మళ్లీ రోడ్డెక్కిన టాటా నానో: కారణం ఇదే...!!

Written By:

టాటా మోటార్స్ తమ నానో స్మాల్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారుకు మళ్లీ ప్రాణం పోయాలని చూస్తోంది. టాటా మోటార్స్ భారీ అంచనాలతో ప్రపంచపు చీపెస్ట్ కారుగా విడుదల చేసిన నానో పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

టాటా నానో ఎలక్ట్రిక్ కారు

సామాన్యుడి కోసం చిన్న కారును అందుబాటులో ఉంచేలా, నానో ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని రతన్ టాటా గారు అభివృద్ది చేయించారు. ప్రారంభంలో నానోకు మంచి స్పందన లభించినప్పటికీ, తర్వాత కొంత కాలానికే ఆదరణ కరువైంది.

టాటా నానో ఎలక్ట్రిక్ కారు

టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల విభాగంలో నానో తీవ్ర నిరాశను మిగిల్చింది. దీంతో నష్టాలు కూడా చవిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ టాటా నానో ప్రాజెక్టును వదలట్లేదు. నానోలోని పెట్రోల్ ఇంజన్ స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్ అందించి నానో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను అభివృద్ది చేస్తున్నారు.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
టాటా నానో ఎలక్ట్రిక్ కారు

టాటా మోటార్స్ ఈ మధ్యనే నానో ఎలక్ట్రిక్ వెర్షన్‌కు రహదారి పరీక్షలు నిర్వహించింది. దీనితో పాటు, రెగ్యులర్ వర్షన్ నానో కారును కూడా తమిళనాడులోని కోయంబత్తూరులో జాతీయ రహదారుల మీద ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.

టాటా నానో ఎలక్ట్రిక్ కారు

రహస్యంగా లీకైన ఫోటోల ప్రకారం, పరీక్షించబడిన నానో విండో అద్దం మీద '4BNEV-A08' గుర్తించడం జరిగింది. అయితే ఇది రెగ్యులర్ వెర్షన్ నానో కావడం మరో విశేషం. అంటే నానో ఎలక్ట్రిక్‌తో పాటు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వేరియంట్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

టాటా నానో ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు కోసమే రూపొందించినట్లుగా నానో బాడీ ఉండటంతో, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టడానికి సాధ్యమవుతోంది. ఎలక్ట్రిక్ మోటార్ రన్ అయ్యేందుకు లిథియం అయాన్ బ్యాటరీని వినియోగంచనున్నారు.

టాటా నానో ఎలక్ట్రిక్ కారు

టాటా ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఇంగ్లాండులోని టాటా మోటార్స్ యూరోపియన్ టెక్నికల్ సెంటర్ ప్రత్యేక సాంకేతికతను అభివృద్ది చేసింది. సరికొత్త ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్ గల టాటా టియాగో మరియు టాటా బోల్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ఇది వరకే ప్రదర్శించింది కూడా.

టాటా నానో ఎలక్ట్రిక్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ నానో కారును చాలా తక్కువ ధరలోనే విక్రయిస్తోంది. కాబట్టి, ఇదే నానో లోని ఇంజన్‌ స్థానంలో, ఎలక్ట్రిక్ మోటార్‌ను ప్రవేశపెట్టి అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్లోకి విడుదల చేసింది. టాటా ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ మీద దృష్టి సారిస్తోంది. అందులో భాగంగానే నానో, టియాగో మరియు బోల్ట్ కార్లను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో పరీక్షిస్తోంది.

English summary
Read In Telugu: Tata Nano Electric Car Spied Testing In Coimbatore
Story first published: Thursday, September 14, 2017, 12:49 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark