షాకింగ్: టాటా నుండి టియాగో ఎలక్ట్రిక్ కారు

Written By:

టాటా మోటార్స్ చరిత్రనే మార్చేసిన టియాగో హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కారుగా విడుదలయ్యేందుకు సిద్దం అవుతోంది. టాటా మోటార్స్ టియాగో ఎలక్ట్రిక్ కారును 2017 సెప్టెంబర్‌లో ఆవిష్కరించనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు

మే 2017 లో టాటా తమ వార్షిక ఆర్థిక ఫలితాలను వెల్లడించిన సమావేశంలో టియాగో ఎలక్ట్రిక్ వెహికల్ గురించి వెల్లడించింది. టాటా మోటార్స్ భాగస్వామి అయిన ఇంగ్లాండ్ ఆధారిత టాటా మోటార్స్ యూరోపియన్ టెక్నికల్ సెంటర్(TMETC) టియాగో ఎలక్ట్రిక్ వెహికల్‌ను ప్రదర్శించే సంధర్భాన్ని వివరించింది.

Recommended Video
2017 Mercedes-Benz GLC AMG 43 Coupe Launched In India | In Telugu - DriveSpark తెలుగు

2017 సెప్టెంబర్ 6 మరియు 7 తేదీలలో "ఇంగ్లాండులోని మిల్‌బ్రూక్‌లో జరగనున్న లో కార్బన్ వెహికల్ ఈవెంట్‌లో ప్రదర్శించడానికి ఇంకెంతో సమయం లేదు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని", టాటా మోటార్స్ యూరోపియన్ విభాగం TMETC ట్వీట్ చేసింది.

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు

TMETC విభాగం పూర్తిగా బ్యాటరీ సహకారంతో నడిచే స్మాల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను అభివృద్ది చేసే ప్రాజెక్టును చేపట్టింది. టాటా బోల్ట్ బిఇవి(బోల్ట్ ఎలక్ట్రిక్ వెహికల్) ప్రోటోటైప్ నుండి మరియు బోల్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ హ్యాచ్‌బ్యాక్‌ను సేకరించిన పరికరాలతో టియాగో ఎలక్ట్రిక్ వెహికల్‌ను రూపొందించే అవకాశం ఉంది.

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు

అత్యంత సరసమైన ధరతో, ధరకు తగ్గ ఉత్పత్తులుగా టాటా కార్లకు మంచి పేరు ఉంది. ఇదే అంశంతో మంచి సక్సెస్ అందుకున్న టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను వీలైనంత వరకు అతి తక్కువ ధరతో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయనుంది. అయితే టియాగో ఇవి గురించి ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడించలేదు.

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టియాగో హ్యాచ్‌బ్యాక్ ద్వారా టాటా మోటార్స్ మంచి విజయాన్ని అందుకుంది. టియాగో మోడల్ అధారంగా మరిన్ని కొత్త ఉత్పత్తులను రూపొందించడానికి ఇదే సరైన సమయం. కాబట్టి టియగో ఆధారిత ఎలక్ట్రిక్ కారు ప్రపంచ విపణిలోకి వస్తే అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో సునామీ సృష్టించడంలో ఎలాంటి సందేహం ఉండదు.

English summary
Read In Telugu: Tata Tiago Electric Vehicle Debut Details Revealed
Story first published: Tuesday, July 25, 2017, 17:11 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark