ఈ వేరియంట్లో వస్తే నెక్సాన్‌ ఎస్‌యూవీకి తిరుగే ఉండదు

Written By:

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ తొలి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్‌ను ఈ సెప్టెంబర్ 21, 2017 న విడుదల చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంది. అయితే, ఇప్పుడు నెక్సాన్ ఆటోమేటిక్ వేరియంట్‌ను పరీక్షిస్తుండగా మీడియా కంటబడింది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

టాటా మోటార్స్ భవిష్యత్తులో నెక్సాన్ ఎస్‌యూవీలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను అందివ్వనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ప్రస్తుతం టాటా లైనప్‌లో ఉన్న నానో, జెస్ట్ మరియు టియాగో కార్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. హెక్సా ఎస్‌యూవీలో టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
టాటా నెక్సాన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

తాజాగా పరీక్షిస్తు రివీల్ అయిన ఫోటోలను పరిశీలిస్తే టియాగో మరియు జెస్ట్ కార్లలో ఉన్న గేర్‌ లీవర్ కంటే భిన్నంగా ఉంది. నెక్సాన్ ఎక్స్‌జ్ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ ను పరీక్షించారు. ఇది పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లలో రానుంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

నెక్సాన్ ఎస్‌యూవీలో ఎకానిమీ, సిటి మరియు స్పోర్ట్ అనే మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. శక్తివంతమైన ఇంజన్, అధునాతన ఫస్ట్ ఇన్ క్రాస్ ఫీచర్లు, సరికొత్త డిజైన్ మరియు రెండు విభిన్న ట్రాన్స్‌మిషన్‌లతో రానున్న నెక్సాన్ ఎస్‌యూవీకి ఇండియన్ మార్కెట్లో తిరుగే ఉండదని చెప్పవచ్చు.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

తాజాగా అందుతున్న సమాచారం మేరకు, నెక్సాన్ తొలుత మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లతో విడుదలయ్యాక, ఈ ఏడాది చివరి నాటికి విపణిలోకి మళ్లీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో విడుదల చేయనుంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

నెక్సాన్ 1.5-లీటర్ సామర్థ్యం గల టుర్బోఛార్జ్‌డ్ డీజల్ మరియు 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌లు ఉన్నాయి. డీజల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్, అదే విధంగా పెట్రోల్ ఇంజన్ 108.బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించనున్నాయి.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

టాటా నెక్సాన్ ఇంటీరియర్‌లో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 6.4-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎనిమిది స్పీకర్లు గల హార్మన్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లను అందిస్తోంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ తమ తొలి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నెక్సాన్ ను 7 నుండి 10 లక్షల ధరల శ్రేణిలో విడుదల చేయనుంది. ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 లకు గట్టి పోటీనివ్వనుంది. వీటిలో ఎకోస్పోర్ట్ మరియు టియువి300 వెహికల్స్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తున్నాయి, వీటిని కూడా నెక్సాన్ ఆటోమేటిక్ వేరియంట్ ఎదుర్కోనుంది.

English summary
Read In Telugu: Tata Nexon With AMT Gearbox Spotted Testing
Story first published: Thursday, September 7, 2017, 18:14 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark