తొలిప్రయత్నంగా విజ్ ఎడిషన్‌ను ప్రవేశపెడుతున్నాం

టాటా మోటార్స్ తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కారును సరికొత్త ఎడిషన్‌లో విడుదల చేయడానికి సిద్దమైంది.

By Anil

టాటా మోటార్స్ తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కారును సరికొత్త ఎడిషన్‌లో విడుదల చేయడానికి సిద్దమైంది. టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును విజ్ లిమిటెడ్ ఎడిషన్ కారును రూపొందిస్తోంది.

టాటా టియాగో విజ్ ఎడిషన్

ఈ కథనాన్ని నిజం చేస్తూ ప్రొడక్షన్ ప్లాంటులో టియాగో విజ్ కారును తయారు చేస్తున్నపుడు తీసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో లీకయ్యాయి. డిజైన్ పరంగా రెగ్యులర్ టియాగో కారును పోలి ఉన్నప్పటికీ ఎక్ట్సీరియర్ మీద డ్యూయల్ కలర్ స్కీమ్‌ను గుర్తించవచ్చు.

Recommended Video

Tata Tiago XTA AMT Variant Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టాటా టియాగో విజ్ ఎడిషన్

టియాగో విజ్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యం కానుంది. టియాగో విజ్ ఎక్ట్సీరియర్ మీద బ్లాక్ రూఫ్, బ్లాక్ కప్స్ ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు మరియు వీటిని మ్యాన్యువల్‌గా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

టాటా టియాగో విజ్ ఎడిషన్

టియాగో విజ్ ఎడిషన్ ఇంటీరియర్‌లో పియానో బ్లాక్ డ్యాష్ బోర్డ్ మరియు బెర్రీ రెడ్ తొడుగులు, స్టాండర్డ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ వంటివి ఉన్నాయి. వీటిని మినహాయిస్తే, మిగతా ఇంటీరియర్ మొత్తం స్టాండర్డ్‌ వెర్షన్‌నే పోలి ఉంటుంది.

టాటా టియాగో విజ్ ఎడిషన్

టియాగో విజ్ ఎడిషన్‌లో సరికొత్త ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి. మరియు ఇది కేవలం ఎక్స్‌టి వేరియంట్లో మాత్రమే లభించనుంది. ఇది వరకు వచ్చిన 14-అంగుళాల స్టీల్ వీల్స్‌కు బదులుగా ఇందులో 13-అంగుళాల స్టీల్ వీల్స్ ఉన్నట్లు తెలిసింది.

టాటా టియాగో విజ్ ఎడిషన్

టియాగో విజ్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ 83బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ పెట్రోల్ మరియు 68బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.05-లీటర్ డీజల్ ఇంజన్‌లతో రానుంది. రెండు ఇంజన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్నాయి.

టాటా టియాగో విజ్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పాశ్చ్యాత కార్ల తయారీ సంస్థలు మంచి విజయాన్ని అందుకున్న మోడళ్లను వివిధ రకాల స్పెషల్ ఎడిషన్‌లో విపణిలోకి విడుదల చేసి సొమ్ము చేసుకునేవి. అయితే టాటా మోటార్స్ ఇప్పటి వరకు ఇలా ప్రయత్నంచింది లేదు. అయితే టాటా మోటార్స్ చరిత్రలోనే భారీ విజయాన్ని తెచ్చిపెట్టిన టియాగోను తొలి ప్రయత్నంగా ఇప్పుడు విజ్ ఎడిషన్‌లో సిద్దం చేసింది.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Tiago Wizz Limited Edition Spotted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X