పది రోజుల్లో 2772 నెక్సాన్ ఎస్‌యూవీలను విక్రయించిన టాటా

Written By:

టాటా మోటార్స్ ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మొట్టమొదటి సారిగా నెక్సాన్ వాహనంతో ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లోకి ఆలస్యంగా విడుదజలైనప్పటికీ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకొంది. ఇతర మోడళ్లకు గట్టి పోటీని సృష్టించే ధరతో అత్యుత్తమ డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్లతో ఎస్‌యూవీ ప్రేమికుల అభిమానాన్ని చూరగొంది.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ విడుదలైన తొలి నెలలో 2,772 యూనిట్ల సేల్స్ సాదించింది. విడుదలైన నెలలో కేవలం పది రోజులు మిగాలాయి. ఆ పది రోజుల్లో ఈ సేల్స్ సాధించి అదే నెలలో భారతదేశపు టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల జాబితాలో చోటు దక్కించుకుంది.

Recommended Video - Watch Now!
[Telugu] Tata Nexon Review: Specs
టాటా నెక్సాన్

టాటా మోటార్స్ సెప్టెంబర్ 21, 2017 న దేశీయ విపణిలోకి నెక్సాన్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ప్రస్తుతానికి ఆశించిన ఫలితాలు కనబరచినప్పటికీ భవిష్యత్తులో దీని విక్రయాలు ఎలా ఉండబోనున్నాయనేది ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

టాటా నెక్సాన్

టాటా చివరిగా విడుదల చేసిన టియాగో, హెక్సా మరియు టిగోర్ వాహనాలు తొలుత అంతంత మాత్రం ఫలితాలు కనబరచినా తరువాత విక్రయాలు ఊపందుకున్నాయి. టాటా నెక్సాన్ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ మీద వెయిటింగ్ పీరియడ్ 6-8 వారాల పాటు ఉంది. నెక్సాన్ ధరల శ్రేణి రూ. 5.85 నుండి 9.44 లక్షల మధ్య ఉంది. మారుతి బ్రిజాలోని ఏ వేరియంట్‌తో పోల్చుకున్నా ధరలో 40,000 నుండి 45,000 రుపాయల వ్యత్యాసం ఉంటుంది.

Trending On DriveSpark Telugu:

మెగాస్టార్ ఫ్యామిలీ కార్ కలెక్షన్!

ముఖేష్ అంబానీ కారు డ్రైవర్ నెలసరి జీతం ఎంతో తెలుసా...?

మారుతి వితారా బ్రిజాతో పోల్చితే టాటా నెక్సాన్ ఎంపిక సరైనదేనా...?

టాటా నెక్సాన్

మారుతి సుజుకి వితారా బ్రిజా 13,628 యూనిట్ల సేల్స్‌తో టాప్ 10 జాబితాలో మొదటి స్థానంలోఉంది. గత ఏడాది అదే సెప్టెంబర్ నెలలో 9,375 యూనిట్ల బ్రిజా ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి.

టాటా నెక్సాన్

తరువాత స్థానంలో 9,292 యూనిట్ల సేల్స్‌తో హ్యుందాయ్ క్రెటా రెండవ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో 8,8385 యూనిట్ల క్రెటా ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి.

టాటా నెక్సాన్

ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా నుండి సెప్టెంబర్ 2017లో బొలెరో, స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 వాహనాలు వరుసగా మూడు, ఐదు మరియు తొమ్మిదవ స్థానాల్లో నిలిచాయి.

టాటా నెక్సాన్

గత ఏడాది సెప్టెంబర్ నెలలో 7,300 యూనిట్ల సేల్స్‌తో మూడవ స్థానంలో నిలిచిన టయోటా ఇన్నోవా క్రిస్టా ఈ ఏడాది అదే సెప్టెంబర్ నెలలో 6,323 యూనిట్ల సేల్స్‌తో నాలుగవ స్థానానికి పడిపోయింది.

టాటా నెక్సాన్

సెప్టెంబర్ 2016 లో 6,438 యూనిట్ల విక్రయాలు సాధించిన మారుతి సుజుకి ఎర్టిగా ఈ యేడు 5,683 యూనిట్ల సేల్స్‌తో ఆరవ స్థానంలో నిలిచింది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 4,934 విక్రయాలు నమోదు చేసుకుని ఏడవ స్థానంలో నిలిచింది.

టాటా నెక్సాన్

మార్చి 2017లో విడుదలైన హోండా డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీ హోండాకు మంచి విక్రయాలు సాధించిపెడుతోంది. గడిచిన సెప్టెంబర్ 2017లో 4,834 యూనిట్ల విక్రయాలు జరిపి టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల జాబితాలో ఏనిమిదవ స్థానంలో నిలిచింది.

English summary
Read In Telugu: Tata Nexon sales in first month of launch

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark