TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు సిద్దమైంది: ఇదిగో సాక్ష్యం....
టాటా మోటార్స్ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అభివృద్ది చేసింది. టియాగో ఎలక్ట్రిక్ కారును ప్రస్తుతం ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది. టాటా ప్యాసింజర్ కార్ల విభాగానికి కనీవిని ఎరుగుని విజయాన్ని సాధించి పెట్టిన టియాగో హ్యాచ్‌బ్యాక్ అతి త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విపణిలోకి విడుదల కానుంది..
ఇంగ్లాండులోని మిల్‌బ్రూక్‌లో జరిగిన కార్బన్ ఎమిషన్ వెహికల్స్ ఎగ్జిబిషన్ 2017 వేదిక మీద పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించారు. ఇంగ్లాండ్ ఆధారిత టాటా మోటార్స్ మరియు యూరోపియన్ సాంకేతిక విభాగం(TNETC) సంయుక్తంగా ఎలక్ట్రిక్ టియాగోను అభివృద్ది చేశారు.
టాటా టియాగో ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌లో లిక్విడ్ కూల్డ్ 85కిలోవాట్ ఎలక్ట్రిక్ డ్రైవ్ మోటార్ కలదు, ఇది గరిష్టంగా 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టియాగో ఎలక్ట్రిక్ కేవలం 11 సెకండ్లలోనే 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం 135కిలోమీటర్లు నమోదైంది.


ఇంధనంతో నడిచే ఇంజన్ తొలగించి, ఎలక్ట్రిక్ మోటార్ అందివ్వడంతో టియాగో మొత్తం బరువుతో పోల్చితే టియాగో ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ 20 కిలోలు తక్కువ బరువును కలిగి ఉంది. టియాగో ఎలక్ట్రిక్ మొత్తం బరువు 1,040కిలోలుగా ఉంది.
టాటా టియాగో ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ సింగల్ ఛార్జింగ్‌తో 100కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. టియాగో హ్యాచ్‌బ్యాక్‌కు ఇండియాలో మంచి ఆదరణ లభిస్తోంది. గడిచిన ఆగష్టు 2017 లో 7,000 యూనిట్ల టియాగో కార్లు అమ్ముడుపోయాయి. టియాగో ఎలక్ట్రిక్ విడుదలైతే ఇదే తరహా విజయం సాధ్యమయ్యే అవకాశం ఉంది.
తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసేలా సరికొత్త ఫ్లాట్‌ఫామ్ మీద టియాగో కారును అభివృద్ది చేసింది. దీంతో ఇటు కన్వెన్షనల్ ఇంజన్(పెట్రోల్ లేదా డీజల్) లేదా ఎలక్ట్రిక్ ఏ వెర్షన్‌లోనైనా టియాగోను తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి టియాగో ఎలక్ట్రిక్ కారు అత్యంత సరసమైన ధరలోనే లభ్యం కానుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టాటా మోటార్స్ లైనప్‌లో టియాగో మంచి సక్సెస్ అందుకుంది. టియాగో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదలైతే, టాటా నుండి వచ్చే మరో సక్సెస్‌ఫుల్ మోడల్ అని చెప్పవచ్చు. మరిన్ని తాజా ఆటోమొబైల్ వార్తల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...