దిగ్గజాలకు దడపుట్టిస్తున్న టాటా నెక్సాన్ ఫలితాలు

Written By:

టాటా మోటార్స్ తొలిసారిగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి నెక్సాన్ పరిచయంతో ప్రవేశించింది. చిన్న ఎస్‌యూవీ బరిలోకి దిగిన టాటా మోటార్స్‌కు నెక్సాన్ ఎస్‌యూవీ మంచి సక్సెస్ సాధించిపెట్టింది.

టాటా నెక్సాన్

అశేషమైన ఆదరణతో అత్యుత్తమ బుకింగ్స్ మరియు సేల్స్ దిశగా టాటా నెక్సాన్ దూసుకెళుతోంది. తీవ్ర పోటీ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో టాటా నెక్సాన్ మంచి ఫలితాలను నమోదు చేసుకుంటోంది. 5 వేరియంట్లు రెండు ఇంజన్ ఆప్షన్‌లలో టాటా ఎక్కుపెట్టిన నెక్సాన్ గురి ఏ మాత్రం మిస్సవ్వలేదు.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ విడుదలైనప్పటి నుండి విజయవంతంగా విక్రయించబడుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలైన టాటా నెక్సాన్ గడిచిన రెండు నెలల్లో 10,000 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. టాటా ఇటీవలె రంజన్‌గావ్ ప్రొడక్షన్ ప్లాంటులో 10,000 వ నెక్సాన్ ప్లాంటు నుండి ఉత్పత్తి చేసింది.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజల రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. రెండు ఇంజన్ వేరియంట్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తున్నాయి. అయితే, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ అతి త్వరలో లాంచ్ చేయడానికి టాటా మోటార్స్ సిద్దం అవుతోంది.

టాటా నెక్సాన్

1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా నెక్సాన్

209ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్, 16-అంగుళాల మెషీన్ కట్ అల్లాయ్ వీల్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 8-స్పీకర్లు, ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ సపోర్ట్ చేయగల హార్మన్ 6.5-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

టాటా నెక్సాన్

ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్, డ్యూయల్ పాత్ సస్పెన్షన్, బకెట్ టైప్ సీట్లు, రిమోట్ కీ, ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ అనలాక్ మరియు అప్రోచ్ ల్యాంప్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తోంది.

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీని సరికొత్త ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ లాంగ్వేజ్ ఆధారంతో నిర్మించింది. ఇది మొరొకాన్ బ్లూ, వెర్మోంట్ రెడ్, సీటిల్ సిల్వర్, గ్లాస్గో గ్రే మరియు కాల్గేరి వైట్ ఐదు విభిన్న రంగుల్లో లభిస్తోంది.

టాటా నెక్సాన్

భద్రత పరంగా, టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, కార్నర్ స్టెబిలిటి కంట్రోల్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందిస్తోంది.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.85 లక్షలు మరియు నెక్సాన్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.45 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

English summary
Read In Telugu: Tata Motors Rolls Out The 10,000th Nexon SUV — Are The Rivals Listening?
Story first published: Saturday, December 2, 2017, 15:57 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark