టాటా టియాగో విజ్ ఎడిషన్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు...

Written By:

టాటా టియాగో విజ్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ విపణిలోకి విడుదలయ్యింది. టాటా మోటార్స్ తమ బెస్ట్ సెల్లింగ్ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును విజ్ ఎడిషన్‌లో రూ. 4.52 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి తెచ్చింది.

టాటా టియాగో విజ్ ఎడిషన్ విడుదల

టాటా మోటార్స్ టియాగో కారును స్పోర్టివ్ శైలిలో లిమిటెడ్ ఎడిషన్‌గా విజ్ ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది.

  • టియాగో విజ్ ఎడిషన్ పెట్రోల్ ధర రూ. 4.52 లక్షలు
  • టియాగో విజ్ ఎడిషన్ డీజల్ ధర రూ. 5.30 లక్షలు
రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
టాటా టియాగో విజ్ ఎడిషన్ విడుదల

టాటా టియాగో విజ్ స్పెషల్ ఎడిషన్ కారులో కాంట్రాస్ట్ బ్లాక్ రూఫ్, ఎరుపు రంగు సొబగులున్న ఫ్రంట్ గ్రిల్, వీల్ క్యాప్స్ మరియు రెడ్ కలర్ సొబగులున్న ఇంటీరియర్ ప్రత్యేకంగా నిలిచాయి.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
టాటా టియాగో విజ్ ఎడిషన్ విడుదల

అదనంగా టియాగో విజ్ ఎడిషన్ రూఫ్ టాప్ మీద రూఫ్ రెయిల్స్ స్టాండర్డ్‌గా వచ్చాయి. స్పెషల్ ఎడిషన్ టియాగో విజ్ ఎడిషన్‌ను ఎక్స్‌టి వేరియంట్ ఆధారంగా అభివృద్ది చేశారు. అదనంగా వచ్చిన ఫీచర్లకు గాను, ఎక్స్‌టి వేరియంట్ కన్నా రూ. 15,000 లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది.

టాటా టియాగో విజ్ ఎడిషన్ విడుదల

సాంకేతికంగా టియాగో విజ్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్లో 1.2-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా టియాగో విజ్ ఎడిషన్ విడుదల

అదే విధంగా టియాగో విజ్ ఎడిషన్‌లో 1.05-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ 69బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తోంది.

టాటా టియాగో విజ్ ఎడిషన్ విడుదల

"ప్రస్తుతం దేశవ్యాప్తంగా టియాగోకు కొత్త కస్టమర్ల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. టియాగో విజయాన్ని జరుపుకుంటూ... పండుగ సీజన్ సంధర్భంగా కొత్త కస్టమర్ల కోసం సరికొత్త టియాగో విజ్ ఎడిషన్‌ను విడుదల చేసినట్లు", టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ పేర్కొన్నాడు.

టాటా టియాగో విజ్ ఎడిషన్ విడుదల

పరీక్ మాట్లాడుతూ,"గత మూడు నెలల నుండి టియాగో టాటా మోటార్స్‌కు భారీ సంఖ్యలో విక్రయాలు సాధించిపెడుతోంది. టియాగో ఇండియన్ హ్యాచ్‍‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో గేమ్‌ చేంజర్‌గా రాణిస్తోంది. ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించడానికి మరిన్ని స్పెషల్ ఎడిషన్‌లతో కస్టమర్లను చేరుకోనున్నట్లు తెలిపాడు."

టాటా టియాగో విజ్ ఎడిషన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా ప్యాసింజర్ కార్ల విభాగంలో టియాగో అత్యుత్తమ విక్రయాలు జరుపుతోంది. కస్టమర్లు మరిన్ని ఆప్షన్‌లలో ఎంచుకోవడానికి టియాగోను స్పెషల్ ఎడిషన్ పేరుతో విజ్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. రెగ్యులర్ మోడళ్లతో పోల్చితే చాలా స్పోర్టివ్ లక్షణాలను ఇది కలిగి ఉంది.

English summary
Read In Telugu: Tata tiago wizz launched in india launch price mileage specifications images
Story first published: Tuesday, September 12, 2017, 18:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark