నానో భవితవ్యం గురించి ఆసక్తికర ప్రకటనలు చేసిన టాటా ప్రతినిధి

టాటా మోటార్స్ ఎట్టకేలకు తమ నానో స్మాల్ హ్యాచ్‌బ్యాక్ భవిష్యత్ ప్లాన్ వివరాలను వెల్లడించింది. నానో ఆశించిన ఫలితాలు సాధించలేనప్పటికీ, తమ చిన్న కారును నానో ప్రొడక్షన్‌ను కొనసాగిస్తామని వెల్లడించింది.

By Anil

టాటా మోటార్స్ ఎట్టకేలకు తమ నానో స్మాల్ హ్యాచ్‌బ్యాక్ భవిష్యత్ ప్లాన్ వివరాలను వెల్లడించింది. నానో ఆశించిన ఫలితాలు సాధించలేనప్పటికీ, తమ చిన్న కారును నానో ప్రొడక్షన్‌ను కొనసాగిస్తామని వెల్లడించింది. ప్రజలతో టాటా భావోద్వేగమైన సంభందాలను మరికొంత కాలం పాటు కొనసాగించేందుకు నానో ఉత్పత్తిని ఆపడంలేదని స్పష్టం చేసింది.

టాటా నానో

టాటా నానో భారతదేశపు అత్యంత సరసమైన స్మాల్ కారు. టాటా ఛైర్మన్ రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఇది ఆశించిన ఫలితాలు కనబరచకపోయినప్పటికీ దీని ఉత్పత్తిని యథావిధిగా కొనసాగించనున్నారు.

టాటా నానో

టాటా ప్రతినిధి మాట్లాడుతూ, "టాటా ప్యాసింజర్ కార్ల విభాగంలో నానో కీలకమైన పాత్ర పోషించింది. తొలిసారి కారును కొనుగోలు కస్టమర్ల కోణం నుండి చేస్తే, భారత్‌కు మరియు టాటాకు నానో అతి ముఖ్యమైన మోడల్ అని తెలుస్తుంది."

Recommended Video

Tata Tiago XTA AMT Variant Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టాటా నానో

అంతే కాకుండా, టాటా మోటార్స్ ప్రతి రోజూ తమ ఉత్పత్తుల గురించి వ్యూహాత్మక ప్రణాళికలతో సమీక్షిస్తుంటుంది. అతి త్వరలో అప్‌డేటెడ్ నానో కారును మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించాడు. అంత వరకు ప్రస్తుతం ఉన్న నానో మోడల్‌ను డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపాడు.

టాటా నానో

గత కొంత కాలంగా టాటా నానో గురించి ఎన్నో కథనాలొచ్చాయి. మరియు దీని గురించి అనేక వాదోపవాదనలు కూడా వచ్చాయి. దీని గురించి టాటా ప్రతినిధి స్పందిస్తూ, నానో గురించి ఏ విషయంలోనైనా కేవలం టాటా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుంది, మరియు అవి టాటా ప్యాసింజర్ వెహికల్ విభాగపు వ్యూహాత్మక ప్రణాళికలకు లోబడి ఉంటాయని చెప్పుకొచ్చాడు.

టాటా నానో

టాటా మోటార్స్ భవిష్యత్ రవాణా తీరును దృష్టిలో ఉంచుకుని నానోలో మార్పులు తీసుకొస్తోంది. ఈ మధ్యనే నానో కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కోయంబత్తూరులో పరీక్షించింది. అంటే ఫ్యూచర్‌లో కన్వెన్షనల్(పెట్రోల్ మరియు డీజల్) వేరియంట్‌తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలను ముమ్మరం చేస్తోంది.

టాటా నానో

టాటా నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ మాట్లాడుతూ, "దేశీయ ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ వరసగా మూడవ స్థానాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించాడు."

టాటా నానో

ఎలక్ట్రిక్ కార్ల గురించి మయాంక్ పరీక్ స్పందిస్తూ, టాటా ఇంగ్లాడ్ భాగ్వామ్యపు విభాగం టాటా యూరోపియన్ టెక్నికల్ సెంటర్ పిఎల్‌సి(TMETC) ఇప్పటికే, కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ది చేసింది. దేశీయంగా ఇది వరకే ఉన్న టియాగో మరియు బోల్ట్ కార్లను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అభివృద్ది చేస్తోంది.

టాటా నానో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా గౌరవ ఛైర్మన్ రతన్ టాటా గారి ప్రతిష్టాత్మకంగా ఈ నానో స్మాల్ కారు ప్రాజెక్టుకు ప్రాణం పోశారు. కాస్తో కూస్తో విక్రయాలతో నెట్టుకొస్తున్న టాటా, నానో కారు ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయకుండా... కొన్ని మార్పులు చేర్పులతో మళ్లీ భారత కస్టమర్లను చేరుకోవడానికి టాటా ప్రయత్నిస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Motors Reveals Its Future Plans For Nano
Story first published: Wednesday, September 27, 2017, 18:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X