టాటా టిగోర్: ఇంజన్, మైలేజ్, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:

టాటా మోటార్స్ నుండి విడుదలకు సిద్దంగా ఉన్న టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ మార్చి 29, 2017 న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. టాటా తమ టిగోర్ మీడియా డ్రైవ్‌కు డ్రైవ్‌స్పార్క్ బృందాన్ని ఆవిష్కరించింది. మీడియా ప్రతినిధుల అవగాహన కోస టాటా వెల్లడించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఇంజన్, మరియు ఇతర వివరాలతో పాటు టిగోర్ ఫోటోలను ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టాటా టిగోర్ మీడియా లాంచ్

టాటా మోటార్స్ నూతన డిజైన్ ఫిలాసఫి ఇంపాక్ట్ ఆధారంగా రూపొందించిన టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు హెక్సా ఎస్‌యూవీ తరువాత మూడవ ఉత్పత్తిగా టిగోర్ సెడాన్‌ను విడుదలకు సిద్దం చేసింది. దీని రియర్ డిజైన్ ఆధారంగా దీనికి స్టైల్ బ్యాక్ సెడాన్ అనే ట్యాగ్‌లైన్‌తో పిలుస్తోంది.

టాటా టిగోర్ మీడియా లాంచ్

టిగోర్ తన విభిన్నమన రియర్ డిజైన్ ఆధారంగా ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి డిజైర్, ఫోర్డ్ ఆస్పైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు విపణిలో ఇదే సెగ్మెంట్లో ఉన్న కాంపాక్ట్ సెడాన్లకు గట్టి పోటీనివ్వనుంది.

టాటా టిగోర్ ఇంజన్ వివరాలు

టాటా టిగోర్ ఇంజన్ వివరాలు

టాటా మోటార్స్ టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ కారును పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో విడుదల చేయనుంది. అందులో పెట్రోల్ వేరియంట్ కోసం 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల రివట్రాన్ ఇంజన్ కలదు.

టాటా టిగోర్ మీడియా లాంచ్

ఈ 1.2-లీటర్ పెట్రోల్ యంత్రము గరిష్టంగా 83బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి అనుసంధానం చేసిన 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

టాటా టిగోర్ మీడియా లాంచ్

టిగోర్ లోని డీజల్ వేరియంట్ విషయానికి వస్తే, ఇందులో 1.05-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల రివొటార్క్ డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 69బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

టాటా టిగోర్ కొలతలు

టాటా టిగోర్ కొలతలు

టాటా టిగోర్ కొలతల పరంగా సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి చేరింది. టిగోర్ పొడవు 3992ఎమ్ఎమ్, వెడల్పు 1677ఎమ్ఎమ్, ఎత్తు 1537ఎమ్ఎమ్, వీల్ బేస్ 2450ఎమ్ఎమ్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 170ఎమ్ఎమ్ గా ఉంది.

టాటా టిగోర్ మీడియా లాంచ్

పెట్రోల్ వేరియంట్ టాటా టిగోర్ బరువు 1062 కిలోలు మరియు డీజల్ వేరియంట్ టిగోర్ బరువు 1130 కిలోలుగా ఉంది.

టాటా టిగోర్ ఫీచర్లు

టాటా టిగోర్ ఫీచర్లు

టాటా టియాగో యొక్క ఫ్రంట్ డిజైన్‌ను టిగోర్ అలాగే కొనసాగించింది. ముందు వైపు డిజైన్‌లో పొగచూరిన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ కలవు.

టాటా టిగోర్ మీడియా లాంచ్

టాటా తమ టిగోర్ రియర్ డిజైన్‌లో కాస్త గుండ్రటి ఆకారాన్ని పోలి ఉండే టెయిల్ లైట్ క్లస్టర్, రూఫ్ మౌంటెడ్ స్టాప్ లైట్లను అందించింది. ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ వేరియంట్ 15-అంగుళాల మరియు డీజల్ వేరియంట్ 14-అంగుళాల అల్లాయ్ చక్రాలను కలిగి ఉంది.

టాటా టిగోర్ ఇంటీరియర్ ఫీచర్లు

టాటా టిగోర్ ఇంటీరియర్ ఫీచర్లు

టిగోర్ ఇంటీరియర్‌లో హార్మన్ కంపెనీకి చెందిన తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎనిమిది స్పీకర్లు కలవు. ఏయుఎక్స్, యుఎస్‌బి మరియు బ్లూటూత్ కనెక్టివిటి లతో పాటు, అదనంగా స్మార్ట్ ఫోన్ ఆధారిత న్యావిగేషన్ సిస్టమ్‌ మరియు స్టీరింగ్ వీల్ ఆధారిత ఆడియో కంట్రోల్స్ కలవు.

టాటా టిగోర్ మీడియా లాంచ్

టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్‌లో ఎలక్ట్రానిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్, టిల్ట్ స్టీరింగ్ వీల్, డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ పవర్ విండో, డిలే ఫంక్షన్ మరియు ఇంకా ఎన్నో ఫీచర్లున్నాయి.

టాటా టిగోర్ మీడియా లాంచ్

టాటా టిగోర్ ఇంటీరియర్ చూడ్డానికి పూర్తిగా టియాగో ఇంటీరియర్‌నే పోలి ఉంటుంది. పూర్తి స్థాయిలో బ్లాక్ ఫినిష్ క్యాబిన్, మూడు స్పోక్స్ గల ఎలక్ట్రికల్లీ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్, సీట్లు మరియు ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే కలదు. నలుపు రంగులో ఉన్న డోర్ హ్యాండిల్స్ మరియు ఎక్ట్సీరియర్ కలర్‌లో ఉన్నఏ/సి వెంట్స్ అదే విధంగా 419లీటర్ సామర్థ్యపు స్టోరేజ్ సామర్థ్యం కలదు.

సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్లు

టిగోర్ లోని ఫ్రంట్ వీల్స్‌కు డిస్క్ బ్రేకులు మరియు రియర్ వీల్స్‌కు డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. అంతే కాకుండా ఈ టిగోర్ సెడాన్‌లో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 3-పాయింట్ సీట్ బెల్ట్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, సెట్రల్ లాక్ మరియు స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఫీచర్లు ఉన్నాయి.

మరిన్ని టాటా టిగోర్ ఫోటోలను వీక్షించండి...

టాటా హెక్సా ఎస్‌యూవీ ఫోటోలను వీక్షించండి.....

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫోటోలను వీక్షించండి....

మారుతి సుజుకి ఇగ్నిస్ క్రాసోవర్ ఫోటోలను వీక్షించండి....

 
English summary
Tata Tigor in telugu: Spesifications, Features, Photos and more details
Story first published: Saturday, March 18, 2017, 11:33 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark