టాటా నెక్సాన్ మీద భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్

Written By:

టాటా మోటార్స్ భారీ అంచనాలతో, విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లకు పోటీగా తమ తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్‌ను విపణిలోకి విడుదల చేసింది.

మునుపటిలా టాటా నెక్సాన్ డెలివరీ ఇక మీదట అంత సులువేం కాదు. నెక్సాన్ డెలవరీల ఆలస్యానికి కారణమేంటో చూద్దాం రండి....

టాటా నెక్సాన్ వెయిటింగ్ పీరియడ్

నెక్సాన్ డిజైన్ కస్టమర్లలో మంచి ఉత్సాహాన్ని నింపింది. దీనికి తోడు పెట్రోల్ నెక్సాన్ ప్రారంభ ధర రూ. 5.85 లక్షలు మరియు డీజల్ నెక్సాన్ ప్రారంభ ధర రూ. 6.85 లక్షలు నుండి మొదలవ్వడంతో సెడాన్ మరియు హ్యాచ్‌హబ్యాక్ కార్లను ఎంచుకునే కస్టమర్లు నెక్సాన్ మీద మొగ్గుచూపుతున్నారు.

టాటా నెక్సాన్ వెయిటింగ్ పీరియడ్

విడుదలకు ముందే మార్గెట్ వర్గాలు ఆశించిన విధంగా నెక్సాన్ మీద బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. బుకింగ్స్‌కు సరిపడా ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో నెక్సాన్ మీద వెయింటింగ్ పీరియడ్ 6 నుండి 8 వారాల పాటు ఉంది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
టాటా నెక్సాన్ వెయిటింగ్ పీరియడ్

విడుదలకు ముందే మార్గెట్ వర్గాలు ఆశించిన విధంగా నెక్సాన్ మీద బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. బుకింగ్స్‌కు సరిపడా ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో నెక్సాన్ మీద వెయింటింగ్ పీరియడ్ 6 నుండి 8 వారాల పాటు ఉంది.

టాటా నెక్సాన్ వెయిటింగ్ పీరియడ్

టాటా మోటార్స్ ప్రస్తుతం నెక్సాన్ ఎస్‌యూవీలను రంజన్‌గావ్ లోని ఫియట్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. డిమాండుకు అనుగుణంగా ఇదే ప్లాంటులో ప్రొడక్షన్ లైను ద్వారా లేదంటే, అదనంగా మరో షిఫ్టు ద్వారా నెక్సాన్ ఉత్పత్తిని పెంచే ఆలోచనలో టాటా ఉంది.

టాటా నెక్సాన్ వెయిటింగ్ పీరియడ్

టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్లో ఉన్న 1.2-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల టుర్భోఛార్జ్‌డ్ రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

అదే విధంగా, నెక్సాన్ లోని 1.5-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల రివోటార్క్ డీజల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లు ప్రస్తుతానికి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభిస్తున్నాయి.

టాటా నెక్సాన్ వెయిటింగ్ పీరియడ్

ఫీచర్లను ప్రక్కనపెడితే, ప్రతి ఇండియన్ కస్టమర్ కోరుకునేది మైలేజ్. ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నెక్సాన్‌ను టాటా అభివృద్ది చేసింది. ఏఆర్ఏఐ మేరకు నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 17 కిమీలు మరియు నెక్సాన్ డీజల్ వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 21.5కిలోమీటర్లుగా ఉంది.

టాటా నెక్సాన్ వెయిటింగ్ పీరియడ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా నెక్సాన్ రాక నిజంగా మారుతి సుజుకి మీద తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి విడుదలైనప్పటికీ సెడాన్, హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యూవీలకు దీటైన ధరతో నెక్సాన్ విడుదలయ్యింది.

దీంతో , మారుతి లైనప్‌లో ఉన్న స్విఫ్ట్, బాలెనో, డిజైర్ మరియు వితారా బ్రిజా కార్ల దూకుడుకు నెక్సాన్ కళ్లెం వేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే మారుతి కస్టమర్లను నెక్సాన్ ఆకర్షిస్తోంది. విడుదలైన అనతి కాలంలోనే భారీ బుకింగ్స్‌తో రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉందంటే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మైలు రాళ్లను అధిగమిస్తుందో చూడాలి మరి.

English summary
Read In Telugu: Tata Nexon waiting period increases to 2 months
Story first published: Thursday, October 5, 2017, 12:14 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark