TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
టాటా టిగోర్ ఆటోమేటిక్ విడుదల: ప్రారంభ ధర రూ. 5.75 లక్షలు
టాటా మోటార్స్ తమ టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ కారును ఆటోమేటిక్ వెర్షన్‌లో మార్కెట్లోకి లాంచ్ చేసింది. టాటా టిగోర్ ఏఎమ్‌టి వేరియంట్ ప్రారంభ ధర రూ. 5.75 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
టాటా మోటార్స్ టిగోర్ ఏఎమ్‌టి కారును నిశ్శబ్దంగా లాంచ్ చేసిన అనంతరం వెబ్‌సైట్లో టిగోర్ ఏఎమ్‌టి వేరియంట్లను చేర్చింది. వెబ్‌సైట్ అప్‌డేట్స్ ప్రకారం, టిగోర్ ఏఎమ్‌టి ఎక్స్‌టిఎ మరియు ఎక్స్‌జడ్ఎ పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది.
టిగోర్ రెగ్యులర్ ఎక్స్‌టి మరియు ఎక్స్‌జడ్ వేరియంట్లతో పోల్చుకుంటే వీటి ఎక్స్‌టిఎ మరియు ఎక్స్‌జడ్ఎ వేరియంట్ల ధరలు రూ. 40,000 ల వరకు అదనంగా ఉన్నాయి. రెగ్యులర్ వెర్షన్ టిగోర్ పెట్రోల్ వేరియంట్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్సన్‌లో లభిస్తున్నాయి.
టిగోర్ ఏఎమ్‌టి వేరియంట్లు | ధరలు |
టిగోర్ఎక్స్‌టిఎ | రూ. 5.75 లక్షలు |
టిగోర్ఎక్స్‌జడ్ఎ | రూ. 6.22 లక్షలు |
సరికొత్త టిగోర్ ఏఎమ్‌టిలో 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది వరకు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లభించే అదే ఇంజన్ ఇందులో కూడా ఉంది. ఇది 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
Trending On DriveSpark Telugu:
మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?
నవంబరులో విడుదలకు సిద్దమైన కొత్త కార్లు: పూర్తి వివరాలు...
నవంబర్ 7 న వస్తున్న సుజుకి ఇంట్రూడర్ 150
టాటా టిగోర్ ఏఎమ్‌టిలోని ఎక్స్‌టిఎ మరియు ఎక్స్‌జడ్ఎ రెండు వేరియంట్లో కూడా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటి, న్యావిగేషన్ మరియు స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్ ఉన్నాయి.
టిగోర్ ఎక్స్‌టిఎ వేరియంట్లో స్టీల్ వీల్స్, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అదే విధంగా, ఎక్స్‌జడ్ఎ వేరియంట్లో 4 స్పీకర్లు మరియు రెండు ట్వీటర్లు గల ఆడియో సిస్టమ్ మరియు 15-అంగుళాల పరిమాణం గల స్పోర్టివ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్లను ఎంచుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించిన నాలుగు మోడళ్లను ఏఎమ్‌టిలో కూడా పరిచయం చేసే పనిలో టిగోర్ కాంపాక్ట్ సెడాన్‌లో ఏఎమ్‌టి పరిచయం చేసింది.
టిగోర్ కారులో ఏఎమ్‌టి లేదని నిరాశచెందే వారికి ఇదొక గుడ్ న్యూస్ అయితే, ఈ సెగ్మెంట్లో ఉన్న మారుతి డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, టయోటా ఎటియోస్ మరియు హోండా అమేజ్ కార్లకు ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.