నెక్సాన్ ఆటోమేటిక్ విడుదల వివరాలు వెల్లడి

Written By:

దేశీయ విభిన్న వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవల నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విపణిలోకి విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం మ్యాన్యువల్ గేర్‍‌బాక్స్‌తో మాత్రమే లభించే నెక్సాన్ ఎస్‌యూవీని ఇప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదల చేయడానికి టాటా సిద్దమయ్యింది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్ వేరియంట్ గురించిన పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

టాటా ప్రొడక్షన్ ప్లాంటు నుండి లీకైన పత్రాల ఆధారంగా నెక్సాన్‌లోని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రానున్నట్లు స్పష్టం అయ్యింది.

Recommended Video - Watch Now!
[Telugu] Tata Nexon Review: Specs
టాటా నెక్సాన్ ఆటోమేటిక్

పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో ఏఎమ్‌టి గేర్‌బాక్స్ రానున్న తొలి ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నెక్సాన్ నిలవనుంది. ఇదే సెగ్మెంట్లో ఉన్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 ఎస్‌యూవీలలో ఏఎమ్‌టి ఉన్నప్పటికీ ఎకోస్పోర్ట్‌లో పెట్రోల్ మరియు టియువి300లో డీజల్ వేరియంట్లలో మాత్రమే ఏఎమ్‌టి ఉంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో ఏఎమ్‌టి గేర్‌బాక్స్ రానున్న తొలి ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నెక్సాన్ నిలవనుంది. ఇదే సెగ్మెంట్లో ఉన్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 ఎస్‌యూవీలలో ఏఎమ్‌టి ఉన్నప్పటికీ ఎకోస్పోర్ట్‌లో పెట్రోల్ మరియు టియువి300లో డీజల్ వేరియంట్లలో మాత్రమే ఏఎమ్‌టి ఉంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

టాటా తమ నెక్సాన్ ఏఎమ్‌టిలో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందివ్వనుంది. ఆటోమేటిక్‌తో పాటు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను యథావిధిగా అందివ్వనుంది. రహస్యంగా లీకైన సమాచారం మేరకు, ఆటోమేటిక్ వెర్షన్ నెక్సాన్‌లో సన్‌రూఫ్ కూడా రానుంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

నెక్సాన్ ఏఎమ్‌టి టాప్ వేరియంట్లయిన ఎక్స్‌జడ్ఎ లో మాత్రమే ఆటోమేటిక్ పరిచయం చేయనుంది. ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో పాటు కలర్ ఆప్‌డేట్స్ కూడా రానున్నాయి. ఇది వరకే ఉన్న కలర్స్‌తో పాటు సరికొత్త మారి గోల్డ్ కలర్ స్కీమ్‌లో కూడా ఎంచుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

నెక్సాన్ ఏఎమ్‌టి పూర్తి స్థాయి ప్రొడక్షన్ జనవరి 2018 నుండి మొదలవ్వనుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్, సరికొత్త కలర్ ఆప్‌డేట్ మరియు రూఫ్ టాప్ మినహాయిస్తే, అప్ కమింగ్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఎలాంటి మార్పులు జరగలేదు.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

సాంకేతికంగా నెక్సాన్ ఏఎమ్‌టి అవే 1.2-లీటర్ టుర్భో ఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌లతో లభించనుంది. నెక్సాన్ పెట్రోల్ మరియు డీజల్ 108.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగా, వరుసగా 170 మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభించనున్న భారతదేశపు తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్. మ్యాన్యువల్ వెర్షన్‌తో పోల్చుకుంటే ఆటోమేటిక్ వెర్షన్ మైలేజ్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. అయితే, రెగ్యులర్ నెక్సాన్‌తో పోల్చుకుంటే ఏఎమ్‌టి వేరియంట్ల ధరలు రూ 50,000 నుండి రూ. 60,000 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Tata Nexon AMT- More Details Revealed Ahead of Launch
Story first published: Tuesday, November 14, 2017, 10:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark