈ ఏడాది ప్రారంభంలో హెక్సా ఎమ్‌పీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే అన్ని విభాగాల వారీగా పరీక్షలు పూర్తి చేసుకుని ప్రొడక్షన్ దశకు చేరుకున్న కైట్ 5 మోడల్‌కు టిగార్ అనే పేరును ప్రకటిచింది.

టాటా టిగార్ కాంపాక్ట్ సెడాన్

టాటా యొక్క నూతన డిజైన్ ఇంపాక్ట్ (IMPACT) ఫిలాసఫి ఆధారంగా టిగార్ కాంపాక్ట్ సెడాన్‌ను డిజైన్ చేసింది. తమ హెక్సా ఎమ్‌పీవీని కూడా ఇదే ఫిలాసఫి ఆధారంగా అభివృద్ది చేసింది. మునుపటి ఉత్పత్తులతో పోల్చుకుంటే నూతన ఉత్పత్తుల డిజైన్ బెటర్ అని చెప్పవచ్చు.

టాటా టిగార్ కాంపాక్ట్ సెడాన్

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగాధినేత మయాంక్ పరీక్ టాటా టిగార్ పేరును ప్రకటిస్తూ, " టాటా హెక్సా విడుదల అనంతరం, మరో ఆసక్తికరమైన మోడల్‌ టిగార్ ను విడుదలకు సిద్దం చేస్తున్నాం. స్టైల్‌బ్యాక్ సెగ్మెంట్లో భారతదేశపు మొట్టమొదటి కారు ఇదేనని తెలిపాడు".

టాటా టిగార్ కాంపాక్ట్ సెడాన్

ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫి ఆధారంగా నిర్మించిన దేశీయ మరియు వాణిజ్య మొట్టమొదటి స్టైల్‌బ్యాక్ కాంపాక్ట్ సెడాన్ టిగార్ కారు అధికారిక విడుదల వివరాలను అతి త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

టాటా టిగార్ కాంపాక్ట్ సెడాన్

సాంకేతికంగా ఈ స్టైల్‌బ్యాక్ సెడాన్‌ కారును 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించనుంది. ట్రాన్స్‌మిషన్ పరంగా ఇది మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది.

టాటా టిగార్ కాంపాక్ట్ సెడాన్

విడుదలకు ఎంతగానో ఎదురు చూస్తున్న టిగార్ కాంపాక్ట్ సెడాన్‌ను మార్చి 2017 లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. నూతన కార్ల విడుదల మరియు అన్ని రకాల ఆటోమొబైల్ వార్తలను తెలుగులో పొందడానకి చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్...

 
English summary
Tata Motors Reveals The Name Of India's First Styleback — Kite 5 Renamed
Story first published: Thursday, February 9, 2017, 13:38 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark