వచ్చే మూడేళ్లలో మరో రెండు ఎస్‌యూవీలను విడుదల చేయనున్న టాటా

Written By:

భారత దేశపు దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ దేశీయ విపణిలోకి తమ సరికొత్త హెక్సా ఎమ్‌పివి వాహనాన్ని విడుదల చేసింది. ఎస్‌యూవీల రంగంలో మంచి అవకాశాలు ఉన్న నేపథ్యంలో మార్కెట్ వాటాలో ఎక్కువ భాగం సొంతం చేసుకోవడానికి టాటా వచ్చే మూడేళ్ల కాలంలో రెండు నూతన ఎస్‌యూవీలను విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

టాటా ప్యాసింజర్ కార్ల ధరలను మీ నగరంలో తెలుసుకోవడానికి మరియు టాటా ప్యాసింజర్ కార్ల ఫోటోల కోసం...

టాటా మోటార్స్ ఎస్‌యూవీలు

ప్రస్తుతం ఎస్‌యూవీల సెగ్మెంట్లో మహీంద్రా అండ్ మహీంద్రాదే పైచేయి. అయితే ఎస్‌యూవీల మార్కెట్ పరంగా మహీంద్రా ఆక్రమించుకున్న మొదటి స్థానాన్ని కూల్చేయడానికి టాటా మోటార్స్ ధరకు తగ్గ విలువలతో హెక్సా ఎమ్‌పివి ని విడుదల చేసింది.

టాటా మోటార్స్ ఎస్‌యూవీలు

టాటా నుండి రానున్న మరో మోడల్ నెక్సాన్. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి విడుదల చేయనున్న దీనిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రొడక్షన్ దశకు చేరుకున్న రూపంలో ప్రదర్శించింది. దీని తరువాత మరో ఎస్‌యూవీ టాటా లైనప్‌లోనే అత్యంత సౌకర్యవంతమైన వాహనంగా నిలవనుంది.

టాటా మోటార్స్ ఎస్‌యూవీలు

టాటా మోటార్స్ భాగస్వామిగా ఉన్న ల్యాండ్ రోవర్ యొక్క డిస్కవరీ స్పోర్ట్ ఎల్550 ని నిర్మించిన వేదిక మీద టాటా నూతన ఎస్‌యూవీని నిర్మించనుంది. టాటా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో ఇంగ్లాడ్, ఇటలీ మరియు ఇండియా లోని టాటా డిజైన్ స్టూడియోలలో దీనిని అభివృద్ది చేస్తోంది.

టాటా మోటార్స్ ఎస్‌యూవీలు

ఈ సందర్భంగా ల్యాండ్ రోవర్ డిజైన్ ఇంజనీరింగ్ బృందం గుర్చించి చర్చింకోవాలి. ల్యాండ్ రోవర్ లోని ఎస్‌యూవీలను సౌందర్యంగా డిజైన్ చేయడంలో ఈ బృందం ప్రధాన పాత్ర పోషిస్తోంది. కాబట్టి టాటా వారి లగ్జరీ ఎస్‌యూవీని ప్రపంచ మార్కెట్‌ ను దృష్టిలో ఉంచుకుని అభివృద్ది చేయనుంది.

టాటా మోటార్స్ ఎస్‌యూవీలు

దేశీయంగా టాటా లైనప్‌లో ఉన్న సఫారీ కన్నా పై స్థానంలో నిలవనుంది. మరియు టయోటా, షెవర్లే మరియు ఫోర్డ్ సంస్థలు అందిస్తున్న ఖరీదైన ఎస్‌యూవీల కన్నా దిగువ స్థానంలో నిలవనుంది.

టాటా మోటార్స్ ఎస్‌యూవీలు

టాటా మోటార్స్ లోని ఒక అధికారి మాట్లాడుతూ, "టాటా బ్యాడ్జ్ పేరుతో వస్తోన్న ఈ ఎస్‌యూవీ అత్యంత విలాసవంతమైన, ప్రీమియమ్ వాహనం అని తెలిపాడు, సుమారుగా రూ. 20 లక్షల ప్రారంభ ధరతో నెక్సాన్ అనంతరం విడుదల ఉంటుంది" అని తెలిపాడు.

టాటా మోటార్స్ ఎస్‌యూవీలు

టాటా వారి ప్రీమియమ్ ఎస్‌యూవీ 2-లీటర్ల సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌తో రానుంది మరియు నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.5-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో విడుదల కానుంది.

టాటా మోటార్స్ ఎస్‌యూవీలు

ఎస్‌యూవీ మార్కెట్ మీద దృష్టి సారిస్తూనే ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ ను నిర్లక్ష్యం చేయకుండా టియాగో కు కొనసాగింపుగా టియాగో ఆక్టివ్ క్రాసోవర్ ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

టాటా మోటార్స్ ఎస్‌యూవీలు

టాటా ప్రస్తుతం భారత మార్కెట్లో 18 మోడల్(ళ్ల)ను ఆఫర్ చేస్తోంది. టాటా కారు ధరలు, మోడళ్లు మరియు వేరియంట్ల గురించి తెలియజేయటంలో డ్రైవ్‌స్పార్క్ మీకు సహకరిస్తుంది. టాటా అందిస్తున్న ఉత్పత్తుల యొక్క ఎక్స్-షోరూమ్, ఆన్-రోడ్ ధరలు, కలర్ ఆప్షన్స్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ న్యూస్ మరియు భారత్‌లో టాటా యొక్క అన్ని కార్ల ఫొటోలను వీక్షించండి

English summary
Tata Motors To Launch Two SUVs In Next Three Years
Please Wait while comments are loading...

Latest Photos