టాటా టియాగో కారుకు విపరీతంగా లభిస్తున్న ఆదరణ

Written By:

టాటా మోటార్స్ 2016 లో విడుదల చేసిన టియాగో హ్యాచ్‌బ్యాక్‌కు డిమాండ్ రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతోంది. విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏకంగా లక్షకు బుకింగ్స్ నమోదయ్యాయి. టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా అభివృద్ది చేసిన తొలి మోడల్ టియాగో హ్యాచ్‌బ్యాక్.

టాటా టియాగో బుకింగ్స్ సేల్స్

టాటా మోటార్స్ దశ తిరగే సమయం వచ్చింది. నిజమే, పాత మోడళ్లతో, పోటీదారులను తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ కాలం వెళ్లదీసిన టాటా మోటార్స్‌‌కు ఇప్పుడు ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఓ వరంగా మారింది. ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా వచ్చిన టియాగోతో పాటు, టిగోర్, హెక్సా మోడళ్లు కూడా మంచి ఫలితాలను కనబరుస్తున్నాయి.

టాటా టియాగో బుకింగ్స్ సేల్స్

టాటా మోటార్స్ టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసినప్పటి నుండి 65,000 టియాగో కార్లు రోడెక్కాయి. ఇందులో ఎక్కువగా టాప్ ఎండ్ వేరియంట్లే ఉన్నాయి. టాటా మోటార్స్‌ లైనప్‌లో టాప్ ఎండ్ వేరియంట్లకు డిమాండ్ అధికమవ్వడం ఇదే తొలిసారి. అంతే కాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ వెర్షన్‌లో పరిచయమైన టియాగో మీద కూడా సానుకూల స్పందన లభిస్తోంది.

టాటా టియాగో బుకింగ్స్ సేల్స్

టాటాకు చెందిన పూనే, ఇంగ్లాండ్ మరియు ఇటలీ డిజైన్ స్టూడియోలలో టియాగోను రూపొందించారు. దేశీయంగా సనంద్ ప్లాంటులో టియాగోను ఉత్పత్తి చేస్తోంది. డిమాండ్‌ను చేరుకోవడానికి వీలైనంత వరకు ఎక్కువ యూనిట్లను ఉత్పత్తి చేస్తోంది.

టాటా టియాగో బుకింగ్స్ సేల్స్

టియాగో హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.05-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. సిటి మరియు ఎకో డ్రైవింగ్ మోడ్‌లు గల రెండు ఇంజన్ వేరియంట్లు అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగలవు.

టాటా టియాగో బుకింగ్స్ సేల్స్

ప్యాసింజర్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ ముఖ చిత్రాన్ని మార్చేయనుంది టియాగో. ప్రస్తుతం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ను డామినేట్ చేస్తూ అత్యుత్తమ ఫలితాలను కనబరుస్తూ, నూతన రికార్డులను నెలకొల్పే దిశగా దీని విక్రయాలు జరుగుతున్నాయి.

టాటా టియాగో బుకింగ్స్ సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం టాటా మోటార్స్ వద్ద బెస్ట్ సెల్లింగ్ మోడల్ టియాగో. నూతన డిజైన్, బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు, మైలేజ్ మరియు ధరకు తగ్గ విలువలను కలిగి ఉండటంతో టియాగోకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Tata Tiago Is In High Demand — Achieves 1 Lakh Bookings

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark