మారుతి సెలెరియో సేల్స్‌ను మింగేస్తున్న టాటా టియాగో: రికార్డ్ స్థాయిలో టియాగో అమ్మకాలు

ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా టాటా 2016 లో టియాగో ను విడుదల చేసింది. ప్రారంభంలో టియాగో సేల్స్ తక్కువగానే ఉన్నుప్పటికీ, ఇప్పుడు భారీ విక్రయాలు నమోదవుతున్నాయి.

By Anil

టాటా మోటార్స్ తమ పాత కాలం నాటి ఇండికా, ఇండిగో కార్ల తరానికి గుడ్ బై చెప్పి, సరికొత్త ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో కొత్త కార్లను ఉత్పత్తి చేస్తోంది. గడిచిన రెండేళ్ల కాలంలో మూడు కొత్త కార్లను విడుదల చేయగా, మరో కారును నెల రోజుల్లోపు విపణిలోకి విడుదల చేయనుంది.

టాటా టియాగో సేల్స్

ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా టాటా 2016 లో టియాగో ను విడుదల చేసింది. ప్రారంభంలో టియాగో సేల్స్ తక్కువగానే ఉన్నప్పటికీ, ఇప్పుడు భారీ విక్రయాలు నమోదవుతున్నాయి.

టాటా టియాగో సేల్స్

గడిచిన ఆగష్టు 2017 లో టాటా మోటార్స్ ఏకంగా 7,000 యూనిట్ల టియాగో హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయించింది. అదే విధంగా ఈ ఏడాది జూలైలో 6,274 యూనిట్లు, జూన్‌లో 5,438, మే నెలలో 4,901 యూనిట్ల టియాగోలు అమ్ముడుపోయాయి. ప్రతి నెలా టియాగో నమోదు చేస్తున్న క్రమానుగత సేల్స్ పరీశిలించవచ్చు.

Recommended Video

Tata Tiago XTA AMT Variant Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టాటా టియాగో సేల్స్

ఇదే ఆగష్టు 2017 లో 9,210 యూనిట్ల సెలెరియో కార్లను మారుతి విక్రయించింది. సెలెరియో మరియు టియాగో కార్లు ఒకే సెగ్మెంట్‌కు చెందినవి, క్రమానుగతంగా పెరుగుతున్న టియాగో సేల్స్ ఖచ్చితంగా సెలిరియో సేల్స్‌ను క్రాస్ చేయనుంది. అంతే కాకుండా టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలోకి చేరే అవకాశం ఉంది.

టాటా టియాగో సేల్స్

ఇదే ఆగష్టు 2017 లో 9,210 యూనిట్ల సెలెరియో కార్లను మారుతి విక్రయించింది. సెలెరియో మరియు టియాగో కార్లు ఒకే సెగ్మెంట్‌కు చెందినవి, క్రమానుగతంగా పెరుగుతున్న టియాగో సేల్స్ ఖచ్చితంగా సెలిరియో సేల్స్‌ను క్రాస్ చేయనుంది. అంతే కాకుండా టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలోకి చేరే అవకాశం ఉంది.

టాటా టియాగో సేల్స్

సరికొత్త సెగ్మెంట్లో రావడంతో టియాగో భారీ సక్సెస్ అందుకుంది. టియాగో కారులో శరీరానికి తగ్గట్లుగా శక్తివంతమైన ఇంజన్‌లు ప్రతి ఇండియన్ కస్టమర్‌ను ఆకట్టుకునే హార్మన్ ఆడియో సిస్టమ్, విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

టాటా టియాగో సేల్స్

సాంకేతికంగా టియాగోలోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 1.05-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 69బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ ఉత్పత్తి చేయగలదు. పెట్రోల్ వేరియంట్లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభిస్తుండగా, డీజల్ వేరియంట్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లోనే లభ్యమవుతోంది.

టాటా టియాగో సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అధిక పోటీతత్వం గల ధరలతో అత్యుత్తమ ఫీచర్లను అందించి టాటా టియాగోను ప్రవేశపెట్టింది. ప్రతి నెలా సేల్స్ క్రమక్రమంగా పెరుగుతుండటంతో భవిష్యత్తులో టాటా మోటార్స్ మరిన్ని రికార్డులను సాధించనుంది.

టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి ఇవీ అసలు కారణాలు!

Most Read Articles

English summary
Read In Telugu; Tata Tiago Closing In On Maruti Celerio Sales In India
Story first published: Friday, September 8, 2017, 10:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X