టాటా నెక్సాన్ మీద బుకింగ్స్ ప్రారంభం

Written By:

టాటా మోటార్స్ సరికొత్త డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా ఉత్పత్తి చేసిన నాలుగవ మోడల్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెప్టెంబర్ 21, 2017 న మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ఖరారు చేసింది. దీని మీద బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టాటా నెక్సాన్

నెక్సాన్ మీద మార్కెట్లో భారీ అంచనాలున్నాయి. మీరు కూడా నెక్సాన్‌ను ఇష్టపడుతున్నట్లయితే, వెంటనే సమీపంలోని టాటా డీలర్ వద్ద మీకు నచ్చిన వేరియంట్‌ను బుక్ చేసుకోండి. ఎందుకంటే, నెక్సాన్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, డిమాండుకు సరిపడా ఉత్పత్తి చేయలేక వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోనుంది.

టాటా నెక్సాన్

మీ నెక్సాన్ మీ ఇంటింకి చేరాలంటే కనీసం ఐదు లేదా ఆరు నెలల సమయం పట్టవచ్చు. కాబట్ట ఇప్పుడే బుక్ చేసుకున్న వారికి విడుదల అనంతరం వెంటనే డెలివరీలు ప్రారంభించనుంది.

Recommended Video
Volkswagen Launches Tenth Anniversary special Editions | In Telugu - DriveSpark తెలుగు
టాటా నెక్సాన్

దేశవ్యాప్తంగా ఉన్న 650 టాటా ప్యాసింజర్ కార్ల విక్రయ కేంద్రాలకు నెక్సాన్ ఎస్‌యూవీలను చేర్చుతున్నట్లు టాటా ప్రకటించింది. విడుదలకు ముందే, కస్టమర్లు టాటా షోరూమ్‌లను సందర్శించి నెక్సాన్‌ను టెస్ట్ డ్రైవ్ చేయవవచ్చు.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‍‌యూవీని ఎంచుకోవాలనుకునే వారి రూ. 11,000 ల మొత్తాన్ని వెచ్చించి బుక్ చేసుకోవచ్చు. నెక్సాన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో తొలుత మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో విడుదలయ్యి, ఆ తరువాత ఈ ఏడాది చివరి నాటికి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యం కానుంది.

టాటా నెక్సాన్

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఎస్‌యూవీ అంటే ఇలానే ఉండాలి అనే కాలానికి ముగింపు పలుకుతూ, సరికొత్త బోల్డ్ డిజైన్, కూపే స్టైల్ రూఫ్ లైన్, డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ బాడీ కలర్, ఫస్ట్ ఇన్ క్లాస్ ఇంటీరియర్ ఫీచర్లతో టాటా నెక్సాన్‌ను అభివృద్ది చేసింది.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 ఎస్‌యూవీల నోర్లు మూయించినుంది. పోటీగా ఉన్న ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని ధరలు నిర్ణయిస్తే నెక్సాన్ విజయానికి తిరుగే ఉండదని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Tata Nexon Bookings Open; Price in India, Launch Date, Images, Review & Features
Story first published: Tuesday, September 12, 2017, 10:09 [IST]
Please Wait while comments are loading...

Latest Photos